Wednesday, October 27, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు

పరస్పర ఆమోదంతో విడాకులు
October 26th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలనుకునే వ్యక్తులు సె.-13-బి ప్రకారం ఈ విషయాలను సంతృప్తి పరచాల్సి వుంటుంది. అవి -
ఆ దంపతులు ఒక సంవత్సరం నుంచి గానీ, అంతకు మించి గానీ వేరువేరుగా నివసిస్తూ వుండాలి.
వారిద్దరూ కలిసి నివసించలేని పరిస్థితులు వుండాలి.
తమ వివాహం ఇద్దరూ రద్దు కావాలని పరస్పర ఆమోదంతో కోరుకుని ఉండాలి.
హిందూ వివాహాన్ని రద్దు చేసుకోవడం కోసం విడాకులు దరఖాస్తుని దాఖలు చేయడానికి సంవత్సరం కాలం పాటు కాలపరిమితిని విధించారు. వివాహమైన సంవత్సర కాలం తరువాత వాళ్లు దరఖాస్తుని దాఖలు చేసుకోవాల్సి వుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సె.-14ప్రకారం కోర్టు దీనికి మినహాయింపుని ఇవ్వవచ్చు. దంపతులు పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవాలంటే వాళ్లు సంవత్సరం నుంచి గానీ, అంతకు మించి గాని వేరువేరుగా నివశిస్తూ వుండాలి. ఈ విధంగా కానప్పుడు పరస్పర ఆమోదంతో విడాకులని కోరడానికి అవకాశం లేదు. సె.-14 ప్రకారం అనుమతి ఇవ్వవచ్చా? ఇవీ ప్రశ్నలు.
స్వీటీ, ఆమె భర్త సునీల్ కుమార్ పరస్పర ఆమోదంతో సె.-13-బి ప్రకారం విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేశారు. అయితే వారి వివాహమైన సంవత్సరంలోపే దరఖాస్తుని దాఖలు చేసి సె.-14 ప్రకారం కోర్టు అనుమతిని కోరారు. కోర్టు ఆ అనుమతిని ఇవ్వలేదు.
తామిద్దరూ కలిసి ఒక్కరోజు కూడా జీవించలేదని, అందుకని మినహాయింపుని ఇవ్వాలని వారు కోర్టుని కోరారు. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల వల్ల వాళ్లు కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నాయని, అందువల్ల వాళ్లు మానసిక, శారీరక క్షోభని భరించలేమని దరఖాస్తులో పేర్కొన్నారు. పరస్పర ఆమోదంతో విడాకులు పొందడంవల్ల తమ జీవితాలని తిరిగి నిర్మించుకునే అవకాశం వుందని కూడా వాళ్లు తమ దరఖాస్తులో పేర్కొన్నారు. భర్త ఉద్యోగరీత్యా, విదేశాల్లో వుంటున్నాడు. వివాహం కాగానే అతను బెంగళూరులో కొంతకాలం ఉద్యోగం చేసి లండన్‌కి వెళ్లిపోయాడు. అక్కడ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఉద్యోగాన్ని వదిలి భారత దేశానికి వచ్చే పరిస్థితుల్లో లేడు. భార్య భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఆమె విదేశాలకు వెళ్లే యోచనలో లేదు. అందుకని తాము కలిసి వుండే పరిస్థితి లేదని వాళ్లు భావించి పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేసుకున్నారు. సంవత్సర కాలంగా తాము వేరుగా నివసించడం లేదు కాబట్టి సె.-14 ప్రకారం మినహాయింపుని ఇవ్వమని కుటుంబ న్యాయస్థానం కోర్టుని కోరారు. కోర్టు వారి దరఖాస్తుని తిరస్కరించింది. దీనిపై కర్నాటక హైకోర్టులో అప్పీలుని దాఖలు చేశారు.
వారిద్దరి మధ్య పరిష్కరించడానికి వీల్లేని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తన భర్త శాశ్వతంగా విదేశాల్లో వుండదల్చుకున్నాడు. అందుకు తాను ఇష్టపడటం లేదని భార్య తన ప్రమాణ పత్రంలో స్పష్టంగా తెలియజేసింది. భార్య వయస్సు 25 సంవత్సరాలు. భర్త వయస్సు 33 సంవత్సరాలు. వారి పెద్దవాళ్లు బాధ్యతలు తెలిసిన వాళ్లు. వాళ్లిద్దరూ తాము కలిసి వుండలేమని చెబుతున్నప్పుడు వారిని వివాహ బంధం నుంచి విముక్తి చేయక పోవడానికి ఎలాంటి కారణం కన్పించడం లేదు.
సె.-13-బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే సంవత్సర కాలంగా లేదా అంతకు మించి వేరుగా నివశిస్తూ వుండాలి. దీనికి కూడా సె.-14 ప్రకారం కోర్టు మినహాయింపుని ఇచ్చి దరఖాస్తు దాఖలు చేసుకోవడానికి అనుమతిని ఇవ్వవచ్చు. ఒత్తిడివల్ల, బెదిరింపు వల్ల దరఖాస్తు దాఖలు చేయడం లేదని, అదే విధంగా పరస్పర ఆమోదంతో విడాకులు పొందడంవల్ల ఉత్పన్నమయ్యే విషయాలు వాళ్లకి తెలిసి వుండాలి. వీటి విషయంలో కోర్టు సంతృప్తి చెందాల్సి వుంటుంది.
సంవత్సర కాలానికి మినహాయింపు ఇవ్వాలంటే కోర్టు ఈ విషయాల గురించి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అవి:-
దంపతులకి విషయాలను అర్థం చేసుకునే యోగ్యత
ఒత్తిడి, బెదిరింపులు లేకపోవడం
ఇద్దరూ కలిసి వుండే పరిస్థితులు లేకపోవడం
వాహం రద్దు కోరుతున్న పరిధి
తప్పుడు విషయాలు చెప్పడం
పార్టీల వయస్సు, వివాహం పొడిగింపు వల్ల వారి పునర్వివాహ అవకాశాలు దెబ్బతినడం
ఈ విషయాలను గమనించి అనుమతిని ఇవ్వాలి. ఈ కేసులో వీరి వివాహం కొనసాగించడంవల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందుకని సె.-14 ప్రకారం సంవత్సర కాలం పాటు వేరుగా వుండటానికి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం వుంది. (శ్రీమతి స్వీటీ, ఎమ్. వర్సెస్ సునీల్ కుమార్ కె.బి. కర్నాటక లా జర్నల్ బి (2007) 244)
తీర్పులోని ముఖ్యాంశం: భార్యా భర్తలు విడాకులు పొందాలంటే వివాహమైన సంవత్సరం తరువాతే దరఖాస్తు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతలోపు దరఖాస్తు చేసుకోవాలంటే సె.-14 ప్రకారం కోర్టు అనుమతి ఉండాల్సి వుంటుంది. అదే విధంగా సె.-13-బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే కనీసం సంవత్సరకాలం వేరుగా వుండాలి. అయితే సె.-14 ప్రకారం కోర్టు మినహాయింపు ఇవ్వవచ్చు.

Tuesday, October 12, 2010

ఎలాంటి తప్పు లేకుండా విడాకులు

ఎలాంటి తప్పు లేకుండా విడాకులు
October 12th, 2010

హిందూ వివాహ చట్టప్రకారం దంపతుల్లోని ఎవరైనా వ్యక్తి విడాకులు పొందాలంటే

ఎదుటివ్యక్తి చేసిన తప్పిదం వుండాలి. అది చట్టం గుర్తించిన తప్పిదం అయి వుండాలి.

తామే తప్పుచేసి ఆ ఆధారంగా విడాకులు కోరడానికి అవకాశం లేదు. క్రూరత్వం,

వైవాహికేతర సంబంధాలు, విడిచిపెట్టి వుండటంలాంటివి వివాహ తప్పిదాలుగా చట్టం

గుర్తించింది.
వివాహ తప్పిదం వున్నపుడే విడాకులు తీసుకోవాలి అన్న సిద్ధాంతం కాలక్రమంలో

మారిపోయింది. ఎలాంటి తప్పిదం లేకున్నా విడాకులు పొందవచ్చన్న దిశగా చట్టం

మారింది. దంపతుల మధ్యన సరైన అవగాహన లేనప్పుడు కూడా విడాకులు

తీసుకోవచ్చన్నది కూడా ఒక ఆధారంగా పరిణమించింది.
వివాహ సంబంధాలు విఫలం కావడానికి ప్రతిసారి ఎదుటివారి వివాహ తప్పిదం

వుండాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్యన దంపతుల

మధ్యన అవగాహన లేకపోవడంవల్ల కూడా వివాహాలు విఫలం అవుతుంటాయి.

అన్ని ప్రయత్నాలు విఫలం అయినపుడు ఇలాంటి సందర్భం ఏర్పడుతుంది.
ఎదుటివారి తప్పిదం ఆధారంగానే దంపతుల మధ్యన వివాహాలని రద్దుచేసేవారు.

