Thursday, November 5, 2009

విద్యాహక్కు అమలవుతుందా ?

మంచి పౌరుడుగా ఉండడానికి, దేశం అభివృద్ధి చెందడానికి విద్య అవసరం. చదువురాని వాళ్ళలో గొప్పవాళ్ళు ఉండవచ్చు. కానీ చదువు ఉంటే గొప్పదనం ఇంకా ప్రకాశిస్తుంది. విద్యాహక్కుఅనేది మానవ హక్కు. ఈ ఆధునిక సమయంలో మనిషి మనిషిగా బతకాలంటే విద్య అవసరం. ననిషి మనిషిగా బతకడానికి అవసరమైన హక్కులన్నీ మానవహక్కులే. విద్యాహక్కు అనేది మానవ హక్కే కాదు, మౌలికమైన హక్కు. మానవ హక్కుల గురించిన యూరోపియన్‌ ఒప్పందంలోని ఆర్టికల్‌ 2లో ఈ హక్కును గుర్తించారు. మన దేశం ఆ ఒప్పందంపై సంతకం చేసింది.

మన రాజ్యాంగాన్ని తయారు చేసిన రోజుల్లో విద్యాహక్కు ప్రాధాన్యతను గుర్తించారు. అయితే దానిని ప్రాథమిక హక్కు ల్లో చేర్చలేదు. ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. రాజ్యాంగంలోని అధికరణ 45 ప్రకారం- ఆరు సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యేవరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణ, విద్యా వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. బాల బాలికలకు నిర్బంధ విద్యను రాజ్యం అందించాలి. ఒక దశాబ్ద కాలం లో ఈ లక్ష్యాన్ని రాజ్యం సాధించాలి. ఈ ఒక్క అధికరణకే కాలపరిమితిని నిర్దేశించారు. మిగతా అధికరణాలకు ఇలాంటి కాలపరిమితి లేదు. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు, ఆ తరువాత పార్లమెంటు విద్య అందించే విషయంలో అత్యంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. 46వ అధికరణ ప్రకారం విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. కానీ ఆ విధంగా జరగలేదు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉచిత నిర్బంధ విద్య అందే పరిస్థితి ఏర్పడలేదు.

రాజ్యాంగం అభయం ఇచ్చిన జీవించే హక్కును చట్టపరమైన పద్ధతుల ప్రకారం తప్ప వేరే రకంగా ఆశించే అవకాశం లేదు. జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించే హక్కు అని సుప్రీంకోర్టు మేనకా గాంధి కేసులో ప్రకటించింది. గౌరవంగా జీవించాలంటే విద్య ఉండాలి. అందుకని విద్యాహక్కు అనేది జీవించే హక్కులో మిళితమై ఉందని సుప్రీంకోర్టు మోహిని గిరి కేసులో ప్రకటించింది. ఒక వ్యక్తి గౌరవంగా జీవించాలంటే ఆ వ్యక్తికి విద్య అత్యంత అవసరం. ఆర్టికల్‌ 21కి మోహిని జైన్‌ కేసులో ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ఉన్ని క్రిష్ణన్‌ కేసులో మరింత విస్తృత పరచింది. విద్యాహక్కు అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, ఆ హక్కును అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని కూడా సూచించింది.

2002 సంవత్సరంలో ప్రభుత్వం ఉన్ని క్రిష్ణన్‌ కేసు తీర్పుపై స్పందించింది. ఆ ఫలితమే రాజ్యాంగానికి వచ్చిన 86వ సవరణ. మొట్టమొదటి సారిగా రాజ్యాంగంలో కొత్త అధికరణ ప్రవేశించింది. అదే ఆర్టికల్‌ 21.ఎ. ఈ అధికరణం ప్రకారం- 6 సంవత్సరాలనుంచి 14 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలలకు రాజ్యం విధిగా ఉచిత నిర్బంధ విద్యను ప్రసాదించాలి.

సుప్రీంకోర్టు ఉన్ని క్రిష్టన్‌ తీర్పు ప్రకటించిన తొమ్మిది సంవత్సరాల తరువాత ఆర్టికల్‌ 21.ఎ వచ్చింది. ఆ తరువాత ‘విద్యాచట్టం- 2008’ అమలులోకి వచ్చింది. ఈ కొత్తచట్టం ద్వారా నిర్బంధ ప్రాథమిక విద్యను అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై, స్థానిక ప్రభుత్వాలపై ఉంది. ఉచితంగా విద్యను అందించే బాధ్యత రెండు పైభుత్వాలపై సె.8, సె.9 ప్రకారం ఉంది. అందువల్ల చట్టం ఉద్దేశ్యం, ఆర్టికల్‌ 21.ఎ లక్ష్యం దెబ్బతింటాయనిపిస్తుంది. ఏదైనా ప్రాంతంలో ఏ ప్రభుత్వమైనా నిర్బంధ ఉచిత వ్యిను అందించనప్పుడు ఎవరిని బాధ్యులను చేయాలో తెలియని పరిస్థితి. స్థానిక ప్రభుత్వాలకు నిధుల కొరత ఉంటుంది.అటువంటప్పుడు అవి ఈ బాధ్యతను నిర్వర్తించే పరిస్థితి ఉంటుందా?

ఈ చట్టంలో ఒక ముఖ్యమైన నిబంధనను ఏర్పరచారు. అదే సె.13. ఈ నిబంధన ప్రకారం ఏ స్కూలు కూడా పిల్లలకు అడ్మిషన్‌ ఇస్తున్నపుడు కాపిటీషన్‌ ఫీజును వసూలు చేయకూడదు. అదే విధంగా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహిచకూడదు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కాపిటేషన్‌ ఫీజును వసూలు చేస్తే వారికి జరిమానా విధించే అవకాశం ఉంది. వాళ్ళు వసూలు చేసిన కాపిటేషన్‌ ఫీజుకు పది రెట్లు జరిమానా విధించే అవకాశాన్ని ఈ నిబంధన కల్పిస్తుంది. ఈ నిబంధనకు విరుద్ధంగా ఏవైనా విద్యాసంస్థలు స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహిస్తే మొదటిసారి రూ.25,000 వరకూ, రెండవ సందర్భంలో రూ. 50,000 వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.

విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ పరిధినుంచి దాటిపోయాయి. ఇప్పుడు అవి కార్పొరేట్‌ రంగంలో వర్ధిల్లుతున్నాయి. ప్రతి పౌరుడికి అవసరమైన ఈ రెండు వ్యవస్థలూ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో లేవు. ఇటువంటి పరిస్థితులలో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రభుత్వాలు అందించడం సాధ్య మేనా? కాపిటేషన్‌ ఫీజు వసూలు చేయడం అనేది ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో ఉంది. కార్పొరేట్‌ స్కూళ్ళలో అది మరో రకంగా ఉంది. బిల్డింగ్‌ ఫండ్‌, క్యాంపస్‌ అభివృద్ధి అం టూ రకరకాలుగా అవి వసూళ్ళు చేస్తాయి.

ఈ పరిస్థితులలో ఆ విద్యాసంస్థలు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లల ను చేర్చుకునే అవకాశం ఉందా? ప్రభుత్వాలు పిల్లలను ఈ స్కూళ్ళలో చేర్పించి ఫీజులు చెల్లిస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చట్టంలో లేవు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని మూడవ పార్టులో రాసి ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని ప్రజలు అనుభవించే విధంగా ఉండాలి. విద్యాచట్టం తెచ్చామని సంతోషపడడం కాదు. అది అమలు అయ్యే విధంగా నిబంధనలు రూపొందించాలి. అలా లేనప్పుడు ఆ చట్టానికి ఎంత మాత్రం విలువ ఉంటుంది?

Thursday, October 29, 2009

పూచీకత్తుతో బెయిల్‌ పొందవచ్చా ?

మన దేశంలోని కోర్టులలో మూడు కోట్ల కేసులు విచారణలో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో 2.5 కోట్లు కేసులు దిగువ కోర్టుల్లో, 40 లక్షల కేసులు వివిధ హైకోర్టుల్లో, 52,000 కేసులు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి.

కింది కోర్టుల్లో ఇన్ని కేసులు విచారణలో ఉన్న ప్పుడు క్రిమినల్‌ కేసుల విచారణ సత్వరంగా జర గడం కష్టమైన పని. విచారణ సత్వరం జరగ పోవడం వల్ల, బెయిలు పెట్టుకోలేని స్థితిలో ఉండ టం వల్ల చాలా మంది వ్యక్తులు జైళ్లలో మగ్గిపోవాల్సి వస్తుంది. నేరాలు రెండు రకాలుగా ఉంటాయి. బెయిలబుల్‌ నేరాలు, నాన్‌ బెయిలబుల్‌ నేరాలు. బెయిల్‌బుల్‌ నేరాల్లో బెయిలు పొందడం అనేది హక్కుగా ఉంటుంది. నాన్‌ బెయిలబుల్‌ నేరాల్లో బెయిల్‌ ఇవ్వడం అనేది కోర్టు విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న నేరాలను బెయిల బుల్‌ నేరాలుగా గుర్తించడం జరిగింది.

ఈ చిన్న చిన్న నేరాలు చేసిన వ్యక్తులు కూడా బెయిల్‌ పెట్టు కోలేక పోవడం వల్ల జైళ్ళల్లో మగ్గిపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో సె.436లో ప్రొవిసోని అన్న కొత్త నిబంధన ఏర్పాటు చేశారు. ఈ నిబంధన ప్రకారం విచారణలో ఉన్న ఖైదీలు వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదలయ్యే అవకాశం లభించింది.
కేసు దర్యాప్తు సమయంలో గానీ, కేసు విచారణ దశలో గానీ ఎంకై్వరీ దశలో గానీ ఎవరైనా విచా రణలో ఉన్న ఖైదీ జామీను పెట్టుకోలేని పరిస్థితుల్లో జైల్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదలయ్యే అవకాశాన్ని ఈ నిబంధన కల్పిస్తుంది.

అయితే ఆ వ్యక్తి బెయిల్‌బుల్‌ నేరంలో ముద్దాయి అయి ఉండాలి. అతనికి బెయిలు మంజూరై, జామీ ను పెట్టుకోలేని పరిస్థితులలో ఉండాలి. అరెస్టు అయి 7 రోజుల నుంచి కస్టడీలో ఉండి ఉండాలి. ఈ మూ డు పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వ్యక్తి వ్యక్తిగత పూచీ కత్తు మీద విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టు రిమాండ్‌ చేసిన తేదీ నుంచి లేదా పోలీసులు అరెస్టు చేసిన తేదీ నుంచి ఏడు రోజులను లెక్కకట్టవలసి ఉం టుంది. ఈ నిబంధన అమల్లోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కొంత మంది 7 రోజులు దాటిన తరువాత కూడా కాలం తరబడి బెయిల్‌బుల్‌ నేరాల్లో జైళ్ళల్లో ఉండి పోతున్నారు. ఈ నిబంధనలోని ప్రొవి సో ప్రకారం మేజిస్ట్రేట్‌ విధిగా వాళ్ళని వ్యక్తిగత పూచీ కత్తు మీద విడుదల చేయాల్సి ఉంటుంది.

సె-436: క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.436లో ప్రొవిసోతో పాటు, సె.436ఎ అన్న కొత్త నిబంధనని కూడా ఏర్పరిచారు. ఈ నిబంధన ప్రకా రం నాన్‌ బెయిల్‌బుల్‌ నేరాల్లో కూడా కొన్ని సంద ర్భాలలో బెయిల్‌ మీద విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మరణ శిక్ష విధించడానికి అవకాశం ఉన్న నేరారోపణలను ఎదుర్కొంటున్న ముద్దాయికి ఈ నిబంధన వర్తించదు. మరణ శిక్ష విధించడానికి అవకాశం లేని నేరాల్లో విచారణలో ఉన్న ఖైదీ నేర స్వభావాలతో సంబంధం లేకుండా బెయిలు పొందే అవకాశం ఉంటుంది. ఆ నేరానికి విధించే గరిష్ట శిక్షలో సగభాగం శిక్ష ఆ ఖైదీ అనుభవించి ఉండాలి.

ఇలాంటి సందర్భాలలో కొర్టు ప్రాసిక్యూటర్‌ వాద నలు విని ఆ ఖైదీ విడుదల కోసం ఆదేశాలను జారీ చే యవచ్చు. అతన్ని వ్యక్తిగత పూచీకత్తు మీద గానీ, జామీను పైన గానీ విడుదల చేయమని ఆదేశించవ చ్చు. బెయిల్‌పై విడుదల చేసే ముందు ఆ విధంగా విడుదల చేయడానికి గల కారణాలను కోర్టు తన ఆదేశాల్లో చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ విడు దల చేయడానికి నిరాకరించినప్పుడు కూడా కోర్టు కారణాలను తన తీర్పులో చెప్పాల్సి ఉంటుంది.

ఈ రెండు నిబంధనలను చట్టంలో కొత్తగా ఏర్పరి చారు. ఇవి కాకుండా కూడా ఇంకో నిబంధన చట్టం లో ఉంది. అదే సె.167 (2). క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని ఈ నిబంధన ప్రకారం కూడా కేసు దర్యాప్తు దశలో విచారణలో ఉన్న ఖైదీలను విడుదల చేయ వచ్చు. 10 సంవత్సరాలు గానీ, అంతకు మించి గా నీ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో పోలీసుల దర్యాప్తు ముద్దాయిని అరెస్టు చేసిన తేదీ నుంచి 90 రోజుల్లోగా పూర్తి కావాలి. ఒక వేళ ఆ విధంగా దర్యా ప్తు పూర్తి కానప్పుడు ముద్దాయిని కేసులోని యోగ్య తలతో నిమిత్తం లేకుండా బెయిలుపై విడుదల చే యాల్సి ఉంటుంది. కోర్టులు జామీను కోరవచ్చు. అదే విధంగా మిగతా కేసుల్లో దర్యాప్తు 60 రోజు ల్లోగా పూర్తి కావాలి. ఒక వేళ దర్యాప్తు 60 రోజు ల్లోగా పూర్తి కాకపోతే ముద్దాయిని బెయిలుపై విడు దల చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా కోర్టులు జామీను కోరవచ్చు.

ఎలాంటి జామీను లేకుండా విడుదల కావడానికి అవకాశం ఉన్న ఒకే ఒక నిబంధన క్రిమినల్‌ ప్రొసీ జర్‌ కోడ్‌లోని సె.436లోని ప్రొవిసో. ఇక్కడ జామీ ను కావాలని కోరే అవకాశం కోర్టుకి లేదు. జైళ్లని సందర్శించినప్పుడు చాలా మంది మామూలు ఖైదీలే, అంటే చిన్న చిన్న నేరాలు చేసిన వ్యక్తులే ఎక్కువ మం ది కన్పిస్తారు. అలా అన్నీ బెయిల్‌బుల్‌ నేరాలే. అలాంటి నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులు వ్యక్తి గత పూచీకత్తుపై విడుదల కావొచ్చు. అయితే ఇది మొదటి దశలో కాదు. అరెస్టు అయిన 7 రోజుల తరువాత మాత్రమే ఇలాంటి అవకాశం సంక్రమి స్తుంది. 7 రోజుల తరువాత జామీను కావాలని కోర్టు కోరే అవకాశం లేదు. విధిగా వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయాల్సి ఉంటుంది.
ఈ నిబంధనను కోర్టులు, విచారణలో ఉన్న ఖైదీ లు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉపయోగించుకున్నప్పుడు కేసుల సంఖ్య తగ్గక పోయినా జైళ్లల్లో ముద్దాయిల సంఖ్య తగ్గుతుంది.

