Friday, February 27, 2009

28-2-09 surya daily

పోలీసు వ్యవస్థ సంస్కరణలే శరణ్యం!

పోలీసుల ప్రస్తావన, మానవహక్కుల ప్రస్తావన లేని రోజు ఉండదు. పోలీసులను, సిబీఐని కోర్టులు తరచూ తప్పు పడుతున్నాయి. ఇలా ప్రతిసారీ జరగడానికి కారణం ఏమిటి? మానవ హక్కులు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1948లో వాడినప్పటికీ దాని భావన ఇటీవలి కాలంలో ఎక్కువగా పరివ్యాప్తి లోకి వచ్చింది. పర్యవసానంగా మానవ… హక్కుల పరిరక్షణ చట్టం 1993లో అమలు లోకి వచ్చింది. ఆ చట్టం ప్రకారం మానవ హక్కులంటే భారత రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులలో పొందు పరచిన, అభయం ఇచ్చిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం ఇంకా అంతర్జాతీయ ఒప్పందాలలో పొందు పరచిన హక్కులు అని భారతీయ కోర్టుల ద్వారా అమలు పరిచే అవకాశం ఉన్న హక్కులై ఉండాలి.

ప్రాధమిక హక్కులన్నీ మానవ హక్కులే. ప్రాధమిక హక్కుల ఉల్లంఘనలన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే. గౌరవం అన్న పదం ప్రాధమిక హక్కులలో పేర్కొన్నప్పటికీ జీవించే హక్కులో అది మిళితమై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రతి క్షణమూ జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు మాత్రమే కాదు, సమాజంలోని చాలామంది వ్యక్తులు మానవ హక్కుల ఉల్లంఘనలను చేస్తూనే ఉన్నారు. పోలీసులు ఎక్కువగా చేస్తూ ఉండవచ్చు. ఇందుకు కారణం ఏమిటి? జవాబు తెలుసుకోవాలంటే ముందుగా పోలీసు వ్యవస్థ మన దేశంలో ఏ విధంగం ఉందో తెలుసుకోవాలి.

పోలీసు వ్యవస్థ మనకు బ్రిటిష్‌వారినుంచి సంక్రమించింది. వ్యక్తి స్వేచ్ఛకు మూలాధారం తమ మాగ్నాకార్టా (1215) అని బ్రిటిష్‌ పాలకులు భావించినప్పటికీ హబియస్‌ కార్పస్‌ హక్కుల చట్టం 1684, ఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ 1789 కంటె పూర్వమే అమలులోకి తెచ్చినప్పటికీ ఈ హక్కులను వాళ్ళు ఆ హక్కులను వారి పరిపాలనలో మనకు ఇవ్వలేదు.

స్వేచ్ఛాపూరితమైన ఎన్నికలు, భావ స్వేచ్ఛ, బెయిల్‌ వంటి భావనలు బ్రిటిష్‌వారికి తెలిసినప్పటికీ అవి భారత దేశ ప్రజలకు ఇవ్వని వాళ్ళు సరైన ప్రయత్నాలు చేయలేదు. పోలీసు వ్యవస్థను సేవాసంస్థగా కాకుండా ఒక ఫోర్‌‌సగా మాత్రమే వాళ్ళు మన దేశంలో రూపొందించారు. మన దేశ ప్రజలను వారి స్వేచ్ఛను అణగదొక్కడానికి మాత్రమే ఈ వ్యవస్థను వాళ్ళు ఉపయోగించారు. వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత పోలీసులపై ఉందని మన పోలీసులకు తెలియనివ్వలేదు. నేషనల్‌ కాంగ్రెస్‌ వంటి సంస్థలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ సంస్థలను అణచివేయడానికే పోలీసు వ్యవస్థను బ్రిటిష్‌ పాలకులు ఉపయోగించుకొన్నారు. అప్పటి పోరాటాలను అణగదొక్కడానికే ఈ వ్యవస్థ వాళ్ళకి ఉపయోగపడింది. పోలీసు ఉద్యోగాలకు శారీరక దారుఢ్యం లాంటి విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. క్రమశిక్షణ అన్నది పరేడ్‌ గ్రౌండ్‌నుంచి మాత్రమే వస్తుందన్న భ్రమ కలిగించారు. తమకి ఎదురుగా వచ్చిన వ్యక్తి తమ శత్రువే అన్న భావనను వాళ్ళకి కల్పించారు. సాయుధ దళాల మాదిరిగా వాళ్ళకి ఖాకీ డ్రస్‌ను ఇచ్చారు.

తాము కూడా ఫోర్‌‌స అన్న భావననే వాళ్ళకి కల్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా పోలీసుల్లో అలాంటి భావనే కొనసాగుతున్నది. రాజ్యాంగం గురించి, ప్రాధమిక హక్కుల గురించి వారికి శిక్షణ ఇస్తున్నప్పటికీ, పోలీసుల్లో తాము చట్టానికి అతీతులమన్న భావన పోలేదు. అందుకు ప్రధాన కారణం జవాబుదారీతనం లేకపోవడమే.
మన రాజ్యాంగం ప్రకారం పోలీసు వ్యవస్థ రాషా్టల్రకు చెందిన విషయం. అంటే ఈ వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత వహిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించిన నియమ నిబంధనల ప్రకారం ఇవి పని చేయాల్సి ఉంటుంది. ప్రతి రాషా్టన్రికీ కేంద్ర పాలక ప్రాంతానికీ వేరుగా పోలీసులు ఉన్నారు.
పోలీసు చట్టం 1861 ద్వారా మన దేశంలో పోలీసు వ్యవస్థ అమల్లోకి వచ్చింది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. నేపథ్యంలో ఈ చట్టాన్ని బ్రిటిష్‌వాళ్ళు తీసుకొచ్చారు.