‘తప్పిదం’ సిద్ధాంతం ప్రకారం ఎదుటివ్యక్తి వివాహ తప్పిదం చేసినపుడే వివాహాన్ని

రద్దుచేసి విడాకులని మంజూరుచేసే పరిస్థితి చట్టప్రకారం వుంది. ఇలాంటి

సందర్భాలలో విడాకులు తీసుకోవడానికి భార్యాభర్తలు తప్పుడు ఆధారాలు,

ఆరోపణలు చేసి ఒకరికొకరు లాలూచీపడి విడాకుల కోసం దరఖాస్తులు చేసే పరిస్థితి

గతంలో వుండేది. వారు ఆ విధంగానే దరఖాస్తులు చేసుకునేవారు. ఒకరకంగా

చెప్పాలంటే లాలూచీపడి విడాకుల డిక్రీని పొందేవారు. దంపతుల్లో ఒక వ్యక్తి వివాహ

తప్పిదం చేసాడని మరో వ్యక్తి ఆరోపించడం, ఆ మరో వ్యక్తి దాన్ని అంగీకరించడం

ద్వారా విడాకుల డిక్రీలని పొందేవారు. ఎదుటివారి తప్పిదం లేకున్నా వివాహాన్ని

రద్దుచేసుకోవడానికి ఇద్దరూ లాలూచీపడేవారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి

చట్టంలో ‘సమ్మతితో విడాకులు’ అన్న సిద్ధాంతం ద్వారా కొత్త నిబంధనని

ఏర్పరిచారు. దీని ఉద్దేశం సచ్ఛీలతతో దంపతులు విడాకులు తీసుకోవాలి తప్ప

మోసపూరితంగా, లాలూచీతో విడాకులు పొందకూడదని, అంతిమంగా వాళ్ళు

పొందేది చట్టబద్ధమైనదైనా వారి దారి చట్టవ్యతిరేకంగా ఉండకూడదని చట్టం ఉద్దేశం.
‘సమ్మతితో విడాకుల’ సిద్ధాంతంవల్ల
వివాహ పవిత్రత దెబ్బతిన్నదా?
హిందూ వివాహాలు ఒప్పందంలాంటివి కాదు. అవి పవిత్రమైనవి. ‘సమ్మతితో

విడాకులు’ అన్న సిద్ధాంతం ద్వారా ఆ భావన నుంచి కొంత ప్రక్కకి వైదొలగడమే.

వివాహ ఒప్పందంలోకి దంపతులు రావడానికి ఎంత స్వేచ్ఛ వుందో అదేవిధంగా

వైదొలగడానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. దీనే్న ‘సమ్మతితో విడాకులు’ అంటారు.

ఉభయుల సమ్మతితో విడాకులు పొందే నిబంధనని చట్టంలో ఏర్పాటుచేయడంవల్ల

సంప్రదాయంగా వస్తున్న హిందూ వివాహాలు పవిత్రమైనవి అన్న భావనకి సమాధి

చేయడమేనని చాలామంది భావన.
ముస్లింలలో ఇలాంటి భావన వుందా?
ముస్లిం వివాహాలు ఒప్పందాలలాంటివి. వాటిని రద్దుచేసుకోవచ్చు. సమ్మతితో

వివాహాలని రద్దుచేసుకోవడం చాలా సులువు. ఉభయుల సమ్మతితో విడాకులు

పొందడానికి ముస్లిం లాలలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. అవి ‘ఖుల్లా’,

‘ముబ్బారత్’. ‘ఖుల్లా’ పద్ధతిలో వివాహం చేసుకోవాలన్న అభిప్రాయం భార్యనుంచి

వస్తుంది. ముబ్బారత్‌లో ఉభయులనుంచి వస్తుంది. ముస్లింలా అనేది కోడ్‌లాగా

మార్చలేదు. అందుకని న్యాయపరమైన డిక్రీ అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఒప్పందం

ద్వారా విడాకులు తీసుకుని దానికి ఖాజా ఆమోదముద్ర వుంటే సరిపోతుంది.
ప్రత్యేక వివాహ చట్టంలో ఇలాంటి భావన వుందా?
ప్రత్యేక వివాహ చట్టాన్ని 1954లో తయారుచేశారు. ఆ చట్టాన్ని తయారుచేసిన

సంవత్సరం తరువాత హిందూ వివాహ చట్టాన్ని తయారుచేశారు. హిందూ వివాహ

చట్టం ఒక్క హిందువులకే పరిమితం. ప్రత్యేక వివాహ చట్టం అన్ని మతాలవారికి

వర్తిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టంలో ఉభయుల సమ్మతితో

విడాకులు పొందడానికి అవసరమైన నిబంధనని ఏర్పరిచారు. హిందూ వివాహ

చట్టం ఆ తరువాత తయారుచేసినప్పటికీ హిందువులు ఈ నిబంధనని

అంగీకరించరు అన్న అభిప్రాయంవల్ల ఈ నిబంధనని హిందూ వివాహ చట్టాన్ని

తయారుచేసినపుడు ఏర్పరచలేదు. కానీ 1978లో ఈ నిబంధన అవసరమని భావించి

13(బి)ని ఏర్పరిచారు. ఈ నిబంధన ప్రగతిశీలమైనదని చాలామంది భావన. దీనివల్ల

తప్పుడు ఆరోపణలతో విడాకులు తీసుకోకుండా కలిసి జీవించి వుండలేని పరిస్థితుల్లో

ఈ నిబంధన ప్రకారం విడాకులు తీసుకోవటం సాధ్యమవుతుందని చాలామంది

వ్యక్తుల భావన.
క్రైస్తవులలో ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకోవచ్చా?
ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకునే అవకాశం క్రైస్తవులకి గతంలో లేదు.

కానీ 2001 సంవత్సరంలో విడాకుల చట్టం, 1869కి సవరణలు తీసుకొచ్చి సె.10ఎ

నిబంధనని చేర్చినారు. ఈ కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులుకూడా ఉభయుల

సమ్మతితో విడాకులు తీసుకోవచ్చు.
ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకునే పద్ధతి అమల్లోకి రావడానికి చాలాకాలం

పట్టింది. సోవియట్ విప్లవం తరువాత అక్కడ ఈ పద్ధతిని ఏర్పాటుచేశారు. ఆ

తరువాత చైనా, బెల్జియమ్, నార్వే, జపాన్, పోర్చుగల్ దేశాలు ఈ నిబంధనని

చట్టంలో ఏర్పాటు చేసుకున్నాయి.
విడాకులకోసం దరఖాస్తు చేసుకున్న తరువాత
ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుని విడాకుల దరఖాస్తు చేసుకున్న దంపతులు

కూడా తమ దరఖాస్తులు విచారణలో ఉన్నపుడు వాటిని ఉభయుల సమ్మతితో

విడాకుల దరఖాస్తుగా మార్చుకునే అవకాశం వుంది. దీనివల్ల శత్రుభావంతో

విడిపోకుండా వుండే పరిస్థితి ఏర్పడుతుంది.