Wednesday, October 21, 2009

రోడ్డు ప్రమాదాలు -బాధితులు

రోడ్డు ప్రమాదాలు -బాధితులు

సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ వాహనాల డ్రైవర్లు ఆ వాహనాల్ని అక్కడే వదిలేసి పారిపోతుంటారు. వీలైతే మరికొన్ని సార్లు వాహనం కూడా తీసుకునే పారిపోతుంటారు. ప్రమాదానికి గురైన వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో పట్టించుకోకుండా, అతనికి కనీస వైద్య సదుపాయాల్ని కల్పించాలన్న కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తి స్తుంటారు.సరైన సమయానికి వైద్యసదుపాయాలు అందినట్లైతే కొన్ని సందర్భాలలో ప్రమాదానికి గురైన వ్యక్తులు బతికే అవకాశాలు ఉండవచ్చు. బతికే అవకాశం ఉన్నప్పటికీ ప్రమాదానికి కారకులైన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల బాధితులు ప్రాణాలు కోల్పోవచ్చు.

మోటారు ప్రమాదానికి గురైన వ్యక్తికి తక్షణ సదుపాయాలు కల్పించడం అందుకు కారకుడైన డ్రైవర్‌ కనీస భాద్యత. అవస రమైతే అతన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించాలి. అయితే అ లా తరలించడం ఆ బాధితుని ఇష్టానికి వ్యతిరేకంగా జరుగ కూడదు. ఒక్కోసారి ప్రమాదానికి గురైన వ్యక్తి పొరపాటు వల్లనే ప్రమాదం జరగవచ్చు. ఆ వ్యక్తిని ప్రమాద స్థలం నుంచి తొల గించడం వల్ల ఆ సాక్ష్యం రూపు మారిపోవుచ్చు. అందుకని పోలీ సుల సహాయాన్ని తీసుకొని నేర స్థల స్కెచ్‌ తయారు చేసిన తరు వాతే తరలించాలి. రెండు వాహనాలు ఢీకొని ప్రమాదం జరిగి నపుడు ఏ వాహనం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందో తెలుసు కోవడానికి వాటి స్థానాలను, అలాగే ప్రమాదానికి గురైన వ్యక్తి స్థానాన్ని గుర్తించడం అవసరమవుతుంది.

పోలీసులు దరిదా పుల్లో లేనప్పుడు తప్పనిసరిగా అతన్ని ఆసుపత్రికి తరలించాలి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పోలీస్‌ అధికారులు ఎవరూ లేనట్లైతే ఆ ప్రమాద సమాచారాన్ని దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో సాధ్యమైనంత త్వరగా తెలియపరచాలి. ప్రమాదం జరిగి, ఆ ప్రమాదంలో బాధితుడైన వ్యక్తిని ఆసుపత్రికి తరలిద్దాం అను కునేంతలో అక్కడ గుమికూడిన జనం ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌కి హాని తలపెట్టే అవకాశం ఉన్నప్పుడు అతను నేర స్థలం నుంచి పారిపోవడంలో తప్పులేదు. పారిపోయినా వెంటనే అత ను ప్రమాద విషయాన్ని పోలీసులకు తెలియచేయాలి. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోవలసి వచ్చిందని కూడా తెలియచేయాలి.

ఏదైనా ప్రమాదం జరిగి వాహనాల రాకపోకల కు అంతరాయం ఏర్పడినప్పుడు డ్రైవర్‌ తనంతట తానుగా వాహనం స్థానాన్ని తొలగించకూడదు. పోలీసు అధికారులు వచ్చి నేరస్థుల పంచనామా చేసిన తరువాతనే వాహనాలను ఆ యా స్థానాల నుంచి తొలగించాలి. వాహనానికి సంబంధించిన వివరాలు, దాని రిజిస్ట్రేషన్‌, ఇన్స్యూరెన్స్‌, వాహన యజమాని వివరాలను పోలీసులు కోరినప్పుడు తెలియచేయాల్సిన భాద్యత ఆ డ్రైవర్‌ మీద ఉంటుంది. ఈ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల్లోగా అంద చేయాల్సి ఉంటుంది.

బాధితుడు అతని సంబంధికులు తీసుకోవలసిన జాగ్రత్తలు
ప్రమాదం కలగజేసిన చేసిన వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబరు గుర్తు పెట్టుకోవాలి. వీలుంటే ప్రమాదానికి గురిచేసిన డ్రైవరు పేరు, వయస్సు, అడ్రసు మెదలగు వివరాలు తెలుసుకోవాలి. పోలీసులు వచ్చి పంచనామా చేసే వరకూ వాహనాన్ని అక్కడ నుంచి కదలించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రమాదం గురిం చిన ప్రాథమిక సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా సమీప పరిధిలో గల పోలీస్‌ స్టేషన్‌లో తెలియపరచాలి. త్వరగా తెలియ చేయడం వల్ల పోలీసులు త్వరగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత మంది సాక్ష్యులను పోలీసులు విచా రించేలా ప్రయత్నించాలి. ప్రత్యక్షసాక్షులు ప్రమాద స్థలంలో ఉండేట్టు చేసుకోవాలి. బాధితుడు ప్రాణాలతో ఉన్నట్లైతే అతణ్ణి సమీప ఆసుపత్రికి తరలించి సరైన వైద్యసదుపాయాలు పొందే వీలు కల్పించాలి.

నేరం జరిగిన స్థలంలో గుర్తులు చెదరక ముందే వివిధ కోణాల్లో ఫోటోలు తీయించే ఏర్పాటు చేయాలి. బాధితుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందితే ఆ డాక్టర్‌ నుంచి మెడికల్‌ సర్టిఫికెట్‌ పొందాలి (ఆ సర్టిఫికేట్‌ వల్ల అతనికి తగిలిన గాయాల తీవ్రతను తెలుసుకునే అవకాశం ఉంటుంది). దుడుకు తనం లేదా నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చేసిన వ్యక్తిపై పోలీసులు తప్పని సరిగా క్రిమినల్‌ కేసులు పెడతారు. ఒక వేళ పెట్టనట్లైతే అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలి. వాటి ఫలితాలు తెలుసుకోవాలి. క్రిమినల్‌ కేసు ఫలితం ట్రిబ్యునల్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపదు. కానీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఆ కేసులో రుజువైనట్లెతే అది కొంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రమాదంలో బాధితుడు చనిపోయినట్లైతే అతని శవాన్ని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష చేయించాలి. ఆ పరీక్ష నివేదిక వల్ల అతని మరణానికి దారి తీసిన కారణాలను రుజువు పరచడానికి వీలుంటుంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను చికిత్సకోసం డాక్టర్ల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, వారు ఆ వ్యక్తులకు అవసరమైన చికిత్సను సత్వరం అందచేయాలి. అంతే కానీ పోలీసులు వచ్చే వరకు తాము ఏ చికిత్స చేయబోమని తెలపడం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని సూచించడం కూడదు. సత్వ ర చికిత్స అందచేయడం వైద్యుల పైన ఉన్న కనీస బాధ్యత.

Thursday, October 15, 2009

గృహిణుల చాకిరీకి వెల కట్టగలమా ?

గృహిణుల చాకిరీకి వెల కట్టగలమా ?

ఉద్యోగం చేయని మహిళల పనికి మన సమాజంలో గుర్తింపు లేదు. ఇంటినీ, సంసారాన్ని చక్కదిద్దే పనికి విలువ లేదు. దాన్ని వెలకట్టలేం కానీ వెలకట్టే ముందు కోర్టులు మగవాడి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మహిళ మృతి చెందితే ఆమె ఆదాయాన్ని తెలుసుకోవడం అవసరం. ఆమె ఆదాయాన్ని, ఆమె జీవన ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు ఆమె వారసులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని నిర్ధారిస్తాయి. ఆమెకు ఏమైనా బలమైన గాయాలు ఆయితే ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహా రానికి కూడా ఆమె ఆదాయ వివరాలు అవసరం. ఆమె ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి ఆమె జీతాన్ని, ఆదాయాన్ని అంచనా వేయలేం.

కోర్టులు నష్టపరిహారాలను చెల్లించే ముందు వివిధ అంశా లను పరిగణనలోకి తీసుకుంటాయి. భావ సారూప్యం కలిగిన అన్ని కేసుల్లోని నష్టపరిహార మొత్తాలన్నీ ఒకేలా ఉండాలని లేదు. అందుకని ఒక్కో కేసులోని పరిస్థితులను బట్టి ఒక్కో రకమైన అవార్డుని కోర్టులు నిర్ధారిస్తాయి. ఒకే విధంగా అనిపిస్తున్న ప్రతి కేసులో ఒకే రకమైన నష్టపరిహార మొత్తాన్ని నిర్ణయించాలని శాసనంలో ఎక్కడా పేర్కొనలేదు. ఒక్కో కేసు లోని వివిధ అంశాలను బట్టి నష్టపరిహార మొత్తాలను తమకు న్యాయబద్ధంగా తోచిన విధంగా కోర్టులు నిర్ణయిస్తాయి.

వ్యక్తిగత గాయాలకు నష్టపరిహారం నిర్ణయించడంలో కోర్టు లు ప్రధానంగా, ఆ వ్యక్తికి ఆ గాయాలు కానట్లైతే అతను ఎంతైతే సంపాదించేవాడో ఆ మొత్తాన్ని అతనికి చెందేటట్టుగా నిర్ణయిస్తాయి. అంతే కాకుండా ఆ గాయాల వల్ల బాధితునికి కలిగిన బాధను, వేదనను దృష్టిలో ఉంచుకొని నష్టపరిహార మొత్తాన్ని నిర్ణయిస్తాయి. బాధితునికి కలిగిన బాధనీ, వేదనని డబ్బుతో కొలవలేం. ఆ నష్టాన్ని కోర్టులు ఏ విధంగా పూరించ లేవు. కాబట్టి డబ్బు ద్వారా ఆ నష్టాన్ని పూరించడానికి ప్రయత్నిస్తాయి.
ఎవరైనా వ్యక్తి ప్రమాదంలో మరణించినప్పుడు, ఆ వ్యక్తి ఎంతకాలం వరకు జీవించేవాడో పరగణనలోకి తీసుకొని ఆ కాలపరిమితిలో అతని చట్టబద్ధ ప్రతినిధులకు ఎంత ఆదా యం లభించేదో ఆ మొత్తాన్ని నష్టపరిహార రూపకంగా ట్రిబ్యు నళ్ళు నిర్ధారిస్తాయి. అయితే గృహిణులకు ఎలాంటి ఆదాయం ఉండదు.మరి ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు?ఈ పరిస్థితులను గమనించి మోటారు వాహన చట్టంలో రెండవ షెడ్యూలును ఏర్పాటు చేశారు. ఆ రెండవ షెడ్యూలు ప్రకారం దంపతుల్లో ఎవరికైనా ఎలాంటి సంపాదన లేనప్పుడు, అందులో రెండవ వారికి సంపాదన ఉన్నప్పుడు ఆ సంపాదిస్తున్న వ్యక్తి ఆదాయంలో మూడవ వంతుగా వారి ఆదాయాన్ని నిర్ణయించాలి.

అంటే గృహిణుల ఆదాయాన్ని ఉద్యోగం చేస్తున్న భర్త ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టులు నిర్ణయించి నష్టపరిహారాన్ని మంజూరు చెయ్యాలి. ఆ విధంగా గృహిణుల ఆదాయాన్ని పరిగణన లోకి తీసుకోవడం సరైందేనా? ఇలాంటి ప్రశ్నే మద్రాస్‌ హైకోర్టు ఓ కేసులో వేసుకుంది. నేషనల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ వర్సెస్‌ దీపికా కేసులో హైకోర్టు న్యాయమూర్తి ప్రభాశ్రీ దేవన్‌ ఇలాంటి ప్రశ్నే వేసి విషయం గురించి తిరిగి పునఃపరిశీలించాలని కోర్టు అభిప్రాయపడింది.

గృిహణులు ఇంట్లో చేస్తున్న చాకిరినీ, సేవలను మగవాడి జీతంతో కొలవడం సరైందేనా? ఒక వేళ కొలిచినా అతని ఆదా యంలో మూడవ వంతుగా స్వీకరించడం సమంజసమేనా? ఇవీ కోర్టు ఈ తీర్పులో లెవనెత్తిన ప్రశ్నలు 1995లో స్ర్తీల మీద అన్ని రకాల హింసల నుండి విముక్తి (ఇ్ఛఛ్చీఠీ) పత్రం మీద భారత దేశం కూడా సంతకం చేసింది. అంటే మహిళల అభివృద్ధి గురించి మన దేశం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.ఎలాంటి ప్రతి ఫలం లేకుండా మహిళలు చేసే ఇంటి చాిరీకీ ఈ ఒప్పంద పత్రం ప్రకారం కూడా సరైన విలువ కట్ట వలసిన బాధ్యత భారత దేశంపై ఉందని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. మహిళలు ఇంటి బాగు కోసం, అభివృద్ధి కోసం చేసే సేవల వల్ల ఆ ఇల్లు బాగుపడుతుంది. ఫలితంగా దేశం అభివృద్ధి చెందుతుంది. కోర్టు ఈ విధంగా అభిప్రా యపడింది.

హోమ్‌మేడమ్‌ను ఎవరూ విస్మరించరాదు. మర్చిపో కూడదు ఇంటి కార్యభారం తన తల మీద వేసుకొని మగవాడిని విముక్తి చేస్తుంది. అందువల్ల అతను తన పూర్తి సమయాన్ని, దృష్టిని తన సంపాదన మీద, తన ఉద్యోగం మీద పెట్టే అవకా శం కలుగుతుంది. మగవాడు ఆస్తి సంపాదించడానికి ఆమె ఉపకరిస్తుంది’.ఈ నేపథ్యంలో మోటారు వాహన చట్టంలోని రెండవ షెడ్యూలును శాసన కర్తలు తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి కాదు, వైవాహిక ఆస్తిలో వాటా ఇచ్చే విషయంలో కూడా ఈ విషయాన్ని చూడాల్సి ఉంటుంది.

గృహిణుల ఇంటి చాకిరీ గురించి కొత్త కోణంలో ఆలో చించన తీర్పు ఇది. రోటీన్‌గా వచ్చే తీర్పులకి భిన్నమైనది. మగ వాడు ఆస్తిని సంపాదించడంలో గృహిణుల ప్రత్యక్ష సహాయం లేకపోవచ్చు. కానీ పరోక్ష సహాయం ఉంది. ఆర్థికంగా వాళ్ళు ఆస్తి కొనుగొలుతో సహాయం అందించకపోవచ్చు. కానీ వారి సేవల ఫలితమే మగవాడి నిర్వాకం.

ఈ తీర్పు ద్వారా మనకు రెండు విషయాలు స్పష్ట మవు తున్నాయి. మోటారు వాహన చట్టంలోని రెండవ షెడ్యూలు ప్రకారం ఇంటి సేవను, గృహిణుల ఆదాయాన్ని అంచనా వేయ డం సమంజసం కాదు. అదే విధంగా మగవాడు స్వయంగా వివాహం తరువాత సంపాదించిన ఆస్తుల్లో నిగూఢ వాటా ఆడ వాళ్ళది ఉంటుంది. భవిష్యత్తులో ఈ విధంగా చట్టాలు పరి ణామం చెందే అవకాశం ఉందని అనిపిస్తుంది.

Thursday, September 24, 2009

పెరుగుతున్న లాకప్‌ మరణాలు

పెరుగుతున్న లాకప్మరణాలు

పోలీసు కస్టడీలో జ్యోతిరచన మరణించింది. ఆమె మరణానికి పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణమని పేర్కొంటూ పోలీసు అధి కారులను ఉన్నతాధికారులు సస్సెండ్‌ చేశారు. పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవడానికి ఉన్నతాధికారులు ఎలాంటి తాత్సార్యం చేయలేదు. అయితే జ్యోతి రచన ఆత్మహత్య చేసుకుందని వారి అభిప్రాయం.