తిరుగుబాటు ఒక సంచలనమైతే దానిని అణచివేయడం మరో సంచలనం. ఈ విధంగా రూపు దిద్దుకొన్న పోలీసు లంటే అందరిలోనూ ఓ భయం నెలకొనిపోయింది. చాలా మంది ప్రజలు పోలీసులంటే భయపడతారు. అయినా కూడా కష్టకాలంలో, అవసరమైన పోలీసు సహాయం కోరకుండా ఉండలేని పరిస్థితి. పోలీసులను అవకాశం ఉన్నంత కాలం దూరం పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. పరిస్థితి లేనప్పుడు తప్పక వాళ్ళ సహాయాన్ని కోరతారు. ఇదీ పరిస్థితి.

పోలీసుల పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఆ విధంగా పోలీసులు ప్రవర్తించాలి. ప్రజలకు రక్షణ కల్పించవలసిన బాధ్యతను పోలీసులు గుర్తించాలి. ఇవి కావాలంటే పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. చట్టానికి జవాబుదారీ వహించే విధంగా పోలీసు వ్యవస్థ ఉండాలి. పోలీసుల స్థితి గతులు మెరుగు పరచాలి. వారిలో నాయకత్వ లక్షణాలు పెంచాలి. ఏకపక్షంగా బదిలీలు, పోస్టింగులు ఉండకూడదు. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత… ఉండాలి.

కాలానుగుణంగా ఐ.పి.ఎస్‌. అధికారులకు ఇచ్చే ప్రమోషన్లు అందరికీ వచ్చే విధంగా మార్పులు తీసుకొని రావాలి. అయితే, అవి నిజాయితీ సమర్ధత ఉన్న అధికారులకే ఇవ్వాలి. పోలీసు పనిలో స్వతంత్రత ఉండే విధంగా మార్పులు చేయాలి. ప్రజల కోసం పని చేస్తున్నామన్న భావన పోలీసులకు ఉండే విధంగా వారికి శిక్షణ ఉండాలి. ఒత్తిడులు లేకుండా పోలీసులు పనిచేసే విధంగా మార్పులు తీసుకురావాలి. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని సుప్రీంకోర్టు దగ్గరనుంచి అందరూ కోరుకొంటున్నారు. ఎందుకంటే సంస్కరణలవల్ల ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రజల సమస్యలను సున్నితంగా పోలీసులు అర్థం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. ధర్‌‌డ డిగ్రీలాంటి దగ్గరి దారినుండి ఎన్‌కౌంటర్‌ లాంటి అడ్డదారులకు పోలీసులు వెళ్ళకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది.

పోలీసు వ్యవస్థలో లెక్కకు మించి మానవ వనరులు ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకొంటే సమాజానికి మేలు జరుగుతుంది. ఆ బాధ్యత ప్రభుత్వం మీద, అందరిమీదా ఉంది.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, February 20, 2009

21-2-09 suryaa

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సవరణలు) మేలు చేసే నిబంధనలు


క్రిమినల్‌ ప్రొిసీజర్‌ కోడ్‌ (సవరణల) బిల్లు, 2008 చట్ట రూపంగా మారిన తర్వాత ఆవిషయమై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ప్రబలుతోంది. అరెస్టు గురించి ఈ చ…ట్టం ద్వారా చేసిన సవరణల వల్ల ప్రస్తుతం అమల్లోవున్న పద్ధతులన్నీ తారుమారవుతాయని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఈ చ…ట్టం ద్వారా వచ్చిన చాలా నింబంధనలను, అరెస్టుకు సంబంధించిన నిబంధనలను పోలీసులు వ్యతిరేకిస్తున్నారు.

న్యాయవ్యాదులయితే ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కోర్టుపని మానివేసి ఉరేగింపులు తీస్తున్నారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనల బాగోగులగురించి వాటి ఫలితాల గురించి గతంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. ప్రభుత్వం తేదీని ప్రకటించిన తర్వాత అవి అమల్లోకి వస్తాయి. గతంలో 2005, 2006 సంవత్సరాల్లో కూడా క్రిమినల్‌ ప్రొిసీజర్‌‌‌ కోడ్‌కు ప్రభుత్వం సవరణలను తీసుకువచ్చింది. వాటిలోని చాలా „సవరణలు ప్రభుత్వం తేదీ ప్రకటించక పోవడం వల్ల అమల్లోకి రాకుండా అట్లాగే ఉండిపోయాయి. 2008లో చేసిన సవరణల్లో కొన్ని మంచి సవరణలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బాధితుని గురించిచేసిన సవరణలు, తయారు చేసిన కొత్త నిబంధనలు. దేశ వ్యాప్తంగా ఎదురవుతున్న వ్యతిరేకత వల్ల ఈ నిబంధనలు అమల్లోకి రావేమోనన్న సందేహం కూడా కలుగుతోంది.

నేరన్యాయ వ్యవస్థ బాధితులను పట్టించుకోలేదని వారి గురించి ఆలోచించలేదని చాలా కాలంగా విమర్శ ఉంది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. క్రిమినల్‌ ప్రొిసీజర్‌ కోడ్‌లో బాధితులకి సష్టపరిహారం చెల్లించడానికి. సె-357 అన్న నిబంధన ఉంది. ఈ నిబంధన బాధితుల అపసరాలని పూర్తిగా తీర్చడం లేదు. ఈ విషయాన్ని గురించి ఈ కొత్తచట్టం ద్వారా సె-357(ఎ) చేర్చారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే బాధితులకు మంచి జరిగే అవకాశం ఏర్పడుతుంది. అమల్లో ఉన్న సె-357 ప్రకారం కోర్టుల ద్వారా నేరబాధితులకు కొంత మేరకు మాత్రమే నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంది. ఆ విధంగా సె-357 ప్రకారం సష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ముద్దాయికి లేకపోతే కోర్టులు ఏంచేయగలిగేవి కావు. అయితే కొత్తగా చేర్చిన సె-357(ఎ) ద్వారా ఈ పరిస్థితి మారే అవకాశం ఏర్పడుతుంది. నేరం విచారణ జరిగిన త…రువాత ముద్దాయికి శిక్షపడినప్పుడు మాత్రమే కోర్టులు సె-357 ప్రకారం నష్టపరిహారం మంజూరుచేసే అవకాశం ఉంది.