Thursday, October 7, 2010

ముస్లింల వివాహాలు - చట్టబద్ధత

ముస్లింల వివాహాలు - చట్టబద్ధత
August 31st, 2010

భారతదేశంలో ముస్లింల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టాన్ని ‘ముస్లిం లా’ అంటున్నాం. ఈ చట్టానికి ప్రధాన ఆధారం ఇస్లామిక్ చట్టంలోని పవిత్ర భాగాలు, దానితో పాటు ఆచార వ్యవహారాలు కోర్టు తీర్పులు ముస్లింల వ్యక్తిగత చట్టం క్రమబద్ధం కాలేదు. ముస్లింల వ్యక్తిగత చట్టాన్ని వివిధ రకాలైన శాఖలు వివిధ రకాలుగా వ్యాఖ్యానించాయి. భారతదేశంలోని ముస్లింలు ఎక్కువగా ‘హనాఫీ’ శాఖను అనుసరిస్తున్నారు. సున్నీ తరగతికి చెందిన ముస్లింలలో నాలుగు ఉపతరగతులున్నప్పటికీ వీళ్ళందరూ హనాఫీ శాఖలో వున్న వ్యక్తిగతమైన చట్టాన్ని అవలంభిస్తున్నారు. షియా తరగతికి చెందిన ముస్లింలు ‘ఇత్నా అఫారీ’ శాఖలో పేర్కొన్న చట్టాన్ని అవలంభిస్తున్నారు. ముస్లింల వ్యక్తిగత చట్టం క్రమబద్దీకరించబడలేదు. అందుకని ఈ చట్టంలోని నిబంధనలు అన్నీ పవిత్రమైన మత చట్టాలనుంచి తీసుకోవడం జరిగింది. మస్లింల వ్యక్తిగత చట్టంలో వారి వైవాహిక జీవితానికి సంబంధించి ఒకే ఒక చట్టం క్రమబద్దీకరించడం జరిగింది. అదే ముస్లింల వివాహాల రద్దుపరచే చట్టం (1939).ప్రతి ప్రాంతానికి సంబంధించి వివిధ రకాలైన ప్రత్యేకమైన నిబంధనలేమీ లేవు. అయితే ఆయా ప్రాంతాలలోని హైకోర్టు వ్యాఖ్యానించిన పద్ధతినే ఆయా ప్రాంతాలలో పాటిస్తున్నారు. ఎక్కడైతే సుప్రీంకోర్టు వివరంగా వ్యాఖ్యానించిందో ఆ విషయాలు అన్ని ప్రాంతాలకి వర్తిస్తాయి.ముస్లిం చట్టం భారతదేశంలోని ప్రతి ముస్లింకీ వర్తిస్తుంది. భగవంతుడొక్కడే ఉన్నాడని, మహమ్మద్ అతను ప్రవక్త అని నమ్మే వ్యక్తులందరూ ముస్లింలే!
ముస్లింల వివాహంలోని ముఖ్యాంశాలు
ముస్లింల వివాహం ఒక సివిల్ కాంట్రాక్టు వంటిది. దాని ప్రధానోద్దేశం పిల్లలకు జన్మనివ్వడమే. ముస్లింల వివాహంలో ఒకవైపునుంచి వివాహం గురించి ప్రతిపాదన రావడం, రెండవ వైపునుంచి ఆ ప్రతిపాదనను ఆమోదించడం వుంటుంది. దీనే్న ‘ఇజాబ్! వా ఖుబూల్’ అంటారు.
ఈ వివాహ ప్రతిపాదన దాని ఆమోదం ఒక్కొక్క సమావేశంలో జరగాలి.
ఈ ప్రతిపాదన, ఆమోదాలకు ఎలాంటి నిర్ణీత పద్దతి లేదు.
ఈ ప్రతిపాదన ఆమోదాలు రాతపూర్వకంగా ఉండాలన్న నియమంలేదు.
సాక్షులు అవసరమా?
‘హనాఫీ’ శాఖ ప్రకారం ఈ వివాహం సాక్షుల సమక్షంలో జరగాలి. ఆ సాక్షులు ఇద్దరు మగవాళ్లుగాని, లేక ఒక మగవాడు ఇద్దరు ఆడవాళ్ళుగానీ అయి ఉండాలి. సాక్షుల సమక్షంలో వివాహం జరగనప్పుడు ఆ వివాహం సక్రమం కానప్పటికీ వారిద్దరి కలయికతో అది సక్రమం అయిపోతుంది. మిగతా శాఖల్లో జరిగే వివాహాలకి సాక్షుల సమక్షం అక్కరలేదు. ఈ వివాహం ఖ్వాజీల సమక్షంలో జరగాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వివాహానికి ఎలాంటి మతపరమైన ఉత్సవాలు అక్కరలేదు. ఈ వివాహాన్ని రిజిష్టరు చేయించవలసిన అవసరం లేదు.
ఇతరులని పెళ్లిచేసుకోవచ్చా?
ముస్లింలు ఇతరుల్ని వివాహం చేసుకోవడం గురించి వివిధ శాఖలకు సంబంధించి వివిధ రకాలుగా అభిప్రాయాలు వున్నాయి. సున్నీ ముస్లిం శాఖకు చెందిన పురుషుడు ముస్లిం చట్టాన్ని ప్రార్థించే (కీలాబియా) క్రిస్టియన్ మతస్థులను పెళ్ళిచేసుకోవచ్చు. హిందువులని సిక్కులని పెళ్లిచేసుకోవడానికి వీల్లేదు. సున్నీ మతానికి చెందిన స్ర్తి వేరే పురుషుణ్ణి వివాహమాడటానికి వీలులేదు. షియా శాఖకు చెందిన ముస్లిం ఇతర మత స్ర్తిలను శాశ్వత పద్ధతిలో పెళ్లిచేసుకోవడానికి వీలులేదు. వాళ్ళని తాత్కాలిక పద్ధతిలో పెళ్ళిచేసుకోవచ్చును. షియా ముస్లిం యువతి ఇతర పురుషులను ఏ పద్ధతిలో కూడా వివాహం చేసుకోవడానికి వీలులేదు. ఇతర శాఖలకు చెందిన ముస్లింలు ఒకరినొకరు పెళ్లిచేసుకోవచ్చు.
ఎంతమందిని వివాహమాడవచ్చు?
ముస్లిం మతానికి చెందిన పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. అయితే ఆ నలుగురు భార్యలను సమానంగా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ముస్లిం యువతి ఒకరికన్నా మించి వివాహం చేసుకోవడానికి వీల్లేదు.అయితే ఈ భాగ్యలలో ఏ ఇద్దరుకూడా చట్ట వ్యతిరేకమైన కలయిక అయి ఉండకూడదు.
చట్టవ్యతిరేకమైన కలయిక అంటే ఏమిటి?
ముస్లింలలో బహుభార్యాత్వం ఉన్నప్పటికీ, ఆ భార్యల మధ్య చట్టవ్యతిరేక కలయిక ఉండకూడదు. చట్టవ్యతిరేకమైన కలయిక నిషేధించబడినది. ఉదాహరణకు భార్యకు విడాకులు ఇవ్వకముందు ఆ భార్య చెల్లెల్ని పెళ్లిచేసుకోవడం నిషేధించబడింది.
వయఃపరిమితి
వనదశ మస్లిం యువతీ యువకులు స్థిరచిత్తం ఉన్నప్పుడు పెళ్లిచేసుకోవచ్చు.యవ్వన దశరాని ముస్లిం యువతీ యువకులు కూడా వారి గార్డియన్ల ద్వారా వివాహం చేసుకోవచ్చు. నెలకొన్న పరిస్థితులవల్ల యవ్వన దశవచ్చిన తరువాత వాళ్లు ఆ వివాహాన్ని నిరాకరించవచ్చు. బాల్య వివాహాల చట్టప్రకారం ఆడవాళ్లు 18 సంవత్సరాలు నిండకముందు, మగవాళ్లు 21 సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకోవడం నేరం. ఈ చట్టం ముస్లింలకు కూడా వర్తిస్తుంది. అయితే ఆ వివాహం చట్ట వ్యతిరేకంగా పరిగణించబడదు. అయితే ముస్లింలు రెండో వివాహం చేసుకోవడం భారతీయ శిక్షాస్మృతిలోని సె.194 ప్రకారం నేరంగా పరిగణించబడదు.
ఈ వివాహాలు ఎప్పుడు చెల్లకుండా పోతాయి?
ముస్లింల వివాహం చట్టంలో నిషేధించిన సంబంధాల మీద వివాహం చేసుకున్నపుడు అవి చెల్లకుండా పోతాయి.
అయితే అవి మూడు రకాలు-
చట్టబద్ధమైనవి
చెల్లనివి
నియమ విరుద్ధమైనవి.

తలాక్ అంటే ఏమిటి?