పోలీసుల కస్టడీలో మరణాలు సంభవించినప్పుడు ఎలాంటి అభిప్రా యానికి రావల్సి ఉంటుంది? ఏమైనా నిజమనే భావనని తీసుకొనడానికి అవకాశం ఉందా? పోలీసు కస్టడీలో మరణాలు సంభవించినప్పుడు ఏవై నా ఇతర సాక్ష్యాలు లభించే అవకాశం ఉంటుందా? తన తోటి పోలీసు అధికారులకు వ్యతిరేకంగా ఇతర పోలీసు అధికారులు సాక్ష్యం చెప్పే అవ కాశం ఉంటుందా? ఇవీ ప్రశ్నలు. వీటికి సమాధానాలను సుప్రీంకోర్టు తీర్పుల్లోనే వెతకాల్సి ఉంటుంది.

అరెస్టు తరువాత నిర్బంధం ఉంటుంది. ఏవైనా నేరారోపణలు ఉన్న ప్పుడు పోలీసు అధికారులు ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. కొన్ని సంద ర్భాలలో ప్రైవేటు వ్యక్తులు కూడా అరెస్టు చేసే అధికారం కలిగి ఉంటారు. పోలీసు అధికారులు అరెస్టు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి అన్న విషయం గురించి రాజ్యాంగం దగ్గర నుంచి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ వరకు ఎన్నో అధికరణలు, నిబంధనలు ఉన్నాయి. ఇవి అన్నీ అరెస్టు చట్టబద్ధమైనప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ చాలా మంది వ్యక్తులని చట్టబద్ధంగా కాకుండా అరెస్టులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఆ అరెస్టు మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. అజమా యిషీ ఉండదు. మన సమాజంలో ఎలాంటి అరెస్టులు లేకుండా కొనసాగే నిర్బంధాలే ఎక్కువ.

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మన మందరం గర్వపడే విధంగా ఉన్నాయి. ఆర్టికల్‌ 21 ప్రకారం-అమల్లో ఉన్న శాసన ప్రకారం తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. ఆర్టికల్‌ 21 అక్రమ అరెస్టుల, నుంచి అక్రమ నిర్బంధాల నుండి అభ యం కల్పిస్తుంది.
ఈ ఆర్టికల్‌ ప్రకారం అరెస్టు అయిన వ్యక్తికి అరెస్టు చేయడానికి గల కారణాలను వెంటనే తెలియచేయాలి. అతనికి ఇష్టమైన న్యాయవాదితో సంప్రదించడానికి అవకాశం కల్పించాలి. ప్రయాణపు సమయం కాకు ండా 24 గంటల్లోగా అతన్ని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచాలి.

ఇవే కాకుండా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా మానవ హక్కులను, వ్యక్తి గత స్వేచ్ఛను, గౌరవాన్ని రక్షించుకోవడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. సె.57 ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని అవసరమైన సందర్భంలో మాత్రమే అరెస్టు చేసి తరువాత తమ కస్టడీలో ఉంచుకునే అధికారం పోలీసులకు ఉంది. ఆ కేసు దర్యాప్తుకు అవసరమైన కాలం వరకు మాత్రమే అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలో ఉంచుకోవచ్చు. అంటే, అవసరం లేనప్పుడు 24 గంటలు కూడా ఆ వ్యక్తిని తమ కస్టడీలో ఉంచుకునే అవ కాశం, అధికారం పోలీసులకు లేదు. వ్యక్తి స్వేచ్ఛను, జీవితాన్ని కాపా డటానికి ఇన్ని రాజ్యాంగపరమైన, శాసనపరమైన రక్షణలు ఉన్నప్పటికీ చిత్రహింసలు, కస్టడీ మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.

ఈ పరిస్థితిని గమనించి సుప్రీంకోర్టు జోగిందర్‌ కేసులో, డి.కె.బసు కేసులో మరెన్నో రణలు కల్పించింది. జోగిందర్‌ సింగ్‌ కేసులో కోర్టు ఈ విధంగా అభిప్రాయ పడింది:-‘చట్ట బద్ధమన్న కారణంగా పోలీసు అధి కారి అరెస్టులు చేయడానికి వీల్లేదు. అరెస్టు చేసే అధికారం ఉండటం ఒక ఎత్తు, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయ బద్ధత ఉందని చూపిం చడం మరొక ఎత్తు. అధికారం ఉందని అరెస్టు చేయడం కాదు, దాన్ని సమర్థించుకునేందుకు న్యాయబద్ధత కూడా ఉండాలి.

కొంత దర్యాప్తు జరిపిన తరువాత ఫిర్యాదులోని అంశాలలో నిజా యితీ ఉందని, ఆ వ్యక్తికి నేరంలో సంబంధం ఉందని సహేతుకంగా అన్పించినప్పుడు, అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తులను అరెస్టు చేయాలి. వ్యక్తి స్వేచ్ఛను నిరాకరిం చడమనేది చాలా తీవ్రమైన విషయం.
ఈ తీర్పుని, ఇంకా ఇతర తీర్పులను ఉటంకిస్తూ సుప్రీంకోర్టు డి.కె.బసు తీర్పును వెలువరించి కస్టడీ మరణాలను నివారించడానికి పద కొండు ఆవశ్యకతలను ఏర్పరచింది. ప్రభుత్వం ఆ అవశ్యకతలకు శాసన రూపం ఇచ్చే వరకు వాటిని శాసనంగా పరిగణించి పాటించాలని పోలీసు అధికారులను, దర్యాప్తు అధికారులను ఆదేశించింది. ఇవి కాకుండా జాతీ య మానవ హక్కులు కమిషన్‌ కూడా కస్టడీ మరణాలను నివారిం చడానికి కొన్ని మర్గాదర్శకాలను నిర్దేశించింది. ఇన్ని ఉన్నప్పటికీ కస్టడీ మరణాలు తగ్గు ముఖం పట్టడం లేదు. ఇందుకు కారణం అక్రమ అరెస్టు లపై పై, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, మరో రకంగా ఉదాసీనంగా ఉండడం, ప్రోత్సహించడం కారణాలు కావచ్చు.

కస్టడీలో మరణాలు జరిగినప్పుడు అవి ఆత్మహత్యలుగా పోలీసులు ప్రకటిస్తారు. స్నేహ భావంతో, సౌభ్రాతృత్వంతో అలా ప్రకటిస్తారని చాలా మంది అంటూ ఉంటారు. పోలీసుల కస్టడీల్లో మరణాలు సంభవిం చినప్పుడు, ఆ నేరానికి పాల్పడిన వ్యక్తుల మీద అభియోగాలు దాఖలు కావడం అరుదు. ఒకవేళ అవి దాఖలైనా నేరం రుజువు కావడం కష్ట సాధ్యం. ఇలాంటి సందర్భమే ఒకటి చాలా రోజుల క్రితం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అదే స్టేట్‌ ఆఫ్‌ యు.పి వర్సెస్‌ రామ్‌సాగర్‌ యాదవ్‌ కేసు (ఏ.ఐ.ఆర్‌ 1985 సుప్రీంకోర్టు 416).

సుప్రీంకోర్టు ఆ కేసులో ఈ విధంగా అభిప్రాయపడింది:-‘రైన సాక్ష్యాలు లేని కారణంగా తప్పి దాలు చేసిన పోలీసు అధికారులు తప్పించుకోకుండా చట్టాలను మార్చా ల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి మేం తెలియచేస్తున్నాం. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించినప్పుడు, గాయాల పాలైనప్పుడు అవి ఎలా జరిగాయో చెప్పడానికి అవకాశం ఉన్న వ్యక్తులు పోలీసులే. ఇంక ఎవరూ ఉండరు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా పోలీసు అధికారులు పెదవి విప్పరు. ఎందుకంటే తోటి పోలీసులపై ఉన్న సౌభ్రాతృత్వం వల్ల. అందు కని ఇలాంటి కేసుల్లో నిరూపణ భారం నేరస్థులపై ఉండే విధంగా చట్టా లను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందికస్టోడియల్నేరాలకు ఎలాంటి శిక్ష లేకుండా పోయినప్పుడు నేరస్థు లకు ఉత్సాహంగా ఉంటుంది. సమాజం నష్టపోతుంది. నేర బాధితులకు, వారి బందువులకు నిరుత్సాహం వస్తుంది. శాసనం పట్ల వ్యతిరేకత పెరు గుతుంది. కారణాల వల్ల లా కమిషన్తన 113 నివేదికలో భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో సె.114బి-ని చేర్చాలని సిఫారసు చేసింది.

ఈ సూచించిన నిబంధన ప్రకారం పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తికి గాయాలైనప్పుడు, లేదా ఎవరైనా వ్యక్తికి మరణం సంభవించినప్పుడు ఆ గాయాలు, ఆ మరణం ఏ పోలీసు అధికారి ఆధీనంలో ఉన్నప్పుడు జరిగాయో ఆ పోలీసు అధికారే ఆ గాయాలు చేశాడన్న నిజమైన భావనకి కోర్టులు రావాల్సి ఉంటుంది.
లా కమిషన్‌ ఈ సూచన చేసి, సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెలు బుచ్చి చాలా సంవత్సరాలు గడిచాయి. కానీ శాసన కర్తల నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ సిఫారసును ఇప్పటి వరకు భారతీయ సాక్ష్యా ధారాల చట్టంలో చేర్చలేదు.రోజు రోజుకీ పెరుగుతున్న కస్టడీ హింస, లాకప్‌ మరణాలు ఆ నిబం దన చేర్చడం గురించిన ఆవశ్యకతను తెలియ చేస్తున్నాయి. ఈ నిబంధ నను చేరిస్తే ఈ లాకప్‌ మరణాలు ఉండవని అనలేం కానీ, తగ్గుముఖం మాత్రం తప్పక పడతాయి.

Wednesday, September 16, 2009

ఆస్తి’ ప్రాథమిక హక్కా ?

ఆస్తిప్రాథమిక హక్కా ?

ఆస్తి హక్కు అనేది ఇప్పుడు ప్రాథమిక హక్కు కాదు. ఇది మామూలు హక్కు. 1978 సంవత్సరం వరకు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ప్రాథమిక హక్కుగా తొలగించారు. ప్రాథమిక హక్కులను పొందుపరిచిన ఆర్టికల్స్‌లోని 19(1) (ఎఫ్‌) లో ఇది ప్రాథమిక హక్కుగా ఉండేది. భారత దేశంలోని ప్రతి పౌరునికి ఇది వర్తించేది. రాజ్యాంగ 44వ సవరణల చట్టం ద్వారా ఈ హక్కును తొలగించారు. అదే విధంగా ఆర్టికల్‌ 31 ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించారు. తప్పని సరి గా భూమిని ప్రభుత్వాలు తీసుకోవలిసిన పరిస్థితి ఏర్పడి నప్పుడు నష్ట పరిహారం చెల్లించే విధంగా ఆర్టికల్‌ 31లో అవకాశం ఉండేది.

44వ సవరణల ద్వారా దీన్ని కూడ తొల గించారు. అందువల్ల రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం పొందే అవకాశాన్ని పౌరులు కోల్పోయారు. రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 30 (1ఎ) ప్రకారం, అదే విధంగా ఆర్టికల్‌ 31 ఎ (1) లోని రెండవ ప్రొవిసో ప్రకారం కొన్ని సందర్భా లలో నష్టపరిహారాన్ని రాజ్యాంగ రీత్యా పొందవచ్చు.భూసేకరణ అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా జరు గుతోంది. ప్రాజెక్టులకు, ప్రజల అవసరాలకు భూసేకరణ చేసే అవకాశం భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఉంది. ప్రైవేటు భూముల పైన కూడా ప్రభుత్వానికి ఆధి పత్యం ఉంటుంది.

రైలు మార్గాల కోసం, ప్రజా పనుల కోసం, ప్రాజెక్టుల కోసం ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వం చట్ట ప్రకారం తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకు న్నప్పుడు సముచితమైన నష్టపరిహారాన్ని ఆ వ్యక్తులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ‘ప్రజల అవ సరాలకు’ అన్న నిర్వచనం పరిధి చాలా విస్తృతమై పోయింది. గత దశాబ్ద కాలంలో ఈ నిర్వచనం పరిధి విస్తృ తమైపోయి ప్రైవేటు పరిశ్రమలకు, ప్రైవేటు గృహాలకు, కోఆపరేటివ్‌ సంస్థల కోసం, వినోదం కలిగించే ప్రాజెక్టుల కోసం, గోల్ఫ్‌ ఆట స్థలాల కోసం ఈ సేకరణలను ప్రభు త్వాలు చేయడం మొదలు పెట్టాయి.

ఈ ప్రాజెక్టులు ప్రజల అవసరాలకంటే ప్రైవేటు వ్యక్తుల అవసరాలనే ఎక్కువగా తీరుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు జీవించే హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి తోడు సెజ్‌లు వచ్చే శాయి. ఒక్క మన రాష్ట్రంలోనే వందకు పైగా సెజ్‌లు వచ్చా యి. ఈ సంస్థానాలు ఏ ప్రజల అవసరార్థంమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విదేశీ కంపెనీల అవసరాల కోసం కూడా ప్రభుత్వాలు భూసేకరణ చట్టాన్ని ఉపయోగి స్తున్నాయి. అందువల్ల దేశ ఐక్యత దెబ్బతినే పరిస్థితి నెలకొంటోంది. ఈ పరిస్థితిని గమనించిన తరువాత ఆస్తి హక్కును తిరిగి ప్రాథమిక హక్కుగా ఎందుకు ఇవ్వకూ డదన్న వాదన కూడా వస్తుంది.

భూసేకరణ గురించి కోర్టుల్లో చాలా ప్రజాహిత కేసులు దాఖలవుతున్నాయి. కలకత్తాకు చెందిన ఓ ప్రభుత్వేతర సంస్థ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత కేసుని దాఖలు చేసింది. ప్రైవేటు ఆస్తుల మీద ఉన్న ప్రభుత్వ అధిపత్యం వల్ల, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కును కాలరాస్తోందని ఆ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ దరఖాస్తును స్వీకరిస్తూ సుప్రీంకోర్టు, ఆస్తి హక్కును తిరిగి ప్రాథమిక హక్కుగా ఎందుకు మార్చకూడదన్న ప్రశ్నని ప్రభుత్వానికి వేసింది. ఫలితంగా ఆస్తిహక్కు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా తొలగించడం వల్ల పౌరులు ప్రభుత్వ చర్యను రాజ్యాంగం ప్రకారం ప్రశ్నిం చే హక్కును కోల్పోయారు. ప్రభుత్వ చర్యలను మామూలు చట్ట ప్రకారం మాత్రమే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.

రాజ్యాంగంలోని అధికరణ 300ఎ ప్రకారం ఇప్పుడు ఆస్తిహక్కు ప్రాథమిక హక్కు కాదు. అంటే ఒక వ్యక్తికి గల హక్కును శాసన బద్ధంగా తొలగించవచ్చు. అంటే భూసే కరణ చట్టం ద్వారా తొలగించవచ్చు. ఈ కారణంగా విదేశీ సంస్థలకి ఇప్పుడు దేశ పౌరుల మాదిరిగా సమాన హక్కు లు ఉన్నాయి.కలకత్తాకు చెందిన ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత కేసులో 44వ సవరణలను ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, సెలక్ట్‌ కమిటీకి నివేదిం చకుండా ఆర్టికల్‌ 19 (1) ఎఫ్‌ని తొలగించడం సమంజసం కాదని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు.

ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే చాలా సమస్య లు తలెత్తుతాయన్న వాదనలు కూడా ఉన్నాయి. దేశ అభి వృద్ధి కుంటుపడుతుందని కొంతమంది వాదనలు చేస్తున్నా రు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తిరిగి చేర్చాలన్న వాదనలు ఎన్ని ఉన్నాయో దాన్ని చేర్చకూడదన్న వాదనలు కూడా అంతే బలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అలా పక్క న పెట్టి, ఒక్క విషయం గురించి మాత్రం ఆలోచించ వచ్చు. భూసేకరణ చట్టంలో నిర్వచించిన ‘ప్రజల అవసరార్థం’ అన్న పదాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. దాని పరిధిని కుదించాల్సిన అవసరం ఉంది.

ప్రాజెక్టుల కోసం, రైలు మార్గాల కోసం, రహదారుల కోసం ప్రభుత్వాలు ప్రజల భూములను సేకరించడం సమంజసమే కానీ, ప్రైవేటు ఇండస్ట్రీల కోసం, ప్రైవేటు గృ హల కోసం, వినోదం కలిగించే ప్రాజెక్టుల కోసం, గోల్ఫ్ఆటల కోసం ప్రభుత్వాలు భూములను సేకరించి వారికి ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఇది దేశ ప్రజలను వేధి స్తున్న ప్రశ్న. భూసేకరణ ప్రజాహితం కోసం జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తుల హితం కోసం జరుగకూడదు. విషయం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. విధంగా ఆలోచించకపోతే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా చెయ్యాలన్న వాదనలు మరింత బలపడతాయి.

Tuesday, September 15, 2009

మళ్ళీ యాసిడ్‌ దాడులు

malli acid dadulu
మళ్ళీ యాసిడ్దాడులు


``బాధితురాలి దుస్థితి చూసి ఆమెకు న్యాయం చెయ్యాలంటే ఆటవిక న్యాయం అవసరమని అనిపిస్తుంది. చాలా ఆలోచించి మేం అంటున్న మాట ఇది. ఆటవిక న్యాయ సూత్రమైన `కన్నుకి కన్ను, రక్తానికి రక్తం' మాత్రమే ఆమెకు న్యాయం ఇవ్వగలదు''``బాధితురాలి దుస్థితి చూసి ఆమెకు న్యాయం చెయ్యాలంటే ఆటవిక న్యాయం అవసరమని అనిపిస్తుంది. చాలా ఆలోచించి మేం అంటున్న మాట ఇది. ఆటవిక న్యాయ సూత్రమైన `కన్నుకి కన్ను, రక్తానికి రక్తం' మాత్రమే ఆమెకు న్యాయం ఇవ్వగలదు''. యాసిడ్‌ బాధితురాలి కేసులో కర్ణాటక హైకోర్టు డివిజన్‌ బెంచి తన తీర్పులో ఈ మాటలను పేర్కొంది. సంయమనం కోల్పోకుండా తీర్పులు చెప్పాల్సిన న్యాయమూర్తులకే అంత ఆగ్రహం, బాధ, ఆవేశం కలిగించిన కేసు అది. ఇక మామూలు వ్యక్తుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ యాసిడ్‌ దాడులకు పాల్పడిన వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు. మీడియా కథనం ప్రకారం బుధవారం సాయంత్రం స్కూటీమీద ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ప్రణీత, స్వప్నికలపై యాసిడ్‌ దాడి జరిగింది.వాళ్ళు రామారం ఎవిఎస్‌ కాలేజీ వద్దకు రాగానే వెనక నుంచి పల్సర్‌ వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై యాసిడ్‌ పోసి పారిపోయారు. హెల్మెట్‌ ధరించి డ్రైవింగ్‌ చేస్తున్న ప్రణీతకు స్వల్పంగా గాయాలు కాగా వెనుక కూర్చున్న స్వప్నికకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో రాష్ట్రంలోని తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురవుతున్నారు. అందరూ ఆగ్రహావేశాలను వెళ్ళగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో యాసిడ్‌ దాడుల గురించి మరోసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ మానవహక్కుల రోజున ఈ దాడి జరగడం యాదృచ్ఛికమే అయినా అత్యంత బాధాకరమైన విషయం. మహిళలపై దాడి చేయడానికి మగవాళ్ళు అందుకున్న కొత్త ఆయుధం యాసిడ్‌. ఈ ఆయుధాన్ని కర్ణాటకలో మరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 1999 నుంచి యాసిడ్‌ దాడుల బారిన పడిన వాళ్ళ సంఖ్య 65 మంది. అందరూ మహిళలే.ఆ తరువాతి స్థానాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ముంబాయి. ఇప్పుడు కొత్తగా మరో రాష్ట్రం చేరబోతుంది. అదే అంధ్రప్రదేశ్‌. 97 శాతం మంది మహిళల పైనే ఈ దాడులు జరిగాయి. ఇందుకు కారణం ఏమిటి? మహిళలు స్వతంత్రంగా వ్యవహరించకుండా ఉండటానికి వాళ్ళను నియంత్రించడానికి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని కొంతమంది భావన. తమను ప్రేమించనందుకు జరుగుతున్నాయని మరి కొంత మంది భావన. ఇవి రెండూ కూడా కారణాలు కావచ్చు. మహిళలు స్వతంత్రంగా ఉద్యోగాలు చేస్తూ కార్లు, బైకులు నడిపిస్తూ, రాత్రిపూట ఉద్యోగాలు చేస్తూ తమకు ఇష్టమైన రీతిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చాలా మందికి రుచించకపోవచ్చు. ఒక వ్యక్తిని ప్రేమించడం, ప్రేమించకపోవడంలో స్వతంత్రంగా వ్యవహరించి ఎంపిక చేసుకునే హక్కును మహిళలు వినియోగించకుండా ఉండటానికి కూడా ఈ దాడులు జరుగుతూ ఉండవచ్చు. కర్ణాటక కేసు విషయానికి వస్తే హసీనా వయస్సు 19 సంవత్సరాలు. ఆమెపై దాడి చేసిన జోసెఫ్‌ రొడ్రిక్‌‌స వయస్సు 39 సంవత్సరాలు. అతనికి ఒక కంప్యూటర్‌ వ్యాపారం ఉంది. హసీనా అందులో ఉద్యోగం చేసేది. అది నష్టాల్లో ఉండటం వల్ల ఆ వ్యాపారాన్ని జోసెఫ్‌ ఆపేశాడు. కానీ హసీనాని తన ఇంటిదగ్గర పని చెయ్యమని డిమాండ్‌ చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. వేరే చోట చేరింది. ఫలితంగా ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు జోసెఫ్‌. ఈ సంఘటన జరిగి ఏడు సంవత్సరాలు గడిచాయి. ఈ ఏడుసంవత్సరాలలో ఆమెకు 15 ఆపరేషన్లు జరిగాయి. కళ్ళు కోల్పోయింది. ఆమె పెదవులు, వెంట్రుకలు కాలిపోయాయి. వాటిని గ్రాప్టింగ్‌ ద్వారా ఏర్పాటు చేశారు. అయినా హసీనా ధైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. ఫలితంగా జోసెఫ్‌కు జీవిత ఖైదు శిక్షపడింది. సెషన్‌‌స కోర్టు తక్కువ శిక్ష విధించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ హసీనాకు సహకరించింది. కర్ణాటక హైకోర్టులోని డివిజన్‌ బెంచి తీర్పులో ఇంకా ఈ విధంగా అభిప్రాయ పడింది: `ఆమెకు అయిన గాయాలు జీవితాంతం ఆమెను వెంటాడుతాయి. చావుకన్నా ఆమె బతుకును ముద్దాయి దుర్భరం చేశాడు. అందుకని అతనికి విధించాల్సిన కనీస శిక్ష సె.307కి ఉన్న గరిష్ఠ శిక్ష. ముద్దాయి ప్రార్థన విన్నాం. అన్నీ పరిశీలించి అతనికి ఆ నేరానికి ఉన్న అత్యధిక శిక్ష జీవితఖైదును విధించాలని ఆదేశిస్తున్నాం. కింది కోర్టు విధించిన జరిమానాను మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నాం. బాధితురాలు ఆ డబ్బు తీసుకోవచ్చు' ఇదీ తీర్పులోని సారాంశం.యాసిడ్‌ దాడులను మహిళా కమిషన్‌, సుప్రీంకోర్టు కూడా పట్టించుకున్నాయి. ఈ దాడుల గురించి ఒక నివేదిక సమర్పించవలసినదిగా లా కమిషన్‌ను ఆదేశించింది. లా కమిషన్‌ ఆగస్టులో నివేదిక సమర్పించింది. భారతీయ శిక్షాస్మృతిలో సె.326.ఎ అన్న కొత్త నిబంధనను ఏర్పరచాలని, నేరం చేసిన వ్యక్తికి కనీస శిక్ష 10 సంవత్సరాలుగా జీవిత ఖైదు విధించేలా ఏర్పరచాలని సూచించింది. యాసిడ్‌ దాడులను నిరోధించడానికి చట్టం తీసుకు రావలసి ఉందని జాతీయ మహిళా కమిషన్‌ అభిప్రాయపడి ముసాయిదా బిల్లు తయారు చేసింది. లైంగికంగా వేధించడం, మానభంగానికి గురి చేయడం వంటి నేరాల కన్నా ఈ నేరం హీనమైనదని కమిషన్‌ భావించింది. బాధితులకు ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని బిల్లులో పేర్కొంది. బాధితులకు తక్షణ వైద్య సదుపాయం అందించని హాస్పిటళ్ళపై చర్య తీసుకునే నిబంధనను ఈ బిల్లులో ఏర్పరిచారు. యాసిడ్‌ అమ్మకాలను క్రమబద్ధీకరించే నిబంధనలనుకూడా కమిషన్‌ సూచించింది. కానీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చట్టాన్ని తీసుకరాలేదు. అవసరమైన సవరణలను భారతీయ శిక్షాస్మృతిలో చేయలేదు. కఠినమైన నిబంధనలు ఉంటే మాత్రమే సరిపోదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హసీనా కేసు పరిష్కారానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ విధంగా కాకుండా సత్వరం పరిష్కారం అయ్యేవిధంగా నిబంధనలను చట్టంలో ఏర్పాటు చెయ్యాలి. వాటి అమలు సక్రమంగా జరిగేలా చూడాలి. ఇలాంటి నేరాలకు పోలీసులు కోర్టులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే, ఈ దాడుల వల్ల మహిళలకు మానసిక మరణం సంభవిస్తుంది. అనుక్షణం ఇది వాళ్ళను వెంటాడుతుంది. అందరికీ ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ కొత్త చట్టం విషయంలో కేంద్రప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రప్రభుత్వమే స్పందించి లాకమిషన్‌, మహిళా కమిషన్‌ సూచించిన విధంగా చట్టం తీసుకురావలసిన అవసరం, దానిని పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

Monday, September 14, 2009

రోడ్డు ప్రమాదాల చట్టాలు-సవరణలు

రోడ్డు ప్రమాదాల చట్టాలు-సవరణలు

ఒకే కోర్టులో చాలామంది క్లెయిందారులు వేరు వేరు దరఖాస్తులు దాఖలు చేసినప్పుడు సులభంగా సంఘటితం చేయడానికి వీలవుతుంది. క్లెయిం దరఖాస్తులు వివిధ ట్రిబ్యునళ్ళలో, వివిధ రాష్ట్రాల్లో దాఖలైనప్పుడు సమస్య జటిలమవుతుంది. ఇలాంటి ప్రతి వాదంలో పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందువల్ల పార్టీలకు వివాదాలు భారంగా మారతాయి.


మారుతున్న సమాజానికి అనుకూలంగా చట్టాలను మార్పు చేయడం అవసరమే. చట్టాలకు సవరణలు తీసుకొని రావడం వల్ల కొన్ని సార్లు మేలు, అదే విధంగా హాని జరిగే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. బాధితులకు నష్ట పరిహారం అందించాలన్నది శాసనకర్తల ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా మోటారు వాహన చట్టాన్ని తయారు చేశారు. అవసరమైనప్పుడల్లా ఆ చట్టానికి సవరణలు చేశారు. 1988 చట్టంలోని సె.166 (2) ప్రకారం ప్రమాదం ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో జరిగిందో, ఆ పరిధిలో క్లెయిం దరఖాస్తుని చట్టం నిర్దే శించిన పద్ధతిలో వివరాలను తెలియజేస్తూ దాఖలు చేయాలి.

అందువల్ల బాధితులకు ఇబ్బందులు ఎదు రవుతున్నాయని చట్టంలో మార్పులు తీసుకొచ్చారు.
ఈ నిబంధనకు కొత్త చట్టంలో మార్పు చేశారు. మోటారు వాహన చట్టంలో సెక్షన్‌ 166 (2) ప్రకారం క్లెయిం దరఖాస్తును ప్రమాదం ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో జరిగిందో, ఆ ట్రిబ్యునల్‌లో గాని లేక క్లెయిందారు ఎక్కడ నివసిస్తున్నాడో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో ఆ పరిధి ఉన్న ట్రిబ్యునల్‌లో గానీ లేక ప్రతివాది ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ పరిధిలోని ట్రిబ్యునల్‌లో గాని చట్టం నిర్దేశించిన ఫారంలో వివరాలతో దాఖలు చేసుకోవచ్చు.

మోటారు వాహనాల చట్టానికి సవరణలు రాక పూర్వం ప్రమాదం ఎక్కడ జరిగిందో ఆ పరిధిలోని ట్రిబ్యునల్‌లోనే క్లెయిం దరఖాస్తు దాఖలు చేయాలి. ఇప్పుడు సవరించిన చట్టం ప్రకారం బాధితులకు మూడు అవకాశాలు వచ్చాయి.

1. ప్రమాదం జరిగిన స్థలం ట్రిబ్యునల్‌ పరిధిలో, 2. క్లెయిందారు ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో నివసిస్తున్నాడో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో ఆ ట్రిబ్యునల్‌ పరిధిలో, 3. ప్రతివాది (ఈ్ఛజ్ఛఛ్చ్టీ) ఏ ట్రిబ్యునల్‌ పరిధిలో నివసిస్తున్నాడో ఆ ట్రిబ్యు నల్‌ పరిధిలో ఎక్కడైనా క్లెయిందారు దరఖాస్తు దాఖలు చేసుకో వచ్చు. ఇది ఒక రకమైన సౌకర్యాన్ని క్లెయిందారుకు ఇచ్చిన ప్పటికీ అందువల్ల చాలా అసౌకర్యాలు కూడా ఉన్నాయి. వివా దాలు బహుళం (ఠజ్టూజీఞజూజీఛిజ్టీడ) అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పార్టీలకి అసౌకర్యం కలుగుతుంది. ఒకే వివాదంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఉదాహరణకు, ఢిల్లీలోని ఓ టూరిస్ట్‌ బస్సులో 25 రాష్ట్రా లకు చెందిన వ్యక్తులు తాజ్‌మహల్‌ చూడడానికి బయల్దేరా రనుకుందాం. ఆ వాహనానికి ప్రమాదం జరిగినట్లైతే, బాధితు లు తమ రాష్ట్రాలలో అంటే 25 రాష్ట్రాలలో క్లెయిం దరఖాస్తు లను డ్రైవర్‌ పైన, ఆ వాహన యజమానిపైన, ఇన్స్యూ రెన్స్‌ వారి పైన వేయడానికి అవకాశం ఉంది. ఒకే ప్రమాదం గురిం చి అనేక వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి. అందువల్ల ఒకే అంశంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది.

