Thursday, October 7, 2010

తలాక్ అంటే ఏమిటి?

తలాక్ అంటే ఏమిటి?
-రాజేందర్
September 14th, 2010

తలాక్ అన్న పదం మనకు చిరపరిచితమైనదే. ముస్లింలలో భర్తలు భార్యలకి విడాకులు ఇవ్వడం అతి సులువైనది. అది ఏకపక్షమైనది.
మన దేశంలో ముస్లింలు విడాకులు ఇవ్వడానికి నాలుగు రకాల పద్ధతులు వున్నాయి. ఈ నాలుగు పద్ధతులలో చాలా ప్రాచుర్యం పొందినది ‘తలాక్’
నాలుగు రకాల పద్ధతులేమిటి?
తలాక్: న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఎలాంటి కారణం తెలియజేయకుండా ఏకపక్షంగా భర్త ఇచ్చే విడాకులు. దానే్న సాధారణ పరిభాషలో తలాక్ అంటున్నాం.
నిర్మాణాత్మక విడాకులు: న్యాయస్థానంతో సంబంధం లేకుండా భర్త ప్రేరణతో నిర్మాణాత్మకంగా ఇచ్చే విడాకులు.
పరస్పర అంగీకార విడాకులు: న్యాయస్థానంతో సంబంధం లేకుండా భార్యా భర్తలిద్దరు పరస్పర అంగీకారంతో ముస్లింల వివాహాల రద్దు పరిచే చట్టం 1939 ఫ్రకారం తీసుకునే విడాకులు.
చట్టప్రకారం: ముస్లిం వివాహాల రద్దు పరిచే చట్టంలో పేర్కొన్న ఆధారాలు ప్రకారం ముస్లిం స్ర్తిలు తీసుకునే విడాకులు.
మొదట పేర్కొన్నవిడాకులనే తలాక్ అంటున్నాం. రెండవ రకం విడాకులు కొన్ని నీతి నియమాల ప్రకారం భర్త తీసుకునే విడాకులు. మూడవ రకం విడాకులు సనాతనంగా ముస్లింల చట్టంలో వున్నటువంటివి. నాలుగవ రకం పద్ధతి మాత్రమే న్యాయపరంగా వున్న విడాకులు. ఇది ముస్లిం వివాహ చట్టంలో పొందుపరచబడినది. ఈ చట్ట ప్రకారం ముస్లిం స్ర్తిలు విడాకులు తీసుకునే అవకాశం కల్పించబడింది. ఈ పద్ధతి ప్రకారం స్ర్తిలు మాత్రమే విడాకులు తీసుకోవడానికి వీలుంటుంది.
తలాక్ అంటే?
యుక్త వయస్కుడై స్థిరచిత్తం కలిగిన ఓ ముస్లిం పురుషుడైన ఎలాంటి కారణం చెప్పకుండా ఏకపక్షంగా తన భార్యకు విడాకులు ఇచ్చే పద్ధతిని తలాక్ అంటున్నాం. ముస్లిం పురుషులు ఏకపక్షంగా తమ భార్యలకు విడాకులు ఇచ్చే పద్ధతినే తలాక్ అంటున్నాం.
సున్నీ చట్ట ప్రకారం తలాక్ వౌఖికంగా వుండవచ్చు. రాతపూర్వకంగా వుండవచ్చు. షియా చట్ట ప్రకారం సమర్ధులైన ఇద్దరు సాక్ష్యుల సమక్షంలో తలాక్ ప్రకటన వౌఖికంగా వుండాలి. అసాధారణ పరిస్థితుల్లో అంటే భర్త వౌఖికంగా ఈ ప్రకటన చేసే వీలు లేనప్పుడు రాతపూర్వకంగా కూడా చేయవచ్చు.
తలాక్ ప్రకటించడానికి పద్ధతులేమిటి?
తలాక్ ప్రకటనని రెండు విధాలుగా ప్రకటించవచ్చు. మొదటిది ఆమోదించిన పద్ధతి. రెండవది ఆమోదించని పద్ధతి
ఆమోదించిన పద్ధతిలో మళ్లీ రెండు రకాల పద్ధతులున్నాయి.
అవి-
-సాధారణ పద్ధతి (అహసన్)
-అసాధారణ పద్ధతి (హసన్)
అసాధారణ పద్ధతిలో మళ్లీ ఎన్నో రకాలైన పద్ధతులున్నాయి. ఆమోదించిన పద్ధతి ప్రకారం భర్త తన భార్యకి విడాకులు ఇవ్వచ్చుననే మామూలు ప్రకటన సరిపోతుంది. తన ఉద్దేశాన్ని తెలియజేస్తే చాలు. ఆ ఉద్దేశాన్ని ఈ పద్ధతుల్లో తెలియజేయాల్సి వుంటుంది.
* తన భార్యకి విడాకులు ఇచ్చానన్న ప్రకటన భార్య ‘తుహ్రూ’ కాలంలో తెలియజేయాలి. ‘తుహ్రూ’ కాలం అంటే రెండు రుతుస్రావాల మధ్యకాలం. ‘ఇద్దక్’ కాలం అయిపోయే వరకు శారీరకంగా దూరంగా వుండాలి. ఈ ‘ఇద్దక్’ కాలం అయిపోయిన తరువాత విడాకులు ఫలవంతమవుతుంది. దాన్ని రద్దు పరచడానికి వీలుండదు. దీనే్న ‘అహసన్’ పద్ధతి అంటారు.
* వరసగా మూడు తుహ్రూ కాలంలో ఈ ప్రకటన చేసి వుండాలి. ఈ మూడు తుహ్రూ కాలాలలో శారీరకంగా దూరంగా వుండాలి. మూడవ ప్రకటనతో ఈ విడాకులు పూర్తవుతుంది. ఆ తరువాత దీన్ని రద్దు పరచడానికి వీలుండదు. దీనే్న ’హసన్’ పద్ధతి అంటారు.
* తుహ్రూ కాలంలో నేను విడాకులు ఇస్తున్నానని మూడుసార్లు ఒకేసారి ప్రకటించితే విడాకులు పూర్తి అవుతుంది. ఈ విధంగా కాకుండా ఒక తుహ్రూ కాలంలో మూడుసార్లు వేరువేరుగా ఈ ప్రకటన చేసినప్పుడు తలాక్ పూర్తవుతుంది.
* రద్దుపరిచే వీలు లేకుండా నీకు విడాకులు ఇస్తున్నాను అని ఒకేసారి ప్రకటించినప్పటికీ అది ఫలవంతమైన రద్దు పరచలేని విడాకులుగానే ముస్లింలు చట్టం పరిగణిస్తుంది.
తలాక్ గురించి మరికొన