తలాక్ అంటే ఏమిటి?
-రాజేందర్
September 14th, 2010

తలాక్ అన్న పదం మనకు చిరపరిచితమైనదే. ముస్లింలలో భర్తలు భార్యలకి విడాకులు ఇవ్వడం అతి సులువైనది. అది ఏకపక్షమైనది.
మన దేశంలో ముస్లింలు విడాకులు ఇవ్వడానికి నాలుగు రకాల పద్ధతులు వున్నాయి. ఈ నాలుగు పద్ధతులలో చాలా ప్రాచుర్యం పొందినది ‘తలాక్’
నాలుగు రకాల పద్ధతులేమిటి?
తలాక్: న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఎలాంటి కారణం తెలియజేయకుండా ఏకపక్షంగా భర్త ఇచ్చే విడాకులు. దానే్న సాధారణ పరిభాషలో తలాక్ అంటున్నాం.
నిర్మాణాత్మక విడాకులు: న్యాయస్థానంతో సంబంధం లేకుండా భర్త ప్రేరణతో నిర్మాణాత్మకంగా ఇచ్చే విడాకులు.
పరస్పర అంగీకార విడాకులు: న్యాయస్థానంతో సంబంధం లేకుండా భార్యా భర్తలిద్దరు పరస్పర అంగీకారంతో ముస్లింల వివాహాల రద్దు పరిచే చట్టం 1939 ఫ్రకారం తీసుకునే విడాకులు.
చట్టప్రకారం: ముస్లిం వివాహాల రద్దు పరిచే చట్టంలో పేర్కొన్న ఆధారాలు ప్రకారం ముస్లిం స్ర్తిలు తీసుకునే విడాకులు.
మొదట పేర్కొన్నవిడాకులనే తలాక్ అంటున్నాం. రెండవ రకం విడాకులు కొన్ని నీతి నియమాల ప్రకారం భర్త తీసుకునే విడాకులు. మూడవ రకం విడాకులు సనాతనంగా ముస్లింల చట్టంలో వున్నటువంటివి. నాలుగవ రకం పద్ధతి మాత్రమే న్యాయపరంగా వున్న విడాకులు. ఇది ముస్లిం వివాహ చట్టంలో పొందుపరచబడినది. ఈ చట్ట ప్రకారం ముస్లిం స్ర్తిలు విడాకులు తీసుకునే అవకాశం కల్పించబడింది. ఈ పద్ధతి ప్రకారం స్ర్తిలు మాత్రమే విడాకులు తీసుకోవడానికి వీలుంటుంది.
తలాక్ అంటే?
యుక్త వయస్కుడై స్థిరచిత్తం కలిగిన ఓ ముస్లిం పురుషుడైన ఎలాంటి కారణం చెప్పకుండా ఏకపక్షంగా తన భార్యకు విడాకులు ఇచ్చే పద్ధతిని తలాక్ అంటున్నాం. ముస్లిం పురుషులు ఏకపక్షంగా తమ భార్యలకు విడాకులు ఇచ్చే పద్ధతినే తలాక్ అంటున్నాం.
సున్నీ చట్ట ప్రకారం తలాక్ వౌఖికంగా వుండవచ్చు. రాతపూర్వకంగా వుండవచ్చు. షియా చట్ట ప్రకారం సమర్ధులైన ఇద్దరు సాక్ష్యుల సమక్షంలో తలాక్ ప్రకటన వౌఖికంగా వుండాలి. అసాధారణ పరిస్థితుల్లో అంటే భర్త వౌఖికంగా ఈ ప్రకటన చేసే వీలు లేనప్పుడు రాతపూర్వకంగా కూడా చేయవచ్చు.
తలాక్ ప్రకటించడానికి పద్ధతులేమిటి?
తలాక్ ప్రకటనని రెండు విధాలుగా ప్రకటించవచ్చు. మొదటిది ఆమోదించిన పద్ధతి. రెండవది ఆమోదించని పద్ధతి
ఆమోదించిన పద్ధతిలో మళ్లీ రెండు రకాల పద్ధతులున్నాయి.
అవి-
-సాధారణ పద్ధతి (అహసన్)
-అసాధారణ పద్ధతి (హసన్)
అసాధారణ పద్ధతిలో మళ్లీ ఎన్నో రకాలైన పద్ధతులున్నాయి. ఆమోదించిన పద్ధతి ప్రకారం భర్త తన భార్యకి విడాకులు ఇవ్వచ్చుననే మామూలు ప్రకటన సరిపోతుంది. తన ఉద్దేశాన్ని తెలియజేస్తే చాలు. ఆ ఉద్దేశాన్ని ఈ పద్ధతుల్లో తెలియజేయాల్సి వుంటుంది.
* తన భార్యకి విడాకులు ఇచ్చానన్న ప్రకటన భార్య ‘తుహ్రూ’ కాలంలో తెలియజేయాలి. ‘తుహ్రూ’ కాలం అంటే రెండు రుతుస్రావాల మధ్యకాలం. ‘ఇద్దక్’ కాలం అయిపోయే వరకు శారీరకంగా దూరంగా వుండాలి. ఈ ‘ఇద్దక్’ కాలం అయిపోయిన తరువాత విడాకులు ఫలవంతమవుతుంది. దాన్ని రద్దు పరచడానికి వీలుండదు. దీనే్న ‘అహసన్’ పద్ధతి అంటారు.
* వరసగా మూడు తుహ్రూ కాలంలో ఈ ప్రకటన చేసి వుండాలి. ఈ మూడు తుహ్రూ కాలాలలో శారీరకంగా దూరంగా వుండాలి. మూడవ ప్రకటనతో ఈ విడాకులు పూర్తవుతుంది. ఆ తరువాత దీన్ని రద్దు పరచడానికి వీలుండదు. దీనే్న ’హసన్’ పద్ధతి అంటారు.
* తుహ్రూ కాలంలో నేను విడాకులు ఇస్తున్నానని మూడుసార్లు ఒకేసారి ప్రకటించితే విడాకులు పూర్తి అవుతుంది. ఈ విధంగా కాకుండా ఒక తుహ్రూ కాలంలో మూడుసార్లు వేరువేరుగా ఈ ప్రకటన చేసినప్పుడు తలాక్ పూర్తవుతుంది.
* రద్దుపరిచే వీలు లేకుండా నీకు విడాకులు ఇస్తున్నాను అని ఒకేసారి ప్రకటించినప్పటికీ అది ఫలవంతమైన రద్దు పరచలేని విడాకులుగానే ముస్లింలు చట్టం పరిగణిస్తుంది.
తలాక్ గురించి మరికొన్ని విషయాలు
- భార్య విషయలో కూడా తలాక్ ప్రకటన భర్త చేయవచ్చు. అయితే విడాకులు ఇచ్చే ఉద్దేశ్యం స్పష్టంగా వుండాలి.
- భర్తకు భార్య తలాక్ పద్ధతిలో విడాకులు ఇవ్వడానికి వీల్లేదు.
- తలాక్ ఇచ్చే అధికారాన్ని భర్త ఇతరులకి కూడా సంక్రమింపచేయవచ్చు. అలా ఇచ్చినప్పుడు కూడా అవి సక్రమమైన తలాక్ అవుతుంది. తలాక్ ఇచ్చే అధికారాన్ని భర్త తన భార్యకు సంక్రమింపచేయవచ్చు.
- భవిష్యత్తులో జరగబోయే సంఘటనను దృష్టిలో పెట్టుకుని కూడా తలాక్ ప్రకటనని భర్తీ చేయవచ్