ముద్దాయికి శిక్ష పడన…ప్పుడు, అట్లాగే అతన్ని నేరం నుంచి తప్పించినప్పుడు బాధితులకు కోర్టులు నష్టపరిహారం మంజూరు చేసే అవకాశం లేదు. ముద్దాయి దొరకకపోతే, ముద్దాయిని గుర్తించకపోతే నష్టపరిహారం చెల్లించే పరిస్థితేలేదు. ఈ సాధక బాధకాలను పరిశీలించి కొత్త చట్టం ద్వారా సె-357(ఎ)ని చేర్చారు. హడావిడిగాసవరణల చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీి దీనిద్వారా కొంత మేరకు బాధితులకు లాభం జరిగే అవకాశం ఉంది. సె-357(ఎ)లో ఏమిచెప్పారో చూద్దాం.సె-357(ఎ) ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి ఒక స్కీమును ప్రభుత్వం ఏర్పటుచేయ్యాలి. ప్రతిరాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వ సహకారంలో విధిగా స్కీములు ఏర్పాటు చేయాలి.

నేరబాధితులకు వారిపై ఆధారపడ్డ వ్యక్తులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి, వారికి పునరావాసం కల్పించే విధంగా ఈ స్కీమును తయారు చేయాలి. కోర్టులో నేరƒ విచారణ పూరె్తైన తర్వాత నేరƒబాధితుల పునరావాసానికి అవసరమైన నష్టపరిహారాన్ని కోర్టులు సె-357 ప్రకారం చెల్లించమని ఆదేశించే అవకాశం ఉంది. ఒక వేళ ఆవిధంగా అదేశించిన మొత్తం బాధితుల పునరావాసానికి సరిపోదని కోర్టు భావించినప్పుడు వాళ్లకి తగిన నష్టపరిహారం చెల్లించమని సిఫారసు చేసే అవకాశం ఉంది. ఈ సిఫారసును కోర్టులు జిల్లా న్యాయసేవాధికార సంస్థకు గాని లేదా రాష్టన్య్రాయసేవాధికార సంస్థకి గాని చేయాల్సి ఉంటుంది. ఆ సిఫారసు అందిన తర్వాత ఆ సంస్థలు బాధితుల పునరావాసానిి అవసరమైన నష్టపరిహార మొత్తాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ముద్దాయిలపై ఉన్న కేసులను కొట్టివేసినప్పుడు, అట్లాగే వాళ్ళని విముక్తం చేసినప్పుడు కూడా కోర్టులు నష్టపరిహారం చెల్లించమని సిఫారసుచేసే అవకాశం ఉంది.

కొన్ని సందర్భాలలో ముద్దాయి దొరకకపోవచ్చు. అతణ్ణి గుర్తించలేకపోవచ్చు. విచారణ జరగకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో నేరబాధితులుగాని వారిపై ఆధారపడిన వ్యక్తులుగానీ నేరుగా రాష్టన్య్రాయసేవాధికార సంస్థకుగాని లేదా జిల్లా న్యాయసేవా ఆధికార సంస్థకు గానీ నష్టపరిహారం కోసం దరఖాస్తుచేసుకోవచ్చు. కోర్టునుంచి సిఫారసు అందినప్పుడు లేదా బాధితులనుంచి నేరుగా దరఖాస్తు అందినప్పుడు వాటి గురించి విచారణ జరిపి అవసరమైన నష్టపరిహారాన్ని నిర్ధారించి అవార్డు రూపంలో ఆ సంస్థలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ పనిని ఆ సంస్థలు విధిగా రెండు నెలల లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది. బాధితుల బాధను తగ్గించడానికి వారికి అవసరమైన ప్రథమ చికిత్సను, ఇతర వైద్యసదుపాయలను ఉచితంగా అందించడానికి న్యాయసేవాధికార సంస్థలు ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు జారీచేసే ముందు ఆ సంస్థలు సంబంధిత మేజిస్ట్రేట్‌ నుండి కాని పోలీసు ఆధికారులనుండి కాని ఒక సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సందర్భాలలో తాత్కాలిక సహాయాన్ని కూడా ఈ సంస్థలు అందచేసే అవకాశం ఉంది.

ఈ నిబంధనే కాకుండా క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని సె-372కు అనుబంధంగా ఒక ప్రొవిజన్‌ను కూడా ఈ చట్టం ద్వారా చేర్చారు. దీని ప్రకారం కోర్టులు ముద్దాయిని విడుదల చేసినప్పుడు లేదా వారికి తక్కువ శిక్ష విధించినప్పుడు అట్లాగే బాధితులకు తక్కువ నష్టపరిహారం మంజూరు చేసినప్పుడు బాధితులు అప్పీలుచేసే అవకాశం ఉంది.ఈ కొత్త మార్పుల వల్ల నేర బాధితులకు మేలు జరిగే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నేర బాధితులను చట్టం గుర్తించినట్లుగా అనిపిస్తుంది. అరెస్టు విషయంలో ఉత్పన్నమైన వ్యతిరేకత వల్ల ఈ నిబంధనలు కూడా అమల్లోకి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అరెస్టు నిబంధనలకు తీసుకొచ్చిన సవరణలను తప్పకుండా వ్యతిరేకించాల్సిందే. అయితే మంచి చేసే అవకాశం ఉన్న నిబంధనలు ఆ వ్యతిరేకతల వల్ల కొట్టుకుపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మరీముఖ్యంగా న్యాయవాదులపై. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న చట్టాన్ని ఎలాంటి చర్చ జరప కుండా ఆదరా బాదరాగా ప్రభుత్వం ఎందుకు తయారు చేసిందో అర్థంకాదు. ఇప్పటికైనా విజ్ఞతతో విచారించి ప్రజలకు మేలుచేసే నిబంధనలను అమల్లోకి తేవాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, February 13, 2009

surya daily paper 14-2-09
ఎన్‌కౌంటర్‌ మరణాలు

`అర్ధాలు మారిపోతాయి
కాలక్రమంలో అర్ధాలు మారిపోతాయి!
మనం డిక్షనరీలు మార్చుకోక తప్పదు!!'' అన్నాడు ఓ తెలుగు కవి