తన క్లెయింను పొందడానికి క్లెయిందారుడు మోటారు వాహన డ్రైవర్‌ నిర్లక్ష్యం గానీ లేక దుడుకైన డ్రైవింగ్‌ గాని ఉందని రుజువు చేయాలి. ఈ అంశాలని రుజువు పరచడానికి క్లెయిందారులు ఒకే రకమైన సాక్ష్యాలను అనేక ట్రిబ్యునళ్ళ ముందు ప్రవేశపెట్టాలి. ఇది ట్రిబ్యునళ్ళ సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని క్లెయిం దరఖాస్తులను ఒకే చోట విచారించవలసినదిగా క్లెయిందారులు కోరాల్సి ఉంటుంది. ఈ ఉదాహరణలో చెప్పి నట్టుగా 25 రాష్ట్రాలలో క్లెయిం దరఖాస్తులు విచారణలో ఉన్న ప్పుడు ఒకే దగ్గర సంఘటితం (ఛిౌట్చజూజీఛ్చ్టీజీౌ) చేసి విచారణ జరపడానికి పార్టీలు సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు చేయా ల్సి ఉంటుంది.

ఇలా చేయడం పార్టీలకు భారమైనదిగా పరిణ మిస్తుంది. క్లెయిం దరఖాస్తులను విచారిస్తున్న ట్రిబ్యునళ్ళకు సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలు ఉంటాయి. అంటే సాక్ష్యం తీసు కోవడానికి, సాక్ష్యులను కోర్టులకు పిలవడానికి, కేసుకి అవసర మైన డాక్యుమెంట్లను, వివరాలను తెప్పించుకోవడానికి సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలన్నీ వాటికీ ఉంటాయి. మోటారు వాహనాల ప్రమాదాల నష్టపరిహారం కేసులపై ట్రిబ్యునళ్ళకు పూర్తి అధికార పరిధి ఉంటుంది. ఈ ప్రొసీడింగ్‌ను ఆపే అధి కారం, నిలిపివేసే అధికారం సివిల్‌ కోర్టులకు ఉండదు. ఈ ప్రొసీడింగ్స్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేయడానికి సివిల్‌ కోర్టులకు అధికారం లేదు. ట్రిబ్యు నళ్ళకు ఉన్న అధికారాల గురించి సెక్షన్‌ 169లో పేర్కొనడం జరిగింది.

1. ఈ చట్టం ప్రకారం తయారు చేసిన నిబంధనలకు అను గుణంగా ఈ క్లెయిం దరఖాస్తులను విచారిస్తున్న ట్రిబ్యునళ్ళు సమ్మరీ పద్ధతిన విచారిస్తాయి. 2. ట్రిబ్యునళ్ళకు సివిల్‌ కోర్టు లకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. ప్రమాణ పూర్వకంగా సాక్ష్యాలను స్వీకరించేందుకు, అధికారం, సాక్ష్యులను కోర్టుకు హాజరుకమ్మని ఆదేశించేందుకు, అధికారాలు, డాక్యుమెంట్లను ఇతర అవసరమైన వివరాలను కోర్టులో ప్రవేశపెట్టమని ఆదేశించేందుకు అధికారాలు ఈ ట్రిబ్యునళ్ళకు ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని అధ్యాయం 26 ప్రకారం సివిల్‌ కోర్టులకు సెక్షన్‌ 195 ప్రకారం ఉండే అధికారాలన్నీ ఈ ట్రిబ్యు నళ్ళకు ఉంటాయి.

3. మోటారు వాహనాల రూల్సుకు అను గుణంగా క్లెయింలను పరిష్కరించడానికి అవసరమని భావిం చినప్పుడు ఏదైనా విషయంపై పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల సహా యాన్ని ట్రిబ్యునల్‌ తీసుకోవచ్చు. సెక్షన్‌ 169 ప్రకారం సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలన్నీ ఈ ట్రిబ్యునళ్ళకు ఉంటాయి. అంటే ఒక ప్రమాదానికి సంబంధించిన వివిధ వివాదాలను సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 151 ప్రకారం సంఘటితం (ఛిౌట్చజూజీఛ్చ్ట్ఛీ) చేసే అధికారం ఉంది. అందువల్ల అందరు పార్టీ లకు ప్రయోజనం చేకూరుతుందని కోర్టులు భావించినప్పుడే అలా చేస్తాయి. ఈ విధంగా సంఘటితం చేయనందువల్ల ఒకే వివాదంపై విభిన్నమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇంతకు ముందు ప్రస్తావించిన ఉదాహరణలోని కేసులో ప్రమాదం జరిగింది ఢిల్లీ దగ్గర. బాధితులు 25 రాష్ట్రాలకు చెందిన వారు. క్లెయిం పిటిషన్లు ఇరవై అయిదు రాష్ట్రాల్లో దాఖలవుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో సాక్ష్యం అంతా దాదాపుగా ఒకేలా ఉంటుంది. చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను పరిశీలించిన అధి కారులను, డాక్లర్లను కూడా సాక్షులుగా విచారించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు. 25 కేసులలోనూ వాళ్ళను విచారించాల్సిన ఆవశ్య కత ఉంటుంది.

ఒకే విషయం గురించి వేరు రాష్ట్రాలలో దాఖలైన వివా దాల ను సంఘటితం చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి: ‘గుడ విజ యలక్ష్మి వర్సెస్‌ గుడ రామచంద్ర, ఎ.ఐ.ఆర్‌ 1981 సుప్రీం కోర్టు 1143’ కేసులో దాంపత్య జీవన హక్కుల (్ఛట్టజ్టీఠ్టజీౌ ౌజ ఛిౌ్జఠ్చజూ జీజ్టిట) విషయంలో న్యాయ పరమైన వేర్పాటు (ఒఠఛీజీఛిజ్చీజూ ట్ఛఞ్చట్చ్టజీౌ) గురించి, భర్త ఒక రాష్ర్టంలో, భార్య వేరొ క రాష్ట్రంలో దరఖాస్తులు దాఖలు చేశారు. ఇలాంటి కేసుల్లో ఆ రెండు కేసులను సంఘటితం చేసి ఒకే కోర్టు విచారించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

వెంకటేష్‌ ప్రభు, వర్సెస్‌ కె.తేజప్ప శెట్టి, ఎ.ఐ.ఆర్‌.1982- కర్ణాటక 319’ కేసులో కర్ణాటక రెంట్‌ కంట్రోలు రూల్స్‌ ప్రకా రం కేసులను ఏకీకృతం చేయడానికి వీలులేప్పటికీ కోర్టులు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం ఏకీకృతం చేయాల్సి ఉంటుంది. ఏ శాసనం ప్రకారమైతే కోర్టులకి గానీ ట్రిబ్యునళ్ళకు గానీ అధి కారం వస్తుందో, ఆ శాసనం సక్రమంగా అమలు జరపడం కోసం తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఆ శాసనమే ఇస్తుందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.

ఒకే సంఘటన గురించి, ఒకే విషయం గురించి తలెత్తిన వివాదాలు వివిధ కోర్టుల్లో దాఖలై విభిన్నమైన తీర్పులు రాకూడదన్న ఉద్దేశం ఈ రెండు తీర్పుల్లో అంతః సూత్రంగా ఉంది. ఒకే కోర్టులో చాలామంది క్లెయిందా రులు వేరు వేరు దరఖాస్తులు దాఖలు చేసినప్పుడు సులభంగా సంఘటితం చేయడానికి వీలవుతుంది. క్లెయిం దరఖాస్తులు వివిధ ట్రిబ్యునళ్ళలో, వివిధ రాష్ట్రాల్లో దాఖలైనప్పుడు ఈ సమస్య జటిలమవుతుంది. ఇలాంటి ప్రతి వాదంలో పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అందువల్ల పార్టీ లకు వివాదాలు భారంగా మారతాయి.

సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని వీటిని సంఘటిత పరుద్దామని ఎవరైనా పార్టీ భావించినప్పటికీ కొన్నిసార్లు కొత్త సమస్యలు తలెత్తుతాయి. మార్పు చేసిన చట్టం ప్రకారం క్లెయిం దరఖాస్తులు దాఖలు చేయడానికి కాలపరిమితి లేదు. అందుకని పార్టీలంద రూ ఒకే కాలంలో ఈ క్లెయిం దరఖాస్తు వే యాల్సిన అవసరం లేదు. ఎవరిదైనా క్లెయిం దరఖాస్తులో తీర్పు వచ్చిన తరువాత, ఆ తీర్పులోని బాగోగులు చూసిన తరువాత కేసు దాఖలు చేద్దామని ఎవరైనా వేచి చూసి ఆ తరువాత క్లెయిం కోరడానికి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో కూడా సంఘటితం చేయడానికి సమస్యలు తలెత్తుతాయి. ఒక్కో రాష్ర్టంలో ఒక్కో రకమైన ఫీజును పార్టీలు చెల్లించవలసి రావచ్చు.

అలాంట ప్పుడు కేసులను సంఘటితం చేసినప్పుడు కొంతమంది పార్టీలు మరికొంత కోర్టు ఫీజు చెల్లించవలసి రావచ్చు. కొంత మంది ఎక్కువ ఫీజును ఇదివరకే చెల్లించి ఉండవచ్చు. ఒకే వివాదం గురించి ఎవరైనా పార్టీలు రెండు క్లెయిం దర ఖాస్తులు వేరు వేరు రాష్ట్రాల్లో దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఏదైనా రోడ్డు ప్రమాదంలో రెండు వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితుడు రెండు క్లెయింలను కోరడానికి అవకాశం ఉంది. ఒక వాహనం డ్రైవర్‌, యాజమాని, ఇన్స్యూ రెన్స్‌ కంపెనీలపై ఒక క్లెయింను ప్రమాదం జరిగిన ప్రాంతం లోని ట్రిబ్యునల్‌లో, మరో వాహనంపై మరో క్లెయింను అతను నివసిస్తున్న ప్రాంతంలో కోరడానికి అవకాశం ఉంది. ఈ మోసాలను ట్రిబ్యునళ్ళు కనుక్కోవడం కష్టమైనపని. ఈ సమ్యలను దృష్టిలో ఉంచుకొని చట్టానికి మళ్ళీ సవరణలు తీసుకొనిరావలసి ఉంది.

సూర్య డైలీ

Wednesday, September 2, 2009

సరిదిద్దడానికి వీల్లేని వివాహాల్లో విడాకులు

సరిదిద్దడానికి వీల్లేని వివాహాల్లో విడాకులు
కాలానుగుణంగా చట్టాలు మారాలి. అదే విధంగా చట్టాల గురించి వ్యాఖ్యానాలు మారాలి. మారాయి కూడా. సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహాలు ఉన్నప్పుడు దాని ఆధారంగా విడా కులు మంజూరు చేయడం సమంజసమేనని గతంలో కోర్టులు తీర్పులు చెప్పాయి. హిందూ వివాహ చట్టంలో అది విడాకులు పొందడానికి ఒక ఆధారం కాదు. అయినా కేసులోని వాస్తవ పరిస్థితు లను బట్టి కోర్టులు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాని ఆధారంగా విడాకులు మంజూరు చేసిన సంద ర్భాలు ఉన్నాయి. సరిదిద్దలేని విధంగా ఇద్దరు వ్యక్తుల వివాహం మారినప్పుడు ఆ వివాహాన్ని రద్దు చేసే విధంగా లేదా ఆ పరిస్థితుల్లో ఉన్న దంపతులు విడాకులు కోరే విధంగా హిందూ వివాహ చట్టం లో మార్పులు తీసుకొని రావాలని లా కమిషన్‌ కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చిన నివేదికలో పేర్కొంది. సరిదిద్దడానికి వీల్లేని విధంగా దంపతుల జీవితాలు మారినప్పుడు ఆ ఆధారంగా విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీం కోర్టు గతంలో కొన్ని తీర్పులని ప్రకటించింది. అయితే ఆ తీర్పులకి భిన్నంగా మరో తీర్పుని సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. అదే విష్ణుదత్త శర్మ వర్సెస్‌ మంజుశర్మ కేసు.

హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహ తప్పులు దంపతుల్లో ఎవరైనా చేస్తే మరొకరు దాని ఆధారంగా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. ఇదే ‘తప్పిదం ఆధారంగా’ విడాకులు పొందే పద్ధతి. చట్టంలో ఇలాంటి ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలోనే విడాకులు మంజూరు చెయ్యాలా? లేక సరిదిద్దడానికి వీల్లేని విధంగా కోరే అవకాశం ఉందా? ఈ విషయం గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహాలు పవిత్రమైనవి. ఈ చట్టప్రకారం భార్య భర్తలను తిరిగి కలపడానికే ప్రయత్నం చెయ్యాలి తప్ప వారిని విడదీయడానికి, వాళ్ళకి విడాకులు మంజూరు చేయ డానికి ప్రయత్నం చేయకూడదు. అందుకనే కోర్టు దంపతులిద్దరిని కలిపే ప్రయత్నం చేసి విఫల మైనప్పుడే కేసుని విచారిస్తుంది. ఆ తరువాతనే విడాకులని మంజూరు చేస్తాయి. అయితే సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహాలు మారినప్పుడు, సుప్రీంకోర్టు దాని ఆధారంగా కూడా విడాకులని మంజూరు చేసింది. భార్య భర్తల మధ్య వివాహం అన్న భావన చనిపోయినప్పుడు తప్పు ఎవరిది ఉన్నప్పటికీ విడా కులు మంజూరు చేస్తుంది.

భార్య పట్ల భర్త క్రూరంగా వ్యవహరించి ఆమెను హింసించి దాని ఆధారంగా విడాకులు కోరడానికి అవకాశం లేదు. కానీ అలాంటి సందర్భంలో భార్య విడాకులు కోరవచ్చు. వివాహ తప్పు చేసిన వ్యక్తులకి వ్యతిరేకంగా దంపతుల్లోని మరొకరు విడాకులు కోరే అవకాశం ఉంది. భర్తలు వైవాహికేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు సాధారణంగా భార్యలు భర్తలకి దూరంగా ఉంటారు. కానీ విడాకులని కాంక్షించరు. ఇలా సంవత్సరాలు గడిచినప్పుడు వారిద్దరి మధ్య సరిదిద్దడానికి వీల్లేని విధంగా వారి వివా హం మారి పోతుంది. ఇలాంటి సందర్భాలను గమనించి సుప్రీంకోర్టు విష్ణుశర్మ కేసులో ఈ విషయాన్ని పునఃపరిశీలన చేసింది. దీని ఆధారంగా విడాకులు మంజూరు చేయడం వల్ల ఎక్కువగా స్ర్తీలే నష్టపోయే అవకాశం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు భావించింది.

విష్ణుశర్మకి మంజుకి 26 పిబ్రవరి 1993లో వివాహం జరిగింది. డిసెంబర్‌ 1993లో ఓ కూతురుకి జన్మనిచ్చింది. ఆ తరువాత కొంత కాలానికి విష్ణుదత్త శర్మ విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేశాడు. వివాహమైన కొద్ది రోజులకే ఆమె తన ఇంటి నుంచి తల్లి గారింటికి వెళ్లిపోయిందని, ఆమె తండ్రి సబ్‌ ఇన స్పెక్టర్‌ కాబట్టి తనను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. మంజు తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. సెప్టెంబర్‌ 14, 1994 రోజున తనని భర్త, అత ని కుటుంబ సభ్యులు విపరీతంగా కొట్టినారని తన జవాబులో పేర్కొంది. తనని కొట్టి సజీవంగా దహనం చేయడానికి ప్రయత్నించారని కూడా పేర్కొంది. ఈ దరఖాస్తును విచారించిన కోర్టు భర్త, అతని బంధు వులు మంజు పట్ల క్రూరంగా వ్యవహరించినారని తన తీర్పులో పేర్కొంది. అతని విడాకుల దరఖాస్తుని కొట్టి వేసింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలుని ధాఖలు చేశాడు.