ముస్లింల వివాహాలు - చట్టబద్ధత

ముస్లింల వివాహాలు - చట్టబద్ధత
August 31st, 2010

భారతదేశంలో ముస్లింల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టాన్ని ‘ముస్లిం లా’ అంటున్నాం. ఈ చట్టానికి ప్రధాన ఆధారం ఇస్లామిక్ చట్టంలోని పవిత్ర భాగాలు, దానితో పాటు ఆచార వ్యవహారాలు కోర్టు తీర్పులు ముస్లింల వ్యక్తిగత చట్టం క్రమబద్ధం కాలేదు. ముస్లింల వ్యక్తిగత చట్టాన్ని వివిధ రకాలైన శాఖలు వివిధ రకాలుగా వ్యాఖ్యానించాయి. భారతదేశంలోని ముస్లింలు ఎక్కువగా ‘హనాఫీ’ శాఖను అనుసరిస్తున్నారు. సున్నీ తరగతికి చెందిన ముస్లింలలో నాలుగు ఉపతరగతులున్నప్పటికీ వీళ్ళందరూ హనాఫీ శాఖలో వున్న వ్యక్తిగతమైన చట్టాన్ని అవలంభిస్తున్నారు. షియా తరగతికి చెందిన ముస్లింలు ‘ఇత్నా అఫారీ’ శాఖలో పేర్కొన్న చట్టాన్ని అవలంభిస్తున్నారు. ముస్లింల వ్యక్తిగత చట్టం క్రమబద్దీకరించబడలేదు. అందుకని ఈ చట్టంలోని నిబంధనలు అన్నీ పవిత్రమైన మత చట్టాలనుంచి తీసుకోవడం జరిగింది. మస్లింల వ్యక్తిగత చట్టంలో వారి వైవాహిక జీవితానికి సంబంధించి ఒకే ఒక చట్టం క్రమబద్దీకరించడం జరిగింది. అదే ముస్లింల వివాహాల రద్దుపరచే చట్టం (1939).ప్రతి ప్రాంతానికి సంబంధించి వివిధ రకాలైన ప్రత్యేకమైన నిబంధనలేమీ లేవు. అయితే ఆయా ప్రాంతాలలోని హైకోర్టు వ్యాఖ్యానించిన పద్ధతినే ఆయా ప్రాంతాలలో పాటిస్తున్నారు. ఎక్కడైతే సుప్రీంకోర్టు వివరంగా వ్యాఖ్యానించిందో ఆ విషయాలు అన్ని ప్రాంతాలకి వర్తిస్తాయి.ముస్లిం చట్టం భారతదేశంలోని ప్రతి ముస్లింకీ వర్తిస్తుంది. భగవంతుడొక్కడే ఉన్నాడని, మహమ్మద్ అతను ప్రవక్త అని నమ్మే వ్యక్తులందరూ ముస్లింలే!
ముస్లింల వివాహంలోని ముఖ్యాంశాలు
ముస్లింల వివాహం ఒక సివిల్ కాంట్రాక్టు వంటిది. దాని ప్రధానోద్దేశం పిల్లలకు జన్మనివ్వడమే. ముస్లింల వివాహంలో ఒకవైపునుంచి వివాహం గురించి ప్రతిపాదన రావడం, రెండవ వైపునుంచి ఆ ప్రతిపాదనను ఆమోదించడం వుంటుంది. దీనే్న ‘ఇజాబ్! వా ఖుబూల్’ అంటారు.
ఈ వివాహ ప్రతిపాదన దాని ఆమోదం ఒక్కొక్క సమావేశంలో జరగాలి.
ఈ ప్రతిపాదన, ఆమోదాలకు ఎలాంటి నిర్ణీత పద్దతి లేదు.
ఈ ప్రతిపాదన ఆమోదాలు రాతపూర్వకంగా ఉండాలన్న నియమంలేదు.
సాక్షులు అవసరమా?
‘హనాఫీ’ శాఖ ప్రకారం ఈ వివాహం సాక్షుల సమక్షంలో జరగాలి. ఆ సాక్షులు ఇద్దరు మగవాళ్లుగాని, లేక ఒక మగవాడు ఇద్దరు ఆడవాళ్ళుగానీ అయి ఉండాలి. సాక్షుల సమక్షంలో వివాహం జరగనప్పుడు ఆ వివాహం సక్రమం కానప్పటికీ వారిద్దరి కలయికతో అది సక్రమం అయిపోతుంది. మిగతా శాఖల్లో జరిగే వివాహాలకి సాక్షుల సమక్షం అక్కరలేదు. ఈ వివాహం ఖ్వాజీల సమక్షంలో జరగాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వివాహానికి ఎలాంటి మతపరమైన ఉత్సవాలు అక్కరలేదు. ఈ వివాహాన్ని రిజిష్టరు చేయించవలసిన అవసరం లేదు.
ఇతరులని పెళ్లిచేసుకోవచ్చా?
ముస్లింలు ఇతరుల్ని వివాహం చేసుకోవడం గురించి వివిధ శాఖలకు సంబంధించి వివిధ రకాలుగా అభిప్రాయాలు వున్నాయి. సున్నీ ముస్లిం శాఖకు చెందిన పురుషుడు ముస్లిం చట్టాన్ని ప్రార్థించే (కీలాబియా) క్రిస్టియన్ మతస్థులను పెళ్ళిచేసుకోవచ్చు. హిందువులని సిక్కులని పెళ్లిచేసుకోవడానికి వీల్లేదు. సున్నీ మతానికి చెందిన స్ర్తి వేరే పురుషుణ్ణి వివాహమాడటానికి వీలులేదు. షియా శాఖకు చెందిన ముస్లిం ఇతర మత స్ర్తిలను శాశ్వత పద్ధతిలో పెళ్లిచేసుకోవడానికి వీలులేదు. వాళ్ళని తాత్కాలిక పద్ధతిలో పెళ్ళిచేసుకోవచ్చును. షియా ముస్లిం యువతి ఇతర పురుషులను ఏ పద్ధతిలో కూడా వివాహం చేసుకోవడానికి వీలులేదు. ఇతర శాఖలకు చెందిన ముస్లింలు ఒకరినొకరు పెళ్లిచేసుకోవచ్చు.
ఎంతమందిని వివాహమాడవచ్చు?
ముస్లిం మతానికి చెందిన పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. అయితే ఆ నలుగురు భార్యలను సమానంగా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ముస్లిం యువతి ఒకరికన్నా మించి వివాహం చేసుకోవడానికి వీల్లేదు.అయితే ఈ భాగ్యలలో ఏ ఇద్దరుకూడా చట్ట వ్యతిరేకమైన కలయిక అయి ఉండకూడదు.
చట్టవ్యతిరేకమైన కలయిక అంటే ఏమిటి?
ముస్లింలలో బహుభార్యాత్వం ఉన్నప్పటికీ, ఆ భార్యల మధ్య చట్టవ్యతిరేక కలయిక ఉండకూడదు. చట్టవ్యతిరేకమైన కలయిక నిషేధించబడినది. ఉదాహరణకు భార్యకు విడాకులు ఇవ్వకముందు ఆ భార్య చెల్లెల్ని పెళ్లిచేసుకోవడం నిషేధించబడింది.
వయఃపరిమితి
వనదశ మస్లిం యువతీ యువకులు స్థిరచిత్తం ఉన్నప్పుడు పెళ్లిచేసుకోవచ్చు.యవ్వన దశరాని ముస్లిం యువతీ యువకులు కూడా వారి గార్డియన్ల ద్వారా వివాహం చేసుకోవచ్చు. నెలకొన్న పరిస్థితులవల్ల యవ్వన దశవచ్చిన తరువాత వాళ్లు ఆ వివాహాన్ని నిరాకరించవచ్చు. బాల్య వివాహాల చట్టప్రకారం ఆడవాళ్లు 18 సంవత్సరాలు నిండకముందు, మగవాళ్లు 21 సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకోవడం నేరం. ఈ చట్టం ముస్లింలకు కూడా వర్తిస్తుంది. అయితే ఆ వివాహం చట్ట వ్యతిరేకంగా పరిగణించబడదు. అయితే ముస్లింలు రెండో వివాహం చేసుకోవడం భారతీయ శిక్షాస్మృతిలోని సె.194 ప్రకారం నేరంగా పరిగణించబడదు.
ఈ వివాహాలు ఎప్పుడు చెల్లకుండా పోతాయి?
ముస్లింల వివాహం చట్టంలో నిషేధించిన సంబంధాల మీద వివాహం చేసుకున్నపుడు అవి చెల్లకుండా పోతాయి.
అయితే అవి మూడు రకాలు-
చట్టబద్ధమైనవి
చెల్లనివి
నియమ విరుద

మోసపోయిన వ్యక్తి వివాహన్ని రద్దు చేసుకోవచ్చు

మోసపోయిన వ్యక్తి వివాహన్ని రద్దు చేసుకోవచ్చు
August 24th, 2010

దంపతుల్లో ఎవరైనా తమకు సంబంధించిన ముఖ్య విషయాలు చెప్పకుండా ఎవరైనా వివాహం చేసుకుంటే ఆ విధంగా మోసపోయిన వ్యక్తి ఆ వివాహం రద్దు చేయమని కోరే అవకాశం వుంది. హిందూ వివాహ చట్టంలోని సె.12(సి) ప్రకారం దరఖాస్తుని దాఖలు చేయవచ్చు.
ఆ నిబంధన ఈ విధంగా చెబుతుంది- ప్రతివాదికి సంబంధించిన ముఖ్య విషయాలను కప్పిపుచ్చి వాది సమ్మతిని పొందినప్పుడు, అదేవిధంగా- బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి రాకపూర్వం జరిగిన వివాహాల్లో వాది మైనరైనప్పుడు సంరక్షకుని సమ్మతిని బలప్రయోగం ద్వారా, మోసం ద్వారా పొందినప్పుడు వాది ఆ వివాహం రద్దు చేయమని కోర్టులో దరఖాస్తు దాఖలు చేయవచ్చు.
***
సంవత్సరంలోగా పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టులు పరిశీలిస్తాయి. ఆ తరువాత దాఖలు చేసిన పిటిషన్లని బలప్రయోగం తొలగిపోయిన తర్వాత, మోసం తెలిసిన తరువాత వాది ప్రతివాదితో పూర్తి సమ్మతితో కాపురం చేసినప్పుడే కోర్టులు ఆ వివాహాన్ని రద్దు పరచవు.
ఈ నేపధ్యంలో- గుల్లపల్లి సౌర్యరాజ్ వర్సెస్ బండారు పావనిని అలియాస్ గుల్లపల్లి పావని, ఎఐఆర్ 2009 సుప్రీంకోర్టు 1085 కేసుని చూద్దాం.
తన సాంఘిక హోదా అంటే మతం ఏమిటో తెలియజేయకుండా ఎవరైనా హిందువులని హిం దూ పద్ధతుల ప్రకా రం చేసుకున్నప్పటికీ ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? ప్రతివాదికి తనకు సంబంధించిన ము ఖ్యవిషయం మరుగుపరిచి వివాహం చేసుకున్నట్టుగా వాది భావించి వివాహాన్ని రద్దు చేయమని కోరే అవకాశం ఉంటుందా?
దీనికి సమాధానం తెలుసుకోవాలంటే గుల్లపల్లి సౌవురియారాజ్ వర్సెస్ బండారు పావని ఎలియాస్ గుల్లపల్లి పావని (ఎఐఆర్ 2009 సుప్రీంకోర్టు 1085)లోని విషయాలను పరిశీలించాలి.
సౌవర్యారాజ్ రోమన్ కాథలిక్. అతను పావనని 24-10-1996 రోజున హిందువుల ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహంలో అతను ఆమెకు తాళి కట్టాడు. ఇరుపక్షాల బంధువులు తల్లిదండ్రులు ఎవరూ ఆ వివాహానికి హాజరు కాలేదు.ఆ తర్వాత 2-11-1996రోజున ఆ వివాహాన్ని హిందూ వివాహాల చట్టం, 1955లోని సె.8 ప్రకారం రిజిస్టర్ కూడా చేయించారు.
తేదీ 13-3-1997 రోజున ప్రతివాది (్భర్య) విశాఖ పట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు దాఖలు చేసి వివాహాన్ని రద్దు చేయమనికోరింది. వాదికి (సౌర్యరాజ్)కి సంబంధించిన ముఖ్య విషయాలు మరుగుపరిచినాడని అందుకని తమ వివాహాన్ని హిందూ వివాహ చట్టంలోని సె.12(1)(సి) ప్రకారం రద్దు చేయాలని ఆమె కోరింది. ఆమె దరఖాస్తుని కుటుంబ న్యాయస్థానం కొట్టివేసింది. ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది.
అప్పీలుని విచారించిన హైకోర్టు, ఆమె దాఖలు చేసిన అప్పీలుని ఆమోదించింది. హిందువుకి, క్రిస్టియన్‌కి జరిగిన వివాహం ప్రాధమికంగానే హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని పేర్కొంటూ వారి వివాహాన్ని 12-9-2002 రోజున రద్దు చేసింది.
ఆ తరువాత పావని డాక్టర్ ప్రవీణ్‌ని 23-1-2003రోజున వివాహం చేసుకుంది. హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సౌర్యరాజ్ 23-4-2003 రోజున స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేసాడు. సుప్రీంకోర్టు దాన్ని సివిల్ అప్పీలు నెం.2446/2005గా స్వీకరించి విచారించింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశం
సౌర్యరాజ్ రోమన్ కాథొలిక్. పావని హిందువు. వారి వివాహం హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగింది. ఆ తరువాత వారి వివాహం సె.8 ప్రకారం రిజిస్టర్ అయింది. అయినా కూడా అది చెల్లదు. అందుకని వారి వివాహాన్ని హైకోర్టు రద్దు చేయడం సమంజసమే. అందులో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. వీరి వివాహం చెల్లనప్పుడు పావని తిరిగి వివాహం చేసుకున్నప్పటికీ దానికి విలువలేదు. అందుకని ఆమె రెండవ వివాహం గురించి ఏమీ చెప్పలేం. దాఖలు చేసిన అప