.1990 ప్రాంతంలో లాకప్‌ డెత్‌లు, ఎన్‌కౌంటర్లని చూసి ఓ కవితలో ఆ విధంగా అన్నాడు. నేరన్యాయ వ్యవస్థ వైఫల్యం వల్ల, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు చట్టం పరిధి నుంచి సులువుగా తప్పించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా సాధారణ ప్రజలు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పోలీసుల నుంచి కఠినమైన చర్యలను ఆశిస్తున్నారు. చట్టవ్యతిరేక చర్యలు కావాలని కోరుతున్నారు. వారు ఆ విధంగా కోరుతున్నారని మీడియా ప్రచారం చేస్తుంది. ఏదైనా తీవ్రమైన నేరం జరిగినప్పుడు ఇలాంటి స్పందన రావడం సహజమే. అయితే అది క్షణికమైనటువంటిది. దాన్ని సహజమైన భావనగా మీడియా కావాలని ప్రసా రం చేస్తుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు! ఎవరైనా అమ్మాయి మీద దాడి జరిగితే చాలు, అవతలి వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలని అంటున్నారు.ఎన్‌కౌంటర్లు జరగడానికి ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సహం కారణం కాదు. వాటికి కారణాలు అనేకం. ప్రమోషన్లు, మెడల్‌‌స, ఆర్థికపరమైన లాభాలు, రాజకీయ నాయకుల్లో ఉదాసీన వైఖరి. ఎన్‌కౌంటర్లనేవి పోలీసుల పనిలో భాగమని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. దాదాపుగా అవి ప్రజల దృష్టిని ఆకర్షించడం తగ్గిపోయింది. ఇలాంటి దశలో వరంగల్‌ యాసిడ్‌ దాడులలోని నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. అది ప్రజల దృష్టిని ఆకర్షించింది. దాని మీద చర్చజరిగింది. ఆ తరువాత ƒరీంనగర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెలలో మన రాష్ట్ర హైకోర్టులోని ఐదుగురు సభ్యులుగల బెంచి ఎన్‌కౌంటర్ల మీద తమ తీర్పుని వెలువరించింది. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్టా్య, దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్టా్య ఇది చాలా ప్రాధాన్యతను సంత…రించుకుంది.ఇది అవసరమైన తీర్పుకూడా! అయితే ఈ తీర్పుతోనే ఈ ఎన్‌కౌంటర్ల ఒరవడి తగ్గిపోతుందని అనుకోలేం. కానీ ఒక బెదురు ఏర్పడే అవకాశం ఉంది.1995 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కె.జి.కన్నాభిరాన్‌ వర్సెస్‌ చీఫ్‌ సెక్రటరీ 1995 (2) ఎ.ఎల్‌.టి(క్రిమినల్‌) 490 కేసులో కూడా ఎన్‌కౌంటర్ల మీద ఓ తీర్పుని ప్రకటించింది. ఎన్‌కౌంటర్లో మనిషి మరణించినప్పుడు ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి దర్యాప్తు చెయ్యాలని ఆదేశించింది.ఆ తరువాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దీనికి వ్యతిరేకమైన తీర్పును ప్రకటించింది. ఆ తరువాత కూడా ఇలాంటి కేసులు హైకోర్టుకి రావడం వల్ల ఈ కేసులో తలెత్తిన అంశాల ప్రాధాన్యతల దృష్టా్య దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించారు. ధర్మాసనం ఈ నెలలో తన తీర్పును ప్రకటించింది. ఎన్‌కౌంటర్‌ కేసుల్లో ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి దర్యాప్తు చెయ్యాలని, ఆదేవిధంగా ఆ ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారుల వివరాలను కూడా ప్రకటించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు వల్ల పోలీసులు తప్పుడు ఎన్‌కౌంటర్లకి జంకే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో దేశంలో ఎన్‌కౌంటర్ల మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నందున ఈ కేసు తీర్పు చాలా మందిని ఆలోచనల్లో పడేస్తుందని అనడంలో ఆశ్చర్యం లేదు.జాతీయ మానవ హక్కుల ƒమిషన్‌ లెక్కల ప్రకారం 2002-03 సంవత్సర కాలంలో 83 మంది వ్యక్తులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఆ తరువాత సంవత్సరంలో 100 మంది, ఆ తరువాత సంవత్సరంలో 122 మంది చనిపోయారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తోంది. ఈ లెక్కల్లో జమ్మూ-కాశ్మీర్‌ రాషా్టన్న్రి మినహాయించారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎన్‌కౌంటర్ల నేపథƒ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు పోలీసులను కొంతమేరకు నియంత్రిస్తుంది. కానీ వారిని పూర్తిగా నియంత్రిస్తుందా? ఇదీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ప్రతి వ్యక్తి తన ఆస్తిని, తన ప్రాణాన్ని అదే విధంగా ఇతరుల ప్రాణాలని, ఇతరుల ఆస్తిని కాపాడే హక్కు కలిగి ఉంటాడు. దీన్నే వ్యక్తిగత రక్షణ హక్కు అంటారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 97,100,103 ప్రకారం ఈ హక్కు ప్రతి వ్యక్తికీ ఉంటుంది. అయితే ఈ హక్కుని తాను శాసనం నిర్దేశించిన పరిధిలోనే వినియోగించుకున్నానని ఆ వ్యక్తి కోర్టులో రుజువు చేసుకున్నప్పుడే అతనికి ఈ మినహాయింపు లభిస్తుంది. ఆ విధంగా నిరూపించుకోలేనప్పుడు ఆ వ్యక్తి శిక్షార్హుడవుతాడు. అయితే ఇక్కడో విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. పోలీసు అధికారులు ఈ చర్యలను తమ విధి నిర్వహణలో చేశామని అంటారు. దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా పోలీసు అధికారులే. సహజంగానే వాళ్ళు కూడా ఇదే భావనకి వస్తారు. ఈ సందర్భంలో ఆ పోలీసు అధికారులను ప్రాసిక్యూట్‌ చెయ్యాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని నెం. 132,197 ప్రకారం ప్రభుత్వం నుంచి ఈ అనుమతి అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ అనుమతి సులువుగా రావడం, సత్వరంగా రావడం కష్టం. ఈ అనుమతి లభించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. అవినీతి కేసుల్లో చాలా కేసులు ప్రభుత్వ అనుమతి లేక మూలన పడుతున్నాయి. ఒక వేళ అనుమతి లభించినా కూడా వాటిని పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలే. అప్పటికే ఆ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న వ్యక్తులు పదవీ విరమణ చేయవచ్చు. ముసలివాళ్ళు అయిపోవచ్చు. అందుకని ఎన్‌కౌంటర్‌ సంస్కృతిని తగ్గించడం అంత… సులువైనదిగా అనిపించడం లేదు. ఈ సందర్భంలో పది సంవత్సరాల క్రితం డిల్లీలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ గురించి మాట్లాడుకోవడం అవసరం. వ్యాపారవేత్తలు ప్రదీప్‌ గోయల్‌, జగ్‌జిల్‌ సింగ్‌లు ఓ తప్పుడు ఎన్‌కౌంటర్లో చనిపోయినారు. అప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆ నగర పోలీసు కమిషన్‌ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ కేసు దర్యాప్తును సి.బి.ఐ.కి అప్పగించారు. పది సంవత్సరాల తర్వాత ఆ ఎన్‌కౌంటర్‌కి పాల్పడిన 10 మంది పోలీసులకి శిక్ష పడింది. ఆ బాధితుల కుంటుంబీకులు ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు కాబట్టి, వనరులు ఉన్న వాళ్ళు కాబట్టి ఇది సాధ్యపడింది. మామూలు వ్యక్తులు ఎన్‌కౌంటర్లో మరణిస్తే ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. కొంత మంది పోలీసు అధికారులను గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళే పంజాబ్‌కి చెందిన సీనియర్‌ ఎస్పీ అజిత్‌ సింగ్‌ సందూ, గుజరాత్‌కి చెందిన ఐ.పి.ఎస్‌ అధికారులు డి.జి.వంజర, యం.ఎన్‌ దినేష్‌, ఆర్‌.కె.పాండియన్‌, డిల్లీకి చెందిన అసిస్టెంట్‌ కమీషనర్‌ రాజ్‌బీర్‌సింగ్‌. ఎంతో మంది కరుడు గట్టిన తీవ్రవాదులని మట్టుపెట్టిన సందూ, తీవ్ర ఆరోపణలలో ఎన్నో కేసుల్లో విచారణలను ఎదుర్కొన్నాడు. తను అరెస్టు చేసిన ఖైదీలతో బాటే తానూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్‌ పోలీసు అధికారులు తమ ప్రమోషన్ల కోసం సోహ్రబుద్దీన్‌ని కాల్చి చంపారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆ అధికారులని ఎంతగానో అభిమానించిన రాజకీయ నాయకులు వాళ్ళకి దూరమయ్యారు. సుప్రీంకోర్టులో వాళ్ళ రక్షణకి రాలేదు. ఇక రాజ్‌బీర్‌ సింగ్‌ విషయానికి వస్తే, ఇతను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. అతనికి రాష్టప్రతి గెలంటరీ మెడల్‌ కూడా లభించింది. ఇంకా అలాంటివి ఎన్నో లభించాయి. కానీ రియల్‌ ఎేస్టేట్‌ వ్యక్తులతో అతనికి తెరచాటు సంబంధాలు ఉన్నాయి. అతన్ని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కాల్చి చంపాడు. అతని శవాన్ని చూడటానికి ఒక్క సీనియర్‌ పోలీసు అధికారి కూడా రాలేదు. ఒక్క పుష్పగుచ్ఛాన్ని కూడా పంపించలేదు. జూనియర్‌ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. సీనియర్లందరూ అంతకు ముందు అతన్ని అభినందించిన వారే. ఇవన్నీ గమనించి చట్టవ్యతిరేక దారుల్లో ప్రయాణం చేస్తున్న అధికారులు తమ ధోరణులను మార్చుకోవాలి. ప్రజల కోసమైనా చట్ట వ్యతిరేకంగా పని చేయడం తమ గౌరవాన్ని కించపరుచుకోవడమే నన్న విషయాన్ని గమనించాలి. రాజకీయాలు కాదు, న్యాయాధిక్యమే ముఖ్యమని భావించాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