హైకోర్టు కూడా అతని అప్పీలుని కొట్టి వేసింది. భర్త వివాహ తప్పిదాలు చేసి తమ మధ్య వివాహం సరిదిద్దలేని విధంగా మారి పోయిందని విడాకులు కోరినా ఆ విధంగా ఇవ్వడం సరైంది కాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. తమ మధ్య సరిదిద్దలేని విధంగా వివా హం అయ్యిందని అందుకని విడాకులు మంజూరు చేయాలని వాదనలు చేశాడు. సుప్రీంకోర్టు ఈ వాద నలతో ఏకీభవించలేదు. హిందూ వివాహచట్టంలోని సె.13 ప్రకారం విడాకులు పొందడానికి ఎన్నో ఆధా రాలు ఉన్నాయి. కానీ సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహం మారిందన్న కార ణంగా విడాకులు కోరే ఆధారం లేదని, అలాంటి ఆధారాన్ని కోర్టు చట్టంలో చేర్చజాలదని, అలా చేయడం అంటే చట్టాన్ని సవరిం చడమేనని అది శాసనకర్తలు చేయాల్సిన పని అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం వివాహ తప్పిదం చేసిన వ్యక్తి విడాకులు పొందడానికి అవకాశం లేదు. సరిదిద్దడానికి వీల్లేని విధంగా తమ వివాహం మారిందన్న కారణంగా కూడా విడాకులు పొందే అవకాశం లేదు. ఆ ఆధారం చట్టంలో లేదు. కానీ గతంలో ఈ ఆధారంగా కోర్టు విడాకులు మంజూరు చేసిన సందర్భాలున్నాయి. ఇది భిన్నమైన తీర్పు. తీర్పులు ఒక విషయంలో నిలకడగా లేనప్పుడు గందరగోళం తలెత్తే అవకాశం ఉంది. దీనిపై శాసనకర్తలే ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Tuesday, August 25, 2009

మరోసారి మరణ వాంగ్మూలం

మరోసారి మరణ వాంగ్మూలం

మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. వరక ట్నం చావు కేసులు పెరుగుతున్నాయి. వర కట్నం మరణాలు ఎక్కువగా అత్తవారింట్లో జరు గుతాయి. అత్తమామలు, భర్త, అతని బంధువులు తప్ప వేరే ఇతరుల సాక్ష్యాలు దొరకడం కష్టమ వుతుంది. కాలి న గాయలతో’ ఉన్న మహిళని హాస్పి టల్లో చేరు స్తారు. ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు, మేజిస్ట్రేట్‌ నమోదు చేస్తారు. ఆ దశలో ఆమె అత్త గారి ప్రభా వం ఉంటుంది. బతుకుతానన్న ఆశని కూడా వాళ్ళు కలిగిస్తారు. జరిగిన సంఘటన గురించి చెప్పకుండా ఏ ప్రమాదం వల్లో ఆ సంఘ టన జరిగిందని ఆమె సాక్ష్యం చెబుతుంది.

ఆ స్టేట్‌ మెంట్‌ ఆధారంగా ముద్దాయిలు నేరం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. క్రిమినల్‌ కేసుల్లో ఎక్కువగా మౌఖిక సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసిన తరు వాతనే ఆ సాక్ష్యాన్ని కోర్టులు స్వీకరిస్తాయి. అయితే వ్యక్తి చావు ప్రశ్నార్థకమైనప్పుడు, ఆ మరణించిన వ్యక్తి తన మరణానికి గల కారణాల్ని గానీ లేక ఆ మరణానికి దారి తీసిన పరిస్థితులని గానీ వివరిం చినప్పుడు కోర్టులు వాటిని సాక్ష్యంగా స్వీకరిస్తాయి. వీటినే మరణ వాంగ్మూలం అంటారు.

మరణ వాంగ్మూలం అతి ముఖ్యమైన సాక్ష్యం. చాలా మంది మహిళలు తమని తాము కాల్చు కోవడమో, ఇతరులే కాల్చినప్పటికీ ఆ విషయం చెప్పకుండా ఉండటమో జరుగుతుంది. ఇలాంటి కేసుల్లో వివాహితలు ఎక్కువ. ఈ సంఘటన జరి గిన వెంటనే ఆమె చుట్టూ ఉండే వ్యక్తులు ఆమె భర్త, అతని బంధువుల ప్రభావం వల్లనో, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించో జరిగిన విషయం చెప్పరు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతూ ఉంటారు. ఆ మహిళ సబంధీకులు- అంటే ఆమె తల్లి దండ్రులు, అన్నదమ్ములు వచ్చిన తరువాత ధైర్యం కూడ తీసుకుంటారు. అప్పుడు వాస్తవం చెప్పాలనుకుంటారు. అయితే అప్పటికే ఆమె మరణ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ నమోదు చేస్తే, ఇలాంటి సందర్భాలలో మరోసారి ఆమె మ రణ వాంగ్మూలాన్ని నమోదుచేసే అవకాశం ఉందా?

రెండోసారి అదే మహిళ చెప్పిన మరణ వాంగ్మూ లం రాయడానికి చాలా మంది మేజిస్ట్రేట్లు సంశ యిస్తూ ఉంటారు. సెషన్స్‌ జడ్జీల అనుమతి కోరు తూ ఉంటారు. అనుమతి ఇవ్వడానికి సెషన్స్‌ జడ్జీలు కూడా సంశయిస్తూ ఉంటారు. మరి కొంత మంది సెషన్స్‌ జడ్జీలు రెండవ మరణ వాంగ్మూ లాన్ని, అదే మేజిస్ట్రేట్‌ నమోదు చేయడాన్ని తప్పు పడుతూ ఉంటారు. ఇది సరైందేనా? ఇలాంటి సం దర్భాలలో చట్టం ఏమి జవాబు చెబుతోంది.?

రెండోసారి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయకూడదన్న నిషేధం ఏదీ చట్టంలో లేదు. మొ దటిసారి మరణ వాంగ్మూలం నమోదు చేసిన మేజి స్ట్రేట్‌ మళ్ళీ రెండవ మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయకూడదన్న నిషేధం కూడా చట్టంలో లేదు. రెండవసారి నమోదు చేసిన మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టు శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. దేశంలోని అత్యున్నత కోర్టు రెండవసారి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడాన్ని అనుమతి ఇస్తున్నది. అలాంటి కేసే- సమిరా భాను . సుల్తానా బేగమ్వర్సెస్స్టేట్ఆఫ్మహారాష్ట్ర, అప్పీలు నెం.141/2006, తీర్పు తేదీ: 8/2/07 న్యాయమూర్తులు: సి.కె టక్కర్‌, లోకేశ్వర్‌ సింగ్‌ పాట్నా, సుప్రీంకోర్టు. ఈ కేసులో రెండు మరణ వాంగ్మూలాలను మృతురాలు ఇచ్చింది. రెండింటిని ఒకే మేజిస్ట్రేట్‌ నమోదు చేశాడు.

మొదటి వాంగ్మూలంలో కిరోసిన్‌ దీపంపై పడి అంటుకొని గాయాలు అయినాయని ఆమె చెప్పింది. రెండవ మరణ వాంగ్మూలంలో, తన అత్త కిరోసిన్‌ పోసి కాల్చిందని చెప్పింది. కేసుని విచారించిన సెషన్స్‌ కోర్టు రెండవ మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని శిక్ష విధించింది. హై కోర్టు కూడా శిక్షను సమర్థించింది. సుప్రీం కోర్టు కూడా శిక్షని సమర్ధిస్తూ ‘విషయాలను, సాక్ష్యాలను ఆధారం చేసుకొని క్రిమినల్కేసును పరిష్కరిస్తారు. అంతే కానీ గతంలో చెప్పిన తీర్పుల ఆధారంగా కాదు. ముందు ముద్దాయి బాధితురాలిని కొట్టినట్టు, వేధించినట్టు సాక్ష్యం ఉంది. అందుకని రెండవ మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టులు శిక్షలు విధించడం సమంజసమే’-అని వాఖ్యానించింది.
ఈ తీర్పునిబట్టి, మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టులు శిక్షలు విధించే అవకాశం ఉంది

Wednesday, August 19, 2009

ఉత్తరాలు -విలువ

రోజు రోజుకీ వరకట్నం చావులు పెరిగి పోతున్నాయి. రక రకాల కారణాలతో కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి. సరైన దర్యాప్తు లేకపోవడం, సాక్షులు కోర్టుల్లో ప్రతి కూల సాక్ష్యం ఇవ్వడం లాంటి కారణాలు ఎన్నో, ఈ పరిస్థితిని అధిగమించడానికి మరణ వాంగ్మూలంలాంటివి ఎంతో అవసర మవుతాయి. మరణ వాంగ్మూలం అంటే మరణానికి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కావొచ్చు.

మరణానికి దారి తీసిన పరిస్థితులు గురించి చెప్పినవి కావొచ్చు. అవి మౌఖి కాంశంగా ఉండవచ్చు. ఉత్తరాల రూపం లో డైరీల రూపంలో ఉండవచ్చు. వాటికి అత్యం త విలువ ఉంది. మరణ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి తన మర ణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన ఎదైనా పరిస్థితిని వివరిం చినప్పుడు, ఆ వ్యక్తి మరణం ప్రశ్నార్థ కమైనప్పు డు వాంగ్మూలం మరణ వాంగ్మూల మవుతుంది.

‘మరణానికి గల కారణం’, ‘మరణానికి దారి తీసి న పరిస్థితులు’ అన్న ్కజిట్చట్ఛట రెండూ ఒకే అర్థంలో వాడినవి కాదు. ఈ రెండింటి మధ్య భేదం ఉంది. రెండింటి ఉద్ధేశ్యం వేరు. మరణానికి గల కారణం అన్న దానికి పరిమితులున్నాయి. రెండో ్కజిట్చట్ఛకి పరిమితులు లేవు. దాని పరిధి విస్తృతమైనది.
మరణానికి సంబంధించి ఏదైనా పరిస్థితిని వివరించినప్పుడు అది వాస్తవంగా జరిగిన సంఘటనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దాన్ని సాక్ష్యంగా తీసుకోవాల్సిన ఉంటుంది.

మర ణానికి దారితీసిన ఏవైనా పరిస్థితులు అంటే సామీప్యం ఉన్న పరిస్థితు లేనా? దూరమైన పరిస్థితులు ఉంటే అవి సె.32(1) ప్రకారం సంబం ధితాలు కావా? ఈ విషయం గురించి వివాదాలు ఉండేవి కానీ ఈ విషయాన్ని మొదట శరద్‌బిర్థీ చంద్‌ శారద వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ర్ట (ఏ.ఐ.ఆర్‌ 1984 సుప్రీం కోర్టు 1622-1984 క్రిమినల్‌ లా జర్నల్‌ 1738) కేసులో, ఆ తరువాత చాలా కేసుల్లో పరిష్కరించి వివాదానికి తెరదించింది. మరణానికి దారి తీసిన ఏదైనా పరిస్థితితో దగ్గరి సంబంధం ఉందా? దూరం సంబంధం ఉందా అన్న విషయాలతో పని లేదు.

కన్సేరాజ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ ( 2000 ఏ.ఐ.ఆర్‌. 2324 సుప్రీం కోర్టు =2000 క్రిమినల్‌ లా జర్నల్‌ 2993) కేసులో సుప్రీం కోర్టు ఈ విషయం గురించి ప్రస్తావిస్తు- ‘మరణానికి దారితీసిన ఏవైనా పరిస్థితులు అంటే పరిస్థితులకి మరణానికి ప్రత్యక్ష సంబంధం తప్పనిసరి కాదు. సంభవించిన మరణంతో ఆ పరిస్థితులకి దూరమైన సంబంధం ఉన్నా సరిపోతుంది. లీగల్‌ పొజిషన్‌ ఇలా ఉన్నప్పుడు -సునీత తల్లి దండ్రులకి సోదరులకి తెలిసిన వాళ్ళకి మరణానికి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్లు సెక్షన్‌ 32 ప్రకారం ఆమోదయోగ్యాలు.

ఎవరైనా వ్యక్తి మరణం ప్రశ్నార్థకమైనప్పుడు ఆ మరణించే వ్యక్తి తన మరణానికి గల కారణాన్ని లేక ఆ మరణానికి దారితీసిన పరిస్థితుల్ని వివరించిన ప్రకటన భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సె.32(1) ప్రకారం సంబంధితమైనది కాబట్టి అది ఆమోదయోగ్యమైనది. ఈ స్టేట్‌మెంట్లనే మరణ వాంగ్మూలాలని అంటాం. ఈ స్టేట్‌మెంట్లని ‘అవసరార్థం’ అనే సూత్రం ప్రకారం కోర్టులు ఆమోదిస్తున్నాయి. హత్యకు సంబంధించిన విషయాలైతే-మరణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన పరిస్థితులని రుజువు చేస్తే అవి ఆమోద యోగ్యాలవుతాయి. సె.32 ఆర్షింపబడాలంటే -మృతుని మరణ వాంగ్మూలాన్ని ఆమోదించాలంటే ఈ విషయాలు రుజువు పరచాల్సి ఉంటుంది.

(ఎ) ఎవరి స్టేట్‌మెంట్‌ నైతే రుజువు చేయదల్చుకున్నారో ఆ వ్యక్తి మరణించిన వ్యక్తిగాని, జాడ తెలియని వ్యక్తిగానీ, మతిస్థి మితం కోల్పోయి. సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి గానీ, తీవ్ర మైన ఖర్చుతో కష్టంగా కోర్టుకి పిలవడానికి అవకాశం ఉన్న వ్యక్తిగానీ అయి ఉండాలి. (బి) ఆ స్టేట్‌మెంట్లు సె.32లోని సబ్‌సెక్షన్‌ 1 నుంచి 8 సందర్భాలలో ఏదైనా ఒక సందర్భంలో పేర్కొన్నదై ఉండాలి. సె.32(1)లో పేర్కొన్న మరణానికి దారి తీసిన పరిస్థితులు వాస్తవంగా జరిగిన సంఘటనతో దగ్గరి సంబంధం ఉండాలి. ఇంకోరకంగా చెప్పా లంటే-మృతుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న మరణం కావడం లేక మరణానికి దారితీసిన పరిస్థితులు జరిగిన సంఘటనతో దగ్గరి సంబంధం ఉండాలి.

మరణించే మనిషి తన నోట్లో అబద్ధాన్ని పెట్టుకొని చావడు (ూ్ఛఝౌ ఝౌటజ్టీఠటఠట ఞట్చ్ఛటఠఝజ్టీఠట ఝ్ఛ్టజీట్ఛ) అన్న సూత్రం ప్రకారం కోర్టు లు మరణ వాంగ్మూలాన్ని నమ్ముతున్నాయి. ఈ స్టేట్‌మెంట్‌ స్థిరమైన సాక్ష్యంగా ఉండాలంటే ఆ స్టేట్‌మెంట్‌పై ఆధారపడిన వ్యక్తులు గానీ ఏజెన్సీగా ఆ స్టేట్‌మెంట్‌ని షార్ప్‌గా రుజువు పరచాలి. మరణ వాంగ్మూ లం ఇచ్చిన వ్యక్తి ఊహించిన దానికన్నా చాలా రోజులకి చనిపో యారన్న కారణంగా ఆ మరణ వాంగ్మూలం తన విలువని కోల్పోదు. ఆ స్టేట్‌మెంట్‌ ఆమోదయోగ్యం కావాలంటే అది తన మరణానికి గల కారణాన్ని లేక మరణానికి దారితీసిన పరిస్థితులని వివరిస్తే సరిపో తుంది. మరణానికి గల కారణం ప్రత్యక్షంగా ఉండవచ్చు లేక పరో క్షంగా ఉండవచ్చు.