రెండవ వివాహం - దాని పరిణామాలు

రెండవ వివాహం - దాని పరిణామాలు
లా ఇలా
August 17th, 2010

సె.494 ఐ.పి.సి ప్రకారం భార్యగానీ, భర్తగానీ బ్రతికి ఉండగా రెండో వివాహం చేసుకుంటే అది చట్టరీత్యా చెల్లనపుడు శిక్షార్హులౌతారు. వాళ్ళకు ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఇదివరకే వివాహం అయిందన్న విషయాన్ని మరుగుపరచి రెండో వివాహం చేసుకున్న వ్యక్తులను సె.495 ఐ.పి.సి ప్రకారం పది సంవత్సరాలు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.
ఈ నేరం ఋజువుకావాలంటే ఏ అంశాలని నిరూపించాల్సి ఉంటుంది?
ఈ నేరం ఋజువుకావాలంటే ప్రాసిక్యూషన్ ఈ నాలుగు షరతులను నిరూపించాల్సి ఉంటుంది. అవి-
1.మొదటి వివాహం సక్రమమైనదై వుండి, హిందూ వివాహ చట్టప్రకారం జరిగిందై వుండాలి.
2.ఆ వివాహం పార్టీల ఆచార వ్యవహారాల ప్రకారం ఉత్సవాల ప్రకారం జరిగి ఉండాలి.
3.ఆ వివాహంలోని దంపతులిద్దరూ హిందువులై వుండాలి.
4.రెండో వివాహం జరిగిన రోజున దంపతుల్లో ఎవరికైనా జీవించి వున్న భార్యగానీ భర్తగానీ ఉండి వుండాలి.
రెండో వివాహం ఎపుడు చెల్లదు?
రెండో వివాహం ఈ క్రింది రెండు అంశాలున్నప్పుడు చెల్లదు. ఆ అంశాలు-
* ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత అంటే మే 1955 తరువాత రెండో వివాహం జరిగి వుండాలి.
* ఆ వివాహ సమయంలో వివాహం చేసుకున్న పార్టీలలో ఎవరికైనా జీవించి వున్న భార్యగానీ భర్తగానీ వుండి వుండాలి.
శాస్త్రోక్తంగా వివాహం జరిగి వుండాలంటే...
ఈ నిబంధన వర్తించాలంటే పార్టీల మధ్య శాస్త్రోక్తంగా వివాహం జరిగి వుండాలి. శాస్త్రోక్తంగా వివాహం జరగడమనేది పార్టీల ఆచార వ్యవహారాలను బట్టి వుంటుంది.
హోమము, సప్తపది లేకుండా తాళికట్టినంత మాత్రాన అది శాస్త్రోక్తంగా వివాహం జరిగినట్టు కాదని కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. అయితే తెలంగాణలోని కొన్ని కులాల, ఆచారాల ప్రకారం హోమము, సప్తపది అవసరం లేదు. కానీ తాళికట్టడం, కంకణం కట్టుకోవడం వివాహంలో తప్పనిసరి.
వివాహానికి అవసరమైన ఉత్సవాలు, కార్యకలాపాలు రెండో వివాహానికి జరిగినట్లు రుజువైతేతప్ప ముద్దాయిలను శిక్షించడానికి వీల్లేదు. భార్య ఉండగా రెండో వివాహాన్ని భర్త చేసుకున్నప్పుడు, ఆ వివాహం చెల్లదు. గనుక రెండవ భార్య మళ్లీ ఇతరుల్ని వివాహం చేసుకున్నపుడు ఆమెను శిక్షించడానికి వీల్లేదు.
సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ప్రత్యేక ఉపశమనం చట్టం క్రింద రెండో వివాహాన్ని ఆపడానికి ఇంజెక్షన్ తీసుకోవడానికి ఈ చట్టం ఏ విధమైన ఆటంకం కల్పించడం లేదని అలా తీసుకోవడంవల్ల భవిష్యత్తులో పరిమాణాలని నిలుపుదల చేయవచ్చని పార్టీలు ఆ నిబంధన ప్రకారం, రెండో వివాహం చెల్లదని ప్రకటించేసేసి కోర్టులో దావావేయాల్సిన అవసరం వుండదని అందుకని కోర్టులో రెండో వివాహాలను నిలుపుదల చేయడానికి ఇంజెక్షన్ ఇవ్వడం సరైందని వివిధ హైకోర్టులు అభిప్రాయపడుతున్నాయి.
వివాహ షరతులు ఉల్లంఘిస్తే నేరమా? (సె.18)
కొన్ని వివాహ షరతులు ఉల్లంఘిస్తే వివిధ చట్టాల ప్రకారం నేరాలవుతాయి. భార్యగానీ, భర్తగానీ బ్రతికి వుండగా రెండో వివాహం చేసుకుంటే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరమవుతుంది. అలాగే బాల్య వివాహాలు, బాల్య వివాహాల నిరోధక చట్ట ప్రకారం నేరమవుతాయి. వివాహ సమయంలో వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు, వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినపుడు ఆచార వ్యవహారాలు అనుమతించనపుడు, నిషేధింపబడిన బంధుత్వాల మధ్య వివాహం చేసుకున్నా సపిండుల మధ్య వివాహం చేసుకున్నా హిందూ వివాహ చట్టప్రకారం నేరాలుగా పరిగణింపబడతాయి.
వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు, వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా వివాహం చేసుకున్న వ్యక్తులకి పదిహేను రోజుల వరకు సాధారణ జైలుశిక్షగానీ వెయ్యి రూపాయల వరకు జరిమానాగానీ లేక ఈ రెండింటినిగానీ కోర్టులు విధిస్తాయి. వధూవరులిద్దరికి మాత్రమే ఈ శిక్షలు విధిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ చట్టప్రకారం శిక్షార్హులు కాదు. వధూవరులిద్దరిలో ఎవరి ప్రోద్బలంతోనైతే వివాహం జరిగిందో వాళ్ళే శిక్షార్హులవుతారు. వధూవరులిద్దరు పైన చెప్పిన వయస్సుకన్నా తక్కువగా ఉన్నపుడు వివాహం జరిగినపుడు ఇద్దరికి శిక్ష విధించడం సాధ్యంకాదు. ఎందుకంటె అంతకన్నా వయస్సు తక్కువ ఉన్నపుడు వారి ప్రోద్బలం వున్నట్టుగా చట్టం భావించదు. ఇది ఆ చట్టంలో ఉన్న లోపం. అయితే ఇలాంటి వివాహాలు చేసుకున్న వరుడు బాల్య వివాహాల నిరోధక చట్ట ప్రకారం శిక్షార్హుడవుతాడు. అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకున్నట్టయితే, అతనికి పదిహేను రోజుల వరకు జైలుశిక్షగానీ జరిమానా గానీ లేక రెండూ గానీ విధించవచ్చు. ఒకవేళ వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకున్నట్టయితే అతనికి మూడు నెలలవరకు సాధారణ జైలుశిక్షగానీ జరిమానా గానీ కోర్టులు విధిస్తాయి. వరుడే కాకుండా ఈ వివాహాలని ప్రోత్సహించిన వ్యక్తులు కూడా శిక్షార్హులవుతారు.
ఆచార వ్యవహారాలు ఆమోదించినపుడు నిషేధించబడిన బంధుత్వాల మధ్య సపిండుల మధ్య వివాహాలు చేసుకున్న వ్యక్తులకి హిందూ వివాహాల చట్టప్రకారం నెల రోజులవరకు జైలు శిక్షగానీ వెయ్యి రూపాయల వరకు జరిమానాగాని రెండూగానీ విధించవచ్చు. *

*
*
*

కుటుంబ న్యాయస్థానంలో విచారణ పద్ధతి

కుటుంబ న్యాయస్థానంలో విచారణ పద్ధతి
- రాజేందర్
September 21st, 2010

రోజురోజుకీ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగి పోతున్నాయి. పెళ్ళైన సంవత్సరంలోపే విడాకుల కోసం కోర్టులకి వస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. స్ర్తిలకి ఆర్థిక స్వాతంత్య్రం రావడమే దీనికి ప్రధాన కారణమన్న అపవాదు కూడా వుంది. కుటుంబంలో తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం కుటుంబ న్యాయస్థానాలని ఏర్పాటుచేసింది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం ఈ న్యాయస్థానాల ప్రధాన ఉద్దేశం. మన సమాజంలో కుటుంబానికి అత్యంత విలువ వుంది. అందుకని కుటుంబ జీవితాన్ని పరిరక్షించడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వాసం, నమ్మకం పెంచి కుటుంబ జీవితాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబంలో ఏదైనా వివాదం తలెత్తి కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వాసం సన్నగిల్లితే చట్టాన్ని ఉపయోగించుకోవాల్సి వుంటుంది. దీనికి అవసరమైన న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. సమాజంలో వున్న విలువలని కాపాడుతూ ఈ న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి.