ఎన్‌కౌంటర్‌ మరణాలు
అర్ధాలు మారిపోతాయి
కాలక్రమంలో అర్ధాలు మారిపోతాయి!
మనం డిక్షనరీలు మార్చుకోక తప్పదు!!'' అన్నాడు ఓ తెలుగు కవి.
1990 ప్రాంతంలో లాకప్‌ డెత్‌లు, ఎన్‌కౌంటర్లని చూసి ఓ కవితలో ఆ విధంగా అన్నాడు. నేరన్యాయ వ్యవస్థ వైఫల్యం వల్ల, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు చట్టం పరిధి నుంచి సులువుగా తప్పించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా సాధారణ ప్రజలు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పోలీసుల నుంచి కఠినమైన చర్యలను ఆశిస్తున్నారు. చట్టవ్యతిరేక చర్యలు కావాలని కోరుతున్నారు. వారు ఆ విధంగా కోరుతున్నారని మీడియా ప్రచారం చేస్తుంది. ఏదైనా తీవ్రమైన నేరం జరిగినప్పుడు ఇలాంటి స్పందన రావడం సహజమే. అయితే అది క్షణికమైనటువంటిది. దాన్ని సహజమైన భావనగా మీడియా కావాలని ప్రసా రం చేస్తుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు! ఎవరైనా అమ్మాయి మీద దాడి జరిగితే చాలు, అవతలి వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలని అంటున్నారు.