(సుధాకర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, 2000 ఏ. ఐ.ఆర్‌. 2002 సుప్రీంకోర్టు =2000 క్రిమినల్‌ లా. జర్నల్‌ 3490).మరణానికి ముందు రాసిన ఉత్తరాలకి నేర సంఘటనతోని దగ్గరి సామీప్యత ఉంటే ఆ ఉత్తరాలు సె.32 ప్రకారం సంబంధితాలవు తాయి. హింసని, వేదనని ఈ ఉత్తరాలు ప్రతిబింబించవచ్చు. కొన్ని కేసుల్లో చాలా రోజుల క్రితం రాసిన ఉత్తరాలని కోర్టులు తిరస్క రించాయి.

మరికొన్ని కేసుల్లో ఆమోదించాయి. మృతురాలు రాసిన ఉత్తరాలే ప్రధాన సాక్ష్యంలో భాగమైనప్పుడు ఆమె మరణానికి ఆ ఉత్తరాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు, మరణానికి సంబం ధించిన కథని వివరిస్తున్నప్పుడు ఆ ఉత్తరాలు తప్పక సె.32 పరిధిలోకి వస్తాయి. అవి ఆమోదయోగ్యం కూడా అవుతాయి. సుదూరమైన కాలం కారణంగా ఆ ఉత్తరాలు సంబంధితాలు కావని అనడానికి వీల్లేదు అని శరద్‌బిర్దీ చంద్‌ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరణానికి నెల రోజుల ముందు తన అత్తమామల చేతుల్లో పడుతున్న బాధల గురించి రాసిన మూడు ఉత్తరాలు సెక్షన్‌ 32(1) పరిధిలోకి వస్తాయి. (బిక్షపతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, 1989 క్రిమినల్‌ లా జర్నల్‌ 1186 ఎ.పి)మరణానికి రెండు రోజుల ముందు మృతురాలు తన తండ్రికి ఉత్తరం రాసింది. తన అత్తమామ, భర్త, ఇతర బంధువుల చేతుల్లో తన మరణం ఉందని తనని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళమని ఆ ఉత్తరాల సారాంశం.

ఆ ఉత్తరం రెండు రోజుల ముందు రాసింది కాదు అంతకు ముందు రాసిందని డిఫెన్స్‌ వాదన. ఎప్పుడు రాసిందీ అన్న విషయంలో ఏమీ భేదం లేదు. ఆ ఉత్తరాలు ఆమే రాసినట్లు రుజువైందని సుప్రీంకోర్టు అభిప్రా య ప డింది. ఆమె రాసిన మిగతా ఉత్తరాలని ప్రాసిక్యూషన్‌ సాక్ష్యులు కోర్టు లో ప్రవేశపెట్టని కారణంగా, ఆ ఉత్తరాలు మరుగు పరిచి ఆమె చేతి రాతని పరిక్షించే వీలు కల్పించలేదనే భావనకి రావడానికి వీల్లేదు. (స్టే ట్‌ ఆఫ్‌ యూ.పి వర్సెస్‌ హరిహరన్‌ 2001 ఎస్‌.సి.సి (క్రిమినల్‌) 49).స్వర్ణలతని వాళ్ళ అత్తా మామ హింసించి ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు. ఆమె తమ తల్లితండ్రుల వద్ద కొద్దికాలం నివసించింది. ఆ కాలంలో తనని తీసుకెళ్ళమని తప్పు తనదేనని అత్తమామలకి ఎన్నో ఉత్తరాలు రాసింది. కానీ ఫలితం లేకపోయింది.

చివరికి తన మేనమామలను తీసుకొని వెళ్ళింది. కానీ వాళ్ళ ఆమెను తిట్టి పంపించి వేశారు. తన మేనమామలతో కలిసి తిరిగి వస్తున్నప్పుడు, మేన మామలు ఎడ్లబండి తీసుకురా వడానికి వెళ్ళినప్పుడు ఆమె రైల్వేట్రాక్‌ మీదకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అత్తమామల పైన ఆత్మహత్య ప్రేరకులుగా కేసు పెట్టారు. స్వర్ణలత రాసిన ఉత్తరాలను కోర్టులో ఆమె మరణా నికి కారణాలుగా (ఇజీటఛిఠఝ ట్ఞ్చఛ్ఛిట) ప్రవేశపెట్టారు. నేర సంఘటనతో ఆ ఉత్తరాలకి సామీప్యత (ఞట్ఠౌఝజ్టీడ) లేదని కోర్టు ఆ ఉత్తరాలను మరణ వాంగ్మూలంగా ఆమోదించ లేదు. (గోకుల చంద్ర వర్సెస్‌ స్టేట్‌, ఏ.ఐ.ఆర్‌.1950 కలకత్తా 306) సంఘటన కన్నా ముందు అంటే ఐదు సంవత్సరాలకి ముందు రాసిన ఉత్తరాలు కూడా మరణ వాంగ్మూలాలుగా ఆమోదించబడతాయి.

Tuesday, August 11, 2009

పోలీసులు - బెయిలు

ముద్దాయిలను అరెస్టు చేసిన తరువాత వాళ్ళని మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తుంటారు. చిన్న చిన్న నేరాలు చేసిన వ్యక్తులను పోలీసులే బెయిలుపై విడుదల చేస్తూ ఉంటారు. మరి కొంత మందిని మేజి స్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియాలి. కానీ చట్టప్రకారం ఆ విధంగా చేయడానికి వీల్లేదు. నేరాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి బెయిల బుల్‌ నేరాలు, నాన్‌ బెయిలబుల్‌ నేరాలు. బెయిలబుల్‌ నేరాల్లో నిందితుడు బెయిలు పొందే హక్కు కలిగి ఉంటా డు. బెయిలు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కోర్టులపై ఉంటుంది. బెయిలు నిరాకరించితే ముద్దాయి నష్టపరిహారం కూడా కోరవచ్చు. బెయిలబుల్‌ నేరాల్లో బెయిలు పొందే హక్కు కలిగి ఉంటారన్న విషయం ముద్దాయిలకు తెలియజెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కస్టడీలో ఉండి సరైన జామీను ఇచ్చినప్పుడు బెయిలబుల్‌ నేరాల్లో అతణ్ణి విడుదల చేయాల్సి ఉంటుంది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.436 నిబంధనను సవరణతో తీసుకొని వచ్చారు. బెయిలబుల్‌ నేరంలోని నిందితుడు పోలీసులు కోరిన జామీనును ఇవ్వలే పోయినపుడు అతన్ని పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు. అదే విధంగా బెయిలు ఇవ్వనపుడు కూడా కోర్టు ముందు హాజరు పరుస్తారు. బెయిబుల్‌ నేరాల్లో కోర్టు ముద్దాయికి తప్పనిసరిగా బెయిలు మంజూరు చేయాలి. నిజానికి ఆ బెయిలును పోలీసులే మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా జరగడం లేదు. బెయిలబుల్‌ నేరాల్లో కోర్టు బెయిలు మంజూరు చేసేటప్పుడు జామీను కోరే అవకాశం ఉంది. జామీను ఇవ్వలేనప్పుడు మాత్రమే అతన్ని జైలుకు పంపిస్తారు. అయితే అరెస్టు అయిన తేదీ నుంచి పది రోజుల్లోగా జామీను పెట్టకోలేకపోతే అతణ్ణి నిరుపేదగా పరిగణించి వ్యక్తిగత పూచీకత్తు మీద కోర్టులు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే నాన్‌బెయిలబుల్‌ నేరాల్లో కూడా పోలీసులు బెయిలు మంజూరు చేయవచ్చా? నాన్‌ బెయి లబుల్‌ నేరాల్లో బెయిలు మంజూరు చేయడం ఒక్క కోర్టు విచక్షణాధికారం పైనే ఉంటుందా? వీటి గురించి తెలుసుకునే మందు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.41 ఏమి చెప్తుందో తెలుసుకోవాలి. కోర్టు నుండి ఎలాంటి వారంటు లేకుండా ఏ వ్యక్తినైనా కొన్ని సందర్భాల్లో అరెస్టు చేసే అధికారాన్ని ఈ నిబంధన పోలీసు అధికారులకు ఇస్తుంది.

సె.41(1) () ప్రకారం- (1) కోర్టు నుంచి ఎలాంటి వారంటు లేకుండా, మెజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా పోలీసు అధికారి ఏ వ్యక్తినైనా-(ఎ) కాగ్నిజబుల్‌ నేరంతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినైనా లేక అతనికి వ్యతిరేకంగా సహేతుకమైన ఫిర్యాదు వచ్చినప్పుడు, విశ్వసనీయ సమా చారం అందినపుడు లేక సహేతుకమైన అను మానం ఉన్నప్పుడు, వాటితో ఆ వ్యక్తికి సంబంధం ఉన్నప్పుడు పోలీసు అధికారి అరెస్టు చేయవచ్చు. ఈ విధంగా అరెస్టు చేసిన వ్యక్తిని ఎక్కువ కాలం తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదు. ఎక్కువకాలం తమ నిర్బంధంలో ఉంచుకోవడాన్ని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె.57 నిషేధిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22 కూడా నిషేధిస్తుంది. వారెంటు లేకుండా ఎవరినైనా అరెస్టు చేసినపుడు అత న్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటలకు మించి పోలీసులు తమ కస్టడీలో ఉంచు కోవడానికి వీల్లేదు. అయితే మెజి స్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్ళే సమయాన్ని మినహయించ వచ్చు.

నాన్‌ బెయిలబుల్‌ నేరాల్లో, బెయిల్‌ అనేది హక్కుగా కాకుండా విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఈ విచక్షణాధికారాన్ని కోర్టులే ఉపయోగించాల్సి ఉంటుం దా? పోలీస్‌ అధికారులు కూడా ఉపయోగించవచ్చా? ఈ విషయం గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.169, సె.437(2)ల గురించి తెలుసుకోవాలి. దర్యాప్తు చేసిన తరువాత సరైన సాక్ష్యం లేదని పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారి భావించినపుడు గానీ లేక ముద్దాయి నేరం చేశాడని అనుమానించి మేజిస్ట్రేట్‌ వద్దకు పంపించడానికి సహేతుకమైన ఆధారాలు లేన ప్పుడు, ఆ వ్యక్తి తమ కస్టడీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర బాండుని జామీను దారులతో గాని లేకుండా గానీ తీసు కొని విడుదల చేయాల్సి ఉంటుంది. పోలీసు రిపోర్టుపై నేరాన్ని గుర్తించే మేజిస్ట్రేట్‌ వద్ద హాజరుకమ్మని ఆదేశించ డానికి అవకాశం ఉంది.

నాన్‌ బెయిలబుల్‌ నేరాల గురించి దర్యాప్తు చేస్తున్న ప్పుడు ముద్దాయిపై వచ్చిన సమాచారం సరైందనిగానీ, తగిన ఆధారాలు ఉన్నాయని గానీ దర్యాప్తు చేసే అధికారి భావించినపుడు అతడికి ఆ వ్యక్తిని విడుదల చేసే అధి కారం లేదు. ఆ విధంగా విడుదల చేయడం సరైంది కాదు కానీ అవినితి నిరోధక కేసుల్లో (ట్రాపు కేసుల్లో) తప్పు చేసిన పబ్లిక్‌ సర్వెంట్లను విడుదల చేయడం జరుగుతుంది. దర్యాప్తు చేసిన తరువాత సరైన సాక్ష్యం లేదని పోలీస్‌ అధికారి భావించినపుడు ముద్దాయి నేరం చేశాడని అనుమానించడానికి సహేతుకమైన ఆధారాలు లేనప్పుడు కస్టడీలో ఉన్న ముద్దాయిని పోలీసు అధికారి విడుదల చేయాల్సి ఉంటుంది. అదే విధంగా, అరెస్టు చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా వచ్చిన సమాచారం గానీ, ఫిర్యాదు గానీ ఆధార రిహ తంగా ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తిని విడుదల చేసే అధి కారం పోలీసు అధికారికి సె.437(2) ప్రకారం లభిస్తుంది.

ఏదైనా కేసు దర్యాప్తులో గానీ, విచారణ(ట్రయలు)లో గానీ, ఉన్నప్పుడు అరెస్టు చేసిన అధికారికి గానీ, కోర్టుకు గానీ ఆ వ్యక్తి నాన్‌ బెయిలబుల్‌ నేరం చేశాడని సహే తుకంగా అనిపించనప్పుడు అతన్ని బెయిలుపై విడుదల చేయాల్సిన బాధ్యత ఆ అధికారిపైగానీ, ఆ కోర్టుపై గానీ ఉంటుంది. కానీ అతడు నేరం చేశాడా లేదా అన్న విషయం గురించి ఇంకా విచారణ అవసరం ఉన్నప్పుడు, అతను హాజరుకావడానికి గాను బాండును తీసుకోవాల్సి ఉంటుంది.ఈ విషయాలన్నింటినీ పరిగణలోనికి తీసుకు న్నప్పుడు సాధారణ నియమం ప్రకారం నాన్‌ బెయి లబుల్‌ నేరాల్లో పోలీసు అధికారులు బెయిలు ఇవ్వడానికి వీల్లేదు. కానీ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.169, సె.437లలో పేర్కొన్న పరిస్థితుల్లో మాత్రమే పోలీస్‌ అధికారులు నాన్‌ బెయిలబుల్‌ నేరాల్లో బెయిలు మంజూరు చేయడానికి అవకాశం ఉంది.

Tuesday, August 4, 2009

గౌరవ హత్యలు


నేరాలు పాతవే. కానీ పేర్లు మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని పదబంధాలు వచ్చాయి. అవే -ద్వేషించే నేరాలు, ద్వేషించే ఉపన్యాసం, గౌరవనేరాలు, గౌరవహత్యలు. ఇలాంటి నేరాలకు సంబంధించి కొత్త చట్టం కావాలని కఠిన శిక్షలు ఉండాలని మరి కొందరు వాదిస్తున్నారు. కొత్త చట్టాలు అవసరం లేదు. ఈ నేరాలని త్వరితగతిన దర్యాప్తు చేయడానికి దర్యాప్తు సంస్థలు, పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు ఉంటే చాలని మరి కొంత వాదిస్తున్నారు. ‘గౌరవ నేరాలు’ ‘గౌరవ హత్యలు’ దేశమంతటా జరుగుతూనే ఉన్నాయి. కానీ హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చిదంబరం రాజ్య సభలో ప్రస్తావించారు. ఈ గౌరవ నేరాలని, గౌరవ హత్యలని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉందని మంత్రి చెప్పారు. ఈ పదబందాలని వింటున్నప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. నేరాల్లో గౌరవ నేరాలు, హత్యల్లో గౌరవ హత్యలు కూడా ఉంటాయా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. ‘గౌరవనేరాలు’ ‘గౌరవహత్యలు’ అంటే ఏమిటో, వీటిని అరికట్టడం ఎవరి బాధ్యత, వీటిని అరికట్టడానికి ప్రత్యేక చట్టం అవసరమా? అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులని తీసుకొస్తే సరిపోతుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలని వెతుకుందాం.

ఇటీవలి కాలంలో జరిగిన రెండు మూడు సంఘటనలని హోంమంత్రి ఉదహరించారు. వాటిని చూద్దాం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ ముస్లిం యువతిని దళిత యువకుడు, పెద్దవాళ్ళకి చెప్పకుండా వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ యువకుడు హత్యకు గురైనాడు. ఇలాంటి మరో సంఘటన హర్యానాలో జరిగింది. ఓ జంట పెద్దలకు తెలియకుండా కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆ అమ్మాయి బంధువులు ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొని పోయినారు. ఈ విషయం తెలుసుకున్న భర్త కోర్టులో దరఖాస్తు చేసి, కోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు జవానుని తీసుకొని భార్యని వెదకడానికి బయల్దేరాడు. చివరికి ఆ ఇద్దరూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల చేతుల్లో హతమయ్యారు. ఇవి రెండూ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘనలు. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి.