కుటుంబ వివాదాలు పరిష్కారంవల్ల ఆ వివాదానికి పార్టీల వ్యక్తుల జీవితమే కాకుండా మొత్తం కుటుంబంలోని వ్యక్తుల జీవితాలని అది ప్రభావితం చేస్తుంది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చే తీర్పువల్ల సుదూర జీవితంలో కూడా ప్రభావితం వుంటుంది. ఉదాహరణకి- ఏదైనా నడవడిక క్రూరత్వం కాదని కోర్టు ప్రకటిస్తే, అలాంటి నడవడికని ఆ దంపతుల్లోని వ్యక్తి ఇంకా ఎక్కువ చేసే అవకాశం వుంది. వాళ్ళని ప్రోత్సహించినట్టుగా కూడా వుంటుంది- ఏదైనా నడవడిక అనేది క్రూరత్వం అవుతుందని కోర్టు ప్రకటిస్తే కుటుంబంలో ఒత్తిడి, సంఘర్షణ పెరుగుతుంది.

ఈ విషయాలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ వివాదాలని పరిష్కరించడానికి ఓ యంత్రాంగం అవసరమని శాసనకర్తలు భావించి కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
కుటుంబ వివాదాల పరిష్కారానికి కూడా ఈ చట్టంలో కొత్త పద్ధతులని ఏర్పాటుచేశారు. సాధారణ కోర్టులో వుండే పద్ధతికి భిన్నంగా ఈ కోర్టులు పనిచేసే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. పార్టీలకి న్యాయాన్ని అందించడానికి వీలుగా ఈ కోర్టులు తమ పద్ధతులని ఏర్పాటుచేసుకునే అవకాశం ఈ చట్టం కల్పించింది.

ఏ నిబంధన కొత్త పద్ధతిని ఏర్పాటు చేస్తున్నాయి?

కుటుంబ న్యాయస్థానాలు మామూలు కోర్టులకి భిన్నంగా పనిచేయాలి. పార్టీలకు సత్వర న్యాయాన్ని అందించాలి. అందుకని తమకు తోచిన పద్ధతిని ఏర్పాటుచేసుకోవడానికి ఈ చట్టంలో వున్న కొన్ని నిబంధనలు అవకాశం కల్పిస్తాయి. ఆ నిబంధనలు సె.10(3), సె.14, సె.15.
* సె.10 (3)- తమ ముందు విచారణలో వున్న ఏదైనా దావాని, ప్రొసీడింగ్స్‌ని లేదా ఏవైనా విషయాలని ఒక పార్టీ ఆరోపించి మరో పార్టీ ఖండించినప్పుడు వాటిని పరిష్కరించడానికి అవసరమైన స్వంత పద్ధతిని అవలంబించడానికి కుటుంబ న్యాయస్థానానికి ఎలాంటి ఆటంకం లేదు.
* సె.14- భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 ప్రకారం ఆమోదయోగ్యం కాని లేదా సంబంధితం కాని డాక్యుమెంట్లని, నివేదికలను, స్టేట్‌మెంట్లను కూడా సాక్ష్యంగా కుటుంబ న్యాయస్థానం స్వీకరించవచ్చు. అయితే అవి వివాదాన్ని సమర్థవంతంగా పరిష్కరించడానికి ఉపయోగపడాలి.
* సె.15- కుటుంబ న్యాయస్థానాల్లో విచారణలో వున్న దావాలని లేదా ప్రొసీజింగ్స్‌ని పరిష్కరించే క్రమంలో సాక్ష్యాలని సుదీర్ఘంగా నమోదు చేయాల్సిన అవసరం లేదు. సాక్షుల సాక్ష్యంలోని సారాంశాన్ని నమోదు చేసి సాక్షుల సంతకం తీసుకొని న్యాయమూర్తి సంతకం చేస్తే సరిపోతుంది.

వివాదాలు పరిష్కారానికి అవసరమైన పద్ధతులని ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. అయితే న్యాయవాదులు కోర్టుల ముందు హాజరుకావడానికి ఈ చట్టం నిరోధిస్తుంది. న్యాయవాదులు కుటుంబ న్యాయస్థానాలముందు హాజరుకావాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. అనుమతి తీసుకున్నప్పటికీ వాళ్ళు కోర్టు సహాయకులుగా మాత్రమే వ్యవహరించాలి తప్ప మామూలు కేసుల్లో మాదిరిగా తమ పార్టీల పక్షం వహించకూడదు.

మన దేశం బ్రిటీష్ వాళ్ళ అడ్వర్సరల్ సిస్టమ్‌ని పాటిస్తుంది. ఈ సిస్టమ్‌లో న్యాయమూర్తులు అంపైర్‌ల మాదిరిగా వుండాలి. క్రియాత్మకంగా వ్యవహరించకూడదు. తమ దగ్గరికి వచ్చిన సాక్ష్యాలని ఆధారం చేసుకొని తీర్పులని వెలువరించాల్సి వుంటుంది. అందువల్ల కొన్ని ఇబ్బందులు వున్నాయి. చట్టం వెసులుబాటు కల్పించినప్పటికీ ఈ పరిమితుల్లో పనిచేయాల్సిన పరిస్

పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిదే

పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిదే
September 29th, 2010

దత్తత గురించి వివాదం తలెత్తినపుడు ఆ పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిపై ఉంటుందా లేక దత్తత తల్లిదండ్రులపై ఉంటుం దా? ఈ ప్రశ్నకి సమాధానాన్ని సుప్రీంకోర్టు రాజీవ్ భాటియా వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం మరి ఇతరులు (ఎ.ఐ.ఆర్.1999 సుప్రీంకోర్టు (3284) కేసులో చెప్పింది.
కేసు విషయాలు
తన కుమారుడు తన భర్త అన్న దగ్గర అక్రమ సంరక్షణలో ఉన్నాడని ఆ పిల్లవాడి స్వంత తల్లి రాజస్థాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ని దాఖలు చేసింది. రాజీవ్ భాటియా ఆ రిట్ పిటిషన్‌కి జవాబును దాఖలు చేశాడు. ఆ పిల్లవాడు స్వంత తల్లిదండ్రుల చేత తనకు దత్తత ఇవ్వబడినాడని జవాబులో పేర్కొన్నాడు. ఇరుపక్షాలవాదన విన్న తరువాత ఆ పిల్లవాడిని న్యాయమూర్తుల ఛాంబర్స్‌లో ప్రవేశపెట్టారు. ఆ పిల్లవాడిని న్యాయ మూర్తులు ప్రశ్నించారు. తాను స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నానన్న అభిప్రాయాన్ని ఆ పిల్లవాడు జడ్జిలకు కలుగజేశాడు. ఆ పిల్లవాడు దత్తత తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు ఆ పిల్లవాడు స్వంత తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలని ఆదేశించారు. దత్తత పత్రము సరియైనదే కాదా అన్న విషయం సివిల్ కోర్టులో తేలేదాకా ఆ పిల్లవాడు స్వంత తల్లి దగ్గరే ఉండాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశానికి వ్యతిరేకంగా రాజీవ్ భాటియా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆ పిల్లవాడిని పరీక్షించి మాట్లాడి తన తీర్పుని ప్రకటించింది. దత్తత పత్రము చెల్లుబాటు సివిల్ కోర్టులో తేలేవరకు ఆ పిల్లవాడు స్వంత తల్లిదగ్గరే ఉండటం సమంజసమని సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశము
రాజస్థాన్ హైకోర్టు ఈ కేసులో జారీచేసిన ఉత్తర్వులు సరైనవేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి వచ్చేముందు మేము ఇరుపక్షాల వాదనలని విన్నాము. వారి ఆరోపణలని ప్రత్యారోపణలని కూడా పరిగణనలోకి తీసుకొని వాటిలోని నిజానిజాలను తెలుసుకోవడానికి ఆ పిల్లవాడిని మా ఛాంబర్‌లో హాజరుపరచమని ఆ పిల్లవాడి స్వంత తల్లిని ఆదేశించాము. మా ఆదేశాలకు అనుగుణంగా ఆ పిల్లవాడిని మా ఛాంబర్‌లో ఆ తల్లి ప్రవేశపెట్టింది. ఆ పిల్లవాడు చాలా చిన్నపిల్లవాడు. అతను ఎలాంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చలేకపోయాడు కాని మా ప్రశ్నలకు అతని సమాధానాలని పరిశీలించిన అనంతరం అతడు స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నాడని అర్థవౌతుంది. అంతేకాదు దత్తత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లటానికి ఇష్టపడటంలేదన్న విషయం కూడా అర్థం అవుతుంది. దత్తత తల్లిదండ్రులు మా ఛాంబర్‌లో అతనితో మాట్లాడడానికి ప్రయత్నించినపుడు ఈ విషయం స్పష్టమైంది. అతను వాళ్ళతో మాట్లాడకపోవడమే కాకుండా వాళ్ళు కనిపించగానే ఏడ్వడం మొదలుపెట్టాడు. రాజీవ్ భాటియా న్యాయవాది గోబర్థన్ ఈ విషయాన్ని తప్పని ఆ తల్లి చేసిన ట్యూటరింగ్ వల్ల ఆ పిల్లవాడు ఆ విధంగా చేశాడని అతను గట్టిగా వాదించాడు. కాని మేము అతని వాదనతో ఏకీభవించడంలేదు. స్వంత తల్లి దత్తత తల్లిదండ్రులు న్యాయవాదులు లేనపుడు ఆ పిల్లవాడిని మేము మా ఛాంబర్లో ప్రశ్నించి కొన్ని సమాధానాలని రాబట్టుకున్నాము. ఆ సమాధానాల ఆధారంగా ఆ పిల్లవాడి ఆకాంక్షను మేము గమనించాము. అతను స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ కారణాలవల్ల అతను స్వంత తల్లి సంరక్షణలో ఉండటం సమంజసం. అందుకని రాజస్థాన్ జారీ చేసిన ఉత్తర్వు సరియైనదేనని మేము భావిస్తున్నాము. ఆ దత్తత పత్రము చెల్లుబాటయ్యే దత్తత పత్రమా కాదా అన్న విషయం సివిల్ కోర్టులో తేలేవరకు ఆ పిల్లవాడు స్వంత తల్