ఎన్‌కౌంటర్లు జరగడానికి ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సహం కారణం కాదు. వాటికి కారణాలు అనేకం. ప్రమోషన్లు, మెడల్‌‌స, ఆర్థికపరమైన లాభాలు, రాజకీయ నాయకుల్లో ఉదాసీన వైఖరి. ఎన్‌కౌంటర్లనేవి పోలీసుల పనిలో భాగమని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. దాదాపుగా అవి ప్రజల దృష్టిని ఆకర్షించడం తగ్గిపోయింది. ఇలాంటి దశలో వరంగల్‌ యాసిడ్‌ దాడులలోని నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. అది ప్రజల దృష్టిని ఆకర్షించింది. దాని మీద చర్చజరిగింది. ఆ తరువాత ƒరీంనగర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెలలో మన రాష్ట్ర హైకోర్టులోని ఐదుగురు సభ్యులుగల బెంచి ఎన్‌కౌంటర్ల మీద తమ తీర్పుని వెలువరించింది. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్టా్య, దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్టా్య ఇది చాలా ప్రాధాన్యతను సంత…రించుకుంది.

ఇది అవసరమైన తీర్పుకూడా! అయితే ఈ తీర్పుతోనే ఈ ఎన్‌కౌంటర్ల ఒరవడి తగ్గిపోతుందని అనుకోలేం. కానీ ఒక బెదురు ఏర్పడే అవకాశం ఉంది.1995 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కె.జి.కన్నాభిరాన్‌ వర్సెస్‌ చీఫ్‌ సెక్రటరీ 1995 (2) ఎ.ఎల్‌.టి(క్రిమినల్‌) 490 కేసులో కూడా ఎన్‌కౌంటర్ల మీద ఓ తీర్పుని ప్రకటించింది. ఎన్‌కౌంటర్లో మనిషి మరణించినప్పుడు ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి దర్యాప్తు చెయ్యాలని ఆదేశించింది.ఆ తరువాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దీనికి వ్యతిరేకమైన తీర్పును ప్రకటించింది. ఆ తరువాత కూడా ఇలాంటి కేసులు హైకోర్టుకి రావడం వల్ల ఈ కేసులో తలెత్తిన అంశాల ప్రాధాన్యతల దృష్టా్య దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించారు. ధర్మాసనం ఈ నెలలో తన తీర్పును ప్రకటించింది.

ఎన్‌కౌంటర్‌ కేసుల్లో ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి దర్యాప్తు చెయ్యాలని, ఆదేవిధంగా ఆ ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారుల వివరాలను కూడా ప్రకటించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు వల్ల పోలీసులు తప్పుడు ఎన్‌కౌంటర్లకి జంకే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో దేశంలో ఎన్‌కౌంటర్ల మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నందున ఈ కేసు తీర్పు చాలా మందిని ఆలోచనల్లో పడేస్తుందని అనడంలో ఆశ్చర్యం లేదు.జాతీయ మానవ హక్కుల ƒమిషన్‌ లెక్కల ప్రకారం 2002-03 సంవత్సర కాలంలో 83 మంది వ్యక్తులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఆ తరువాత సంవత్సరంలో 100 మంది, ఆ తరువాత సంవత్సరంలో 122 మంది చనిపోయారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తోంది. ఈ లెక్కల్లో జమ్మూ-కాశ్మీర్‌ రాషా్టన్న్రి మినహాయించారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎన్‌కౌంటర్ల నేపథƒ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు పోలీసులను కొంతమేరకు నియంత్రిస్తుంది. కానీ వారిని పూర్తిగా నియంత్రిస్తుందా? ఇదీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ప్రతి వ్యక్తి తన ఆస్తిని, తన ప్రాణాన్ని అదే విధంగా ఇతరుల ప్రాణాలని, ఇతరుల ఆస్తిని కాపాడే హక్కు కలిగి ఉంటాడు.

దీన్నే వ్యక్తిగత రక్షణ హక్కు అంటారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 97,100,103 ప్రకారం ఈ హక్కు ప్రతి వ్యక్తికీ ఉంటుంది. అయితే ఈ హక్కుని తాను శాసనం నిర్దేశించిన పరిధిలోనే వినియోగించుకున్నానని ఆ వ్యక్తి కోర్టులో రుజువు చేసుకున్నప్పుడే అతనికి ఈ మినహాయింపు లభిస్తుంది. ఆ విధంగా నిరూపించుకోలేనప్పుడు ఆ వ్యక్తి శిక్షార్హుడవుతాడు. అయితే ఇక్కడో విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. పోలీసు అధికారులు ఈ చర్యలను తమ విధి నిర్వహణలో చేశామని అంటారు. దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా పోలీసు అధికారులే. సహజంగానే వాళ్ళు కూడా ఇదే భావనకి వస్తారు. ఈ సందర్భంలో ఆ పోలీసు అధికారులను ప్రాసిక్యూట్‌ చెయ్యాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని నెం. 132,197 ప్రకారం ప్రభుత్వం నుంచి ఈ అనుమతి అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ అనుమతి సులువుగా రావడం, సత్వరంగా రావడం కష్టం. ఈ అనుమతి లభించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. అవినీతి కేసుల్లో చాలా కేసులు ప్రభుత్వ అనుమతి లేక మూలన పడుతున్నాయి. ఒక వేళ అనుమతి లభించినా కూడా వాటిని పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలే.