కొన్ని సందర్భాల్లో ఈ విధంగా వివాహాలు చేసుకున్న వ్యక్తులని సాంఘిక బహిష్కరణకు కూడా గురి చేస్తుంటారు. రకరకాలైన ఆంక్షలని కూడా విధిస్తూంటారు. కుల సంఘాలు, మత పెద్దలు తీర్పులని, ఫత్వాలని కూడా వీరికి వ్యతిరేకంగా జారీ చేస్తుంటారు. ఇటువంటి నేరాలనే గౌరవ నేరాలని, ఇలా జరిగే హత్యలనే గౌరవ హత్యలని అంటున్నారు. కుటుంబ గౌరవాలని మంట కలిపారని వారి బంధువులు చేసే నేరాలు ఇవి. కాల దోషం పట్టిన ఆచారాల్లో వీటి వేళ్ళు పాతుకుపోయి ఉన్నాయి. ఈ నేరాలు ఎక్కువగా ఇలాంటి వివాహాలు చేసుకున్న యువతీ కుటుంబ సభ్యుల పైన ఎక్కువగా జరుగుతుంటాయి మన భారత దేశ చట్టాల్లో వీటిని ప్రత్యేకంగా వర్గీకరించరాదు. ఇలాంటి సంఘటనల్లో ఎవరైనా హత్యకు గురైతే, ముద్దాయిలపై భారతీయ శిక్షాస్మృతిలోని సె.302 ప్రకారమే కేసులు నమోదవుతున్నాయి.

ఒక వ్యక్తిని ప్రేమించడం, పెళ్ళి చేసుకొని జీవించడం ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కు అయితే వాళ్ళిద్దరూ మేజర్లై ఉండాలి. చట్ట ప్రకారం వివాహాం చేసుకునే యోగ్యత కలిగి ఉండాలి. కుటుంబ గౌరవం పేరుతో జరిగే ప్రతి మరణం పురాతన భావాలకు నిదర్శనం. నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో ఈ మరణాలు దిగ్భ్రాంతిని కలుగచేస్తాయి. కఠినమైన కుల సమాజంలో కుటుంబ గౌరవం పేరుతో జరుగుతున్న హత్యలే ఈ గౌరవ హత్యలు. గ్రామాల్లో కుల సంఘాలు తీర్పులని అమలు చేస్తూ కొంత మంది వ్యక్తులు ఈ నేరాలకి పాల్పడుతున్నారు. ఈ నేరాలు స్త్రీల పైనా, పురుషులపైనా, జరుగుతున్నాయి. ప్రేమి అప్యాయతలకి ఈ నేరాలు వ్యతిరేకం, కుల సంఘాలు జారీ చేసే తీర్పులకి, ఫత్వాలకి చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేనప్పటికీ ఆ తీర్పులు కొన్ని రాష్ట్రాలో కోర్టు తీర్పులు డిక్రీల కన్నా సమర్ధవంతంగా అమలవుతున్నాయి. ఇది చాలా అందోళన కలిగిస్తున్న అంశం.

కులసంఘాలు తీర్పులు చెప్పకుండా ఫత్వాలు జారీ చేయకుండా అదుపు చేయడానికి తగిన నిబంధనలు ఇప్పుడు అమల్లో ఉంటున్న చట్టాల్లో లేవు. అదే విధంగా సంఘ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేస్తే వారిపై సరైన చర్యలు తీసుకునే విధంగా భారతీయ శిక్షాస్మృతిలో ఎలాంటి నిబంధనలు లేవు. అందుకని తగు నిబంధనలు తేవడం అవసరమే. సాధారణంగా నేరాలని రుజువు చేసే బాధ్యత ప్రాసిక్యూషన్‌ పై ఉంటుంది. వరకట్నం చావు విషయంలో కూడా అలాంటి నిబంధనలే ఉన్నప్పటికీ, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో ఆ నేరం గురించి నిజమనే భావనని తీసుకోవడానికి సె113బి అన్న నిబంధనని ఏర్పరిచారు.

ఈ హత్యల విషయంలో కూడా అలాంటి నిబంధన అవసరమని అన్పిస్తుంది. కలాంతర, మతాంతర వివాహాలని ఎవరైనా జంట వివాహం చేసుకొని దాన్ని వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పుడు ఒకటి రెండు సంవత్సరాల్లో వారి మరణం అసాధారణ పరిస్థితుల్లో జరిగితే దానికి ఆ కుటుంబ సభ్యుల బాధ్యత వహించే విధంగా భారతీయ సాక్ష్యాధారాలు చట్టం మార్పులు అవసరమే. ప్రత్యేక చట్టం చేయన్పటికీ భారతీయ శిక్షాస్మృతిలో, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో అవసరమైన సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్పిస్తుంది. పోలీసులు, శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలుగా రాజ్యాంగం రాష్ట్రాలకు అప్పగించిన్పటికీ, ఈ విషయంలో అవసరమైన సవరణలని, అవసరమనిపిస్తే కొత్త చట్టాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. చట్టంలో మార్పులే కాదు పరిష్కారానికి అవసరమైన న్యాయ, పోలీసు యాంత్రాంగాన్ని కూడా ప్రత్యేకం ఏర్పాటు చేయాలి. అలా చేయనప్పుడు తగు ఫలితాలు వచ్చే అవకాశం లేదు.

Tuesday, July 28, 2009

గుప్తత హక్కు సంపూర్ణమా?


కొత్త చట్టాలు వస్తున్నాయి. సాంకేతికంగా అభివృద్ధిచెంది ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. గతంలో సమాచార హక్కు చట్టం లేదు. స్టింగ్‌ ఆపరేషన్లు లేవు. మొబైల్‌ ఫోన్లు లేవు. వీటి రాక వల్ల వ్యక్తికి ఉండే గుప్తత హక్కు ఈ మధ్య కాలంలో చర్చనీయాంశం అయింది.మన రాజ్యాంగంలో గుప్తత హక్కుకి అభయం ఇవ్వలేదు.

వ్యక్తి గుప్తతకి సంబంధించిన సూత్రాలను మాత్రమే ఇప్పుడు ఉన్న చట్టాలు తెలియచేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ క్రియాత్మకంగా వ్యవహరించి ఈ గుప్తత హక్కుని విస్తరింప చేసింది. ఇందుకు రాజ్యాంగ అభయాన్ని కల్పించే దిశగా తీర్పులను ప్రకటించింది. ఈ హక్కు ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రజాహితం కోసం ఈ హక్కుకి భంగం కల్గించవచ్చా, అవసరమైన పరిస్థితులలో టెలిఫోన్లను కూడా ట్యాప్‌ చేయవచ్చా?

‘గుప్తత హక్కు’ మొదటి సారిగా ‘కరక్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర ప్రదేశ్‌’ కేసులో 1963 ప్రాంతంలో సుప్రీంకోర్టు ముందు చర్చకు వచ్చింది. రాజ్యాంగం అభయం ఇచ్చిన అధికరణల్లో (19(1) (డి), 19(1) (ఇ), 21) ఈ హక్కు ఉన్నదా అన్న విషయం చర్చకు వచ్చింది. ఈ కేసులో మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఈ హక్కును రాజ్యాంగం గుర్తించలేదు. కానీ మైనారిటీ అభిప్రాయం ఈ హక్కును రాజ్యాంగం గుర్తించిందని, రాజ్యాంగంలోని ‘స్వేచ్ఛ’ హక్కులో ఈ హక్కు కూడా మిళితమై ఉందని న్యాయమూర్తి సుబ్బారావు అభిప్రాయపడినారు.

ఈ హక్కు గురించిన చర్చ మళ్ళీ ‘గోవింద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌’ కేసులో మరోసారి చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసులో గుప్తత హక్కును గుర్తించింది. రాజ్యాంగంలోని అధికరణలు 19(1)(ఎ), 19(1)(డి), 21లలో ఈ హక్కు ప్రసారితం అవుతుందని న్యాయమూర్తులు ఈ కేసులో ప్రకటించారు. అయితే ఈ హక్కు సంపూర్ణం కాదని కూడా సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది. అధికరణ 19(2)లో ఉన్న పరిమితులు ఈ హక్కుకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు మళ్ళీ ‘ఉన్ని క్రిష్ణన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ (ఏ.ఐ.ఆర్‌ 1993 సుప్రీంకోర్టు 2178) కేసులో మళ్ళీ చర్చకు వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛ హక్కులో గుప్తత హక్కు మిళితమై ఉందని సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. వ్యక్తి హితం, ప్రతిహితం అనేవి చర్చకు వచ్చినప్పుడు ఈ వ్యక్తిగత హక్కులో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా అన్న విషయం వి. రాజ్‌గోపాల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు (ఏ.ఐ.ఆర్‌ 1998 సుప్రీంకోర్టు 264) కేసులో చర్చకు వచ్చింది. ప్రజాహితానికి సంబంధించినప్పుడు ఈ గుప్తత హక్కు ఉండదని కోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. అయితే కొన్ని మినహాయింపులను కోర్టు ప్రకటించింది. గుప్తత హక్కుకు రాజ్యాంగ హోదాను సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటిస్తూనే కొన్ని సూత్రీకరణలు చేసింది. అవి-

1. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లో గుప్తత హక్కు మిళితమై ఉంది. తన విషయంలో, తన కుటుంబం విషయంలో, వివాహం, సంతానం, చదువు తదితర విషయాల్లో ప్రతి పౌరునికి గుప్తత హక్కు ఉంటుంది. అయితే స్వచ్ఛందంగా ఏదైనా వివాదంలో చిక్కుకుంటే, వివాదాన్ని స్వచ్ఛంధంగా ఆహ్వానిస్తే, లేదా ఏదైనా వివాదాన్ని సృష్టిస్తే ఈ గుప్తత హక్కు ఉండదు. 2. ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంది. విషయం ప్రజల రికార్టు అయినప్పుడు, ఈ గుప్తత హక్కు ఉండదు. కానీ ఎవరైనా మహిళ ఏదైనా అత్యాచారానికి గురైనప్పుడు, కిడ్నాప్‌ అయినప్పుడు ఏదైనా నేరంలో ఇరుక్కున్నప్పుడు వారిని అగౌరవపరిచే విధంగా ప్రసార మాధ్యమాలలో, అచ్చు మాధ్యమాల్లో ప్రచారం చేయకూడదు. 3. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా సుప్రీంకోర్టు రెండవ మినహాయింపును ప్రకటించింది. వారి విద్యుక్త ధర్మానికి, నడవడికలకు ఈ గుప్తత హక్కు వర్తించదు.

గుప్తత హక్కును విస్తరింపచేసినప్పటికీ సుప్రీంకోర్టు అది సంపూర్ణం కాదని స్పష్టం చేసింది. ఈ హక్కుకీ పరిమితులు ఉన్నాయని కూడా ప్రకటించింది. ఇదే విషయం ఎక్స్‌ వర్సెస్‌ హాస్పిటల్‌ కేసులో కూడా చర్చకు వచ్చింది. ఈ కేసులో ఒక వ్యక్తికి హెచ్‌.ఐ.వి. వైరస్‌ సోకిందన్న విషయం ఆ వ్యక్తి వివాహం చేసుకోబోతున్న కుటుంబ సభ్యులకు తెలియచేశాడు అతణ్ణి పరీక్షించిన డాక్టరు. ఆ విధంగా తెలియచెయ్యడం తన గుప్తత హక్కుకు భంగం కలిగించడమేనని అతడు కోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు వ్యక్తి గుప్తత హక్కును పునఃపరిశీలించి ఈ హక్కు సంపూర్ణం కాదని ఇతరుల స్వేచ్ఛను, హక్కులను, ఆరోగ్యాలను కాపాడటానికి జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటించింది.

టెలిఫోన్‌ సమాచారాన్ని ట్యాపింగ్‌ చేయడం వ్యక్తి గుప్తత హక్కులోకి జోరబడటమే అవుతుందా? అది వ్యక్తిగత సంభాషణ అని, రహస్యమైనదని సుప్రీంకోర్టు ముందు పీపుర్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా((1997) ఎస్‌.సి.సి.301) కేసులో వాదించారు. టెలిఫోన్‌ సంభాషణను ట్యాపింగ్‌ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు తీర్పులో ప్రకటించింది. అయితే ఈ ట్యాపింగ్‌ చేయడం ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాలలో అవసరం అవుతుంది. అందుకోసం చట్టాన్ని తయారు చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ విధంగా కాకుండా వ్యక్తుల సంభాషణను ట్యాపింగ్‌ చేస్తే అది ఆ వ్యక్తుల ప్రాథమిక హక్కులలోకు జోక్యం చేసుకోవడమే అవుతుంది.

ఇంటర్నెట్‌ వచ్చిన తర్వాత వ్యక్తులపైన, వాళ్ళ అలవాట్లపైన నిఘా పెట్టడం సులువై పోయింది. ప్రైవేట్‌ యాజమాన్యాలు తమ ఉద్యోగుల మెయిల్స్‌ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా కనక్కొంటున్నాయి. ఇది వ్యక్తుల గుప్తత హక్కులోకి జోరబడడమే. వారిని నియంత్రించడానికి ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ చట్టంలో 2000లో సె.43 ఏర్పరిచారు. ఏ యాజమాన్యమైనా అనుమతి లేకుండా కంప్యూటర్‌లోని సమాచారాన్ని చూస్తే నష్టపరిహారం ఇచ్చే విధంగా చట్టంలోని ఈ నిబంధన ఉపయోగపడుతుంది. అయితే ఈ నిబంధన సరిపోదని అనిపిస్తోంది.

స్టింగ్‌ ఆపరేషన్లు అవసరమే. కానీ ప్రసార మాధ్యమాలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్పుడు విషయాలను కూడా ప్రసారం చేసి వ్యక్తుల గుప్తత హక్కుల్లో జోరబడుతున్నాయి. వీటిని నియంత్రించుకోవడానికి చట్టం లేదు. ప్రసార మాధ్యమాలు కూడా ఎలాంటి నిబంధనలను, నియమాలను ఏర్పరచుకోలేదు.

సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత గుప్తత హక్కు మరోసారి చర్చనీయాంశం అయింది. పబ్లిక్‌ అధారిటీస్‌ దగ్గర ఉన్న వివిధ వ్యక్తుల సమాచారాన్ని ఇవ్వవచ్చా లేదా, ఇస్తే అది వాళ్ళ వ్యక్తిగత హక్కుల్లో జోరబడినట్లు అవుతుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత హక్కులో జోరబడినట్లు కాదని చట్టం భావిస్తున్నది. పారదర్శకత, జవాబు దారీతనం అవసరమని ఈ చట్టం భావిస్తుంది.

గుప్తత హక్కు అనేది జీవించే హక్కులో భాగమే కానీ అది సంపూర్ణమైనది కాదు. నేరాలను నిరోధించడానికి, ఇతరుల ఆరోగ్యాలను, స్వేచ్ఛలను రక్షించడానికి, నీతి నియమాలను పరిరక్షించడానికి గాను ఈ హక్కుకు దీనికి పరిమితులను ఏర్పరచవచ్చు. వ్యక్తి ప్రాథమిక హక్కులకి సమాజ హితానికు, మధ్య సమస్య తలెత్తినప్పుడు సమాజ హితమే ప్రాధాన్యతని సంతరించుకుంటుంది.

Followers

Blog Archive