విడాకులు పొందిన స్ర్తి.. కిరాయి హక్కులు

విడాకులు పొందిన స్ర్తి.. కిరాయి హక్కులు
October 6th, 2010

భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తినపుడు విడాకులు తీసుకుంటారు. కొంతమంది పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటారు. ఈ విధంగా విడాకులు తీసుకున్న భార్యలకి భర్త ఆస్తుల మీద ఎలాంటి హక్కులు వుండవు. ఆమె శాశ్వత మనోవర్తి కోసం ఎలాంటి భరణం ఇవ్వనపుడు ఆమె భరణం కోరే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆస్తుల విషయంలో హక్కులు వుండవు. కొన్ని సందర్భాలలో భర్త అద్దెకు తీసుకున్న ఇంటిలో భార్య అద్దె వుంటే పరిస్థితి వుంటుంది. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని దరఖాస్తు చేసినపుడు ఆ ఇంటిలో ఆ భార్యకి కిరాయిదారుకు వుండే హక్కులువుంటాయా? ఆ కేసులో ఆమె అవసరమైన పార్టీ అవుతుందా? విడాకులు పొందిన స్ర్తి తన భర్త కిరాయి హక్కులను పొందే అవకాశం వుందా?

ఈ ప్రశ్నకి సమాధానం సుప్రీంకోర్టు రూమా చక్రవర్తి వర్సెస్ సుధారాణి బెనర్జీ ఇతరులు (2005 (8) సుప్రీంకోర్టు కేసెస్ 140) కేసులో సమాధానాలు చెప్పింది. మాజీ భర్త కిరాయి హక్కులలో మాజీ భార్యకు ఎలాంటి హక్కు వుండదని సుప్రీంకోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది.

కేసు విషయాలు
‘ఏ’ భార్య ఆమె వివాహం ‘బి’ భర్తతో జరిగింది. వారిద్దరిమధ్య విభేదాలు తలెత్తి చివరికి హిందూ వివాహ చట్టంలోని సె.13 బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక కిరాయి ఇంటిలో వుండేవాళ్ళు. విడాకులు మంజూరైన తరువాత భర్త వేరే ఇంటిలో కాపురం వుండటం మొదలుపెట్టాడు. భార్య తన పిల్లలతో భర్త కిరాయికు తీసుకున్న ఇంటిలో వుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ‘బి’ భర్తపైన ఇల్లు ఖాళీ చెయ్యమని దరఖాస్తు దాఖలు చేసింది. ‘బి’ తన ఇంటిని కిరాయికు తీసుకొని ఒక అపరిచితురాలికి కిరాయికు ఇచ్చిన కారణంగా ఇల్లు ఖాళీ చెయ్యాలని ఆమె తన దావాలో పేర్కొంది.
‘బి’ తన జవాబుని దాఖలు చేశాడు. తన పిల్లలు ఆ ఇంటిలో నివశిస్తున్నారని, ‘ఏ’ తన పిల్లల తల్లిగా వాళ్ళ సంరక్షకురాలిగా వుంటుందని, అంతేకానీ ఆమె కిరాయిదారు కానీ ఉప కిరాయిదారు కాదని తన జవాబులో ‘బి’ పేర్కొన్నాడు. అంతేకాదు ఆ ఇల్లు తన స్వాధీనంలోనే వుందని తన పిల్లలు ఆ ఇంటిలో వుండే అధికారం కలిగి వున్నారని కూడా తన జవాబులో పేర్కొన్నాడు.
అతని భార్య ‘ఏ’ కూడా ఆ దావాలో ఒక దరఖాస్తుని దాఖలు చేసింది. తాను ఆ కేసులో అవసరమైన పార్టీ అని తనకు కూడా కిరాయిదారుకు వుండే హక్కులు వున్నాయని అందుకని ఆ కేసులో తనని కూడా పార్టీ చెయ్యాలని దరఖాస్తు చేసుకుంది. సివిల్ కోర్టు ఆమె దరఖాస్తుని త్రోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులకి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టులో దరఖాస్తుని దాఖలు చేసింది. కలకత్తా హైకోర్టు సివిల్ కోర్టు ఉత్తర్వునే సమర్థించింది. హైకోర్టు ఉత్తర్వులకి వ్యతిరేకంగా ‘ఏ’ సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది.
మాజీ భార్యకి మాజీ భర్త ద్వారా కిరాయి హక్కులు సంక్రమిస్తాయా? ‘ఏ’ అనే వ్యక్తి అవసరమైన పార్టీ అవుతుందా? ఇది సుప్రీంకోర్టు ముందు తలెత్తిన ప్రశ్న.
సుప్రీంకోర్టు తీర్పులోని సారాంశం.. కిరాయికి తీసుకున్న ఇల్లు తన స్వాధీనంలో ఉందని తన మాజీ భార్య తన పిల్లలకి సంరక్షకురాలిగా మాత్రమే ఆ ఇంట్లో వుంటుందని కానీ కిరాయిదారుగా ఉప కిరాయిదారుగా కాదని ‘బి’ కోర్టు ముందు వాదించాడు. మాజీ భర్త కేసుని ఎదుర్కొంటున్నాడు కాబట్టి అతని మాజీ భార్య ఈ కేసులో అవసరమైన పార్టీ కాదని ఆ ఇంటి యజమాని సుప్రీంకోర్టు ముందు వాదించింది.
సుప్రీంకోర్టు ‘ఏ’ దాఖలుచేసిన అప్పీలుని డిస్మిస్ చేస్తూ ఈ విధంగా తీర్పుని ప్రకటించింది.
*ఈ కేసులో మూల కిరాయిదారు కేసును ఎదుర్కొంటున్నాడు. మైనర్ పిల్లల ప్రయోజనాలని అతను పట్టించుకుంటున్నాడు. అందుకని అతని మాజీ భార్యకి ఈ కేసులో స్థానం లేదు. అందుకని ఆమె ఈ కేసులో అవసరమైన పార్టీ కాదు.
భర్తను వదిలిపెట్టిన భార్య స్థానం విడాకులు పొందిన భార్య స్థానం వేరువేరుగా వుంటాయి. భర్తను వదిలిపెట్టిన భార్య ఇంటిలో వుండే అవకాశం వుంటుంది. విడాకులు తీసుకున్న భార్య ఇంటిలో వుండే అవకాశం లేదు. ఎందుకంటే విడాకులు అనేవి వైవాహిక జీవితానికి ముగింపు వంటివి. నివాసంలో వుండే అధికారం విడాకుల డిక్రీ ప్రకారం వుంటుంది. ఈ కేసులో ‘ఏ’ తన మనోవర్తి హక్కుని వదులుకుంది. పిల్లల్ని పెంచే హక్కుని తీసుకుంది. ఈ కారణంగా ఆమెకు తన మాజీ భర్త ఇంటిలో వుండే అవకాశం లేదు. అందుకని దావాలో ఆమె అవసరమైన పార్టీ కాద

Followers