అప్పటికే ఆ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న వ్యక్తులు పదవీ విరమణ చేయవచ్చు. ముసలివాళ్ళు అయిపోవచ్చు. అందుకని ఎన్‌కౌంటర్‌ సంస్కృతిని తగ్గించడం అంత… సులువైనదిగా అనిపించడం లేదు. ఈ సందర్భంలో పది సంవత్సరాల క్రితం డిల్లీలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ గురించి మాట్లాడుకోవడం అవసరం. వ్యాపారవేత్తలు ప్రదీప్‌ గోయల్‌, జగ్‌జిల్‌ సింగ్‌లు ఓ తప్పుడు ఎన్‌కౌంటర్లో చనిపోయినారు. అప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆ నగర పోలీసు కమిషన్‌ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ కేసు దర్యాప్తును సి.బి.ఐ.కి అప్పగించారు. పది సంవత్సరాల తర్వాత ఆ ఎన్‌కౌంటర్‌కి పాల్పడిన 10 మంది పోలీసులకి శిక్ష పడింది. ఆ బాధితుల కుంటుంబీకులు ఉన్నత శ్రేణికి చెందిన వాళ్ళు కాబట్టి, వనరులు ఉన్న వాళ్ళు కాబట్టి ఇది సాధ్యపడింది. మామూలు వ్యక్తులు ఎన్‌కౌంటర్లో మరణిస్తే ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.

అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. కొంత మంది పోలీసు అధికారులను గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళే పంజాబ్‌కి చెందిన సీనియర్‌ ఎస్పీ అజిత్‌ సింగ్‌ సందూ, గుజరాత్‌కి చెందిన ఐ.పి.ఎస్‌ అధికారులు డి.జి.వంజర, యం.ఎన్‌ దినేష్‌, ఆర్‌.కె.పాండియన్‌, డిల్లీకి చెందిన అసిస్టెంట్‌ కమీషనర్‌ రాజ్‌బీర్‌సింగ్‌. ఎంతో మంది కరుడు గట్టిన తీవ్రవాదులని మట్టుపెట్టిన సందూ, తీవ్ర ఆరోపణలలో ఎన్నో కేసుల్లో విచారణలను ఎదుర్కొన్నాడు. తను అరెస్టు చేసిన ఖైదీలతో బాటే తానూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్‌ పోలీసు అధికారులు తమ ప్రమోషన్ల కోసం సోహ్రబుద్దీన్‌ని కాల్చి చంపారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ఆ అధికారులని ఎంతగానో అభిమానించిన రాజకీయ నాయకులు వాళ్ళకి దూరమయ్యారు. సుప్రీంకోర్టులో వాళ్ళ రక్షణకి రాలేదు. ఇక రాజ్‌బీర్‌ సింగ్‌ విషయానికి వస్తే, ఇతను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. అతనికి రాష్టప్రతి గెలంటరీ మెడల్‌ కూడా లభించింది. ఇంకా అలాంటివి ఎన్నో లభించాయి. కానీ రియల్‌ ఎేస్టేట్‌ వ్యక్తులతో అతనికి తెరచాటు సంబంధాలు ఉన్నాయి. అతన్ని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కాల్చి చంపాడు. అతని శవాన్ని చూడటానికి ఒక్క సీనియర్‌ పోలీసు అధికారి కూడా రాలేదు. ఒక్క పుష్పగుచ్ఛాన్ని కూడా పంపించలేదు. జూనియర్‌ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. సీనియర్లందరూ అంతకు ముందు అతన్ని అభినందించిన వారే. ఇవన్నీ గమనించి చట్టవ్యతిరేక దారుల్లో ప్రయాణం చేస్తున్న అధికారులు తమ ధోరణులను మార్చుకోవాలి. ప్రజల కోసమైనా చట్ట వ్యతిరేకంగా పని చేయడం తమ గౌరవాన్ని కించపరుచుకోవడమే నన్న విషయాన్ని గమనించాలి. రాజకీయాలు కాదు, న్యాయాధిక్యమే ముఖ్యమని భావించాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, February 6, 2009

అమానుష వైఖరి ఇంకా ఎన్నాళ్ళు?

ఫిర్యాదు వస్తే చాలు పోలీసులు తమ నైపుణ్యాలకి పదనుపెడతారు. అందుకే ఓ కవి మిత్రుడు ఇట్లా అంటాడు

`అక్కడ చిత్రహింసలమీద పరిశోధనలు జరుగుతాయి/
క్రొత్త క్రొత్త పద్ధతులు పనిముట్లూ కనుక్కోబడతాయి/
కాసేపు వాళ్ళు సైంటిస్టులవుతారు/
డాక్టరేట్లు మాత్రమే తక్కువ/
మనిషిని నిర్వీర్యం ఎలా చెయ్యాలో/
వాళ్ళకి తెల్సినంత డాక్టర్లకి కూడా తెలియదు'.


ఫిబ్రవరి 3వ తేదీన సుప్రీం కోర్టు హింస గురించి తీవ్రమైన ఆందోళనను వ్యక్తపరిచింది. కస్టడీలో జరుగుతున్న హింసలను నియంత్రించకపోతే అవి అరాచకం వైపు దారి తీస్తాయని, ఆటవిక రాజ్యం ఏర్పడుతుందనీ, అందువల్ల ప్రజలకు నేర న్యాయ వ్యవస్థ పై నమ్మకం సడలిపోతుందని సుప్రీం కోర్టుపేర్కొంది. అందుకని ఈ సంఘటనల నివారణకు తీవ్రమైన చర్యలు అవసరమని కూడా అభిప్రాయపడింది.

కఠినమైన చర్యలు తీసుకోకపోతే కంచె చేనును మేసినట్టు అవుతుందని, అందువల్ల క్రిమినల్‌ జస్టిస్‌ పునాదులు లేకుండా పోయే ప్రమాదం ఉందని కోర్టు తన ఆందోళనను వ్యక్తపరిచింది.ఉత్తరప్రదేశ్‌లో నోయిడా పోలీస్‌ స్టేషన్లో తన 17 సంవత్సరాల కొడుకు చనిపోయినాడని ఆరోపిస్తూ దల్బీర్‌ సింగ్‌ అనే వ్యక్తి నష్టపరిహారం కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తును దాఖలు చేశాడు. ఆ కేసును విచారిస్తూ అరిజత్‌ పసాయత్‌, అశోక్‌ గంగూలీలతో కూడిన డివిజన్‌ బెంచి ఈ ఆందోళనను వ్యక్తపరిచింది. పోలీసులు తమ ఆధీనంలో ఉన్న వ్యక్తుల పట్ల మితిమీరి ప్రవర్తించడాన్ని నిరోధించకపోతే నాగరిక సమాజం ప్రతిష్ట మంటగలిసిపోతుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.కోర్టు ఈ తీర్పు వెలువరించిన రోజే అదే ఉత్తరప్రదేశ్‌రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన జరిగింది. అది యాదృచ్ఛికమే అయినా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన. అక్కడ ఓ దళిత మహిళ ముఖ్యమంత్రిగా పనిచేస్తోంది. అయినా కూడా దళితుల మీద దాడులు కొనసాగడం దారుణమైన విషయం. పోలీసులందరిలో ప్రవహిస్తున్న రక్తం ఒక్కటేనని ఓ కవి మిత్రుడు తన కవిత్వంలో చెప్పాడు. అది నిజమే అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో కన్పిస్తాయి.

ఇత్వా జిల్లాలో మొన్న మంగళవారం పోలీసు లు 7 సంవత్సరాల దళిత బాలికను బహిరంగం గా, అందరూ చూస్తుండగా చిత్రహింసలకు గురిచేశారు. ప్రజలందరూ చూస్తున్నారన్న భయం లేదు. టివి కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించారో లేదో తెలియదు. కానీ ఏ మాత్రం జంకు లేకుండా ఆ దళిత బాలికను చిత్రహింసలకు గురి చేశారు. ఇంతకీ ఆమె చేసిన నేరం, ఆమెపై ఆరోపించబడిన నేరం అతి చిన్నది. 280 రూపాయలు ఉన్న మనీ పర్సు దొంగతనం చేసిందని, ఆ నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు ఆమెను చిత్రహింసల పాల్జేసారు. ఆమెనే కాదు, గజ దొంగలను కూడా పోలీసులు చట్టప్రకారం చిత్ర హింసలకు గురి చెయ్యడానికి అవకాశం లేదు.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆ తప్పిదానికి పాల్పడిన పోలీసు అధికారిని ఉద్యోగంనుంచి తొలగిం చింది. ఆ సంఘటనకు కారణమైన ఇద్దరు పోలీ సు అధికారులను సస్పెండ్‌ చేసింది. అయితే ఈ సంఘటనను చూసి ఆనందించిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. ఉద్యోగం తొలగించడం, సస్పెండ్‌ చేయ డం సరిపోతుందా? వీరిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకూడదా? ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఇలాంటి సంఘటనలు ఒక్క ఉత్తరప్రదేశ్‌కే పరిమితంకాదు, దేశమంతటా జరుగుతున్నాయి. ఇలాంటి చర్యలు పునరావృతం కావడానికి కారణం ఏమిటి?
కస్టడీల్లో చిత్రహింసలకు, మరణాలకు ఎక్కువగా గురవుతున్న వ్యక్తులు బీదవాళ్ళు, బలహీన వర్గాల ప్రజలు. నేరస్తులను శిక్షించడమనేది అనాదిగా వస్తున్నది.

నేరస్తులను కఠినంగా శిక్షించడం గురించి `మను' శాస్త్రంలో చెప్పారు. రెవెన్యూ బకాయిలను వసూలు చేయడానికి కూ డా వ్యక్తులను మధ్యయుగాల్లో చిత్రహింసలకు గురి చేసేవారు. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో కూడా ఈ పద్ధతులే అవలంబించారు. ఈ విషయం తెలుసుకోవడానికి ఇలియట్‌ అధ్యక్షతన బ్రిటిష్‌ ప్రభుత్వం 1984లో కమిటీని ఏర్పాటు చేసిం ది. భారతీయ శిక్షాస్మృతిలోని సె-330 లోని మూడు, నాలుగు ఉదాహరణలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. `ఎ' అనే ఉద్యోగి రెవెన్యూ బకాయిలను `జడ్‌' చెల్లించే విధంగా చిత్రహింసలకు గురిచేస్తే నేరం చేసినవాడవుతాడు. ఈ పని జమిందారు చేస్తే అతను నేరస్థుడవుతాడు. రెవెన్యూ బకాయిల గురించి ఇప్పుడు చిత్రహింసలు లేవు. కానీ కేసుల దర్యాప్తుల పేరు మీద వ్యక్తులను చిత్రహింసలకు గురి చెయ్యడం సర్వసాధారణమైపోయింది. ఈ చర్య లు `న్యాయాధిక్యం' ఉనికినీ దెబ్బ తీస్తున్నాయి.

డి.కె.బసు కేసు తీర్పు వెలువడిన తరువాత ఆ తీర్పుకి విస్తృతమైన ప్రచారం జరిగినా కూడా పోలీసుల ధోరణిలో మార్పు లేదు. తీర్పుల దారి తీర్పులదీ, పోలీసుల దారి పోలీసులదే. ఇందుకు కారణం పోలీసు శాఖలో ఈ ధోరణిని అరికట్టడానికి అవసరమైన యంత్రాంగంలేకపోవడం, చర్యలు తీసుకోవాలన్న సంకల్పం ప్రభుత్వ యంత్రాంగంలో లేకపోవడం. రాజకీయ నాయకుల ఉదాసీన వైఖరి. వీటన్నింటికి తోడు పోలీసుల దృక్పథాల్లో మార్పు రాకపోవడం. నేరస్థు డిని ఒప్పించి నేరాన్ని రుజువు చేస్తామనే ఆలోచన, దర్యాప్తులో అడ్డదారుల్లో ప్రయాణించడం! వీటిని నివారించడానికి కావలసింది సరైన శిక్షణ, జవాబుదారీతనం. ఇవి రెండూ ఉన్నప్పు డే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కావు. పోలీసుల్లో అమానుష వైఖరి పోవాలంటే సమాజంలో ఉన్న ఉదాసీన వైఖరి పోవాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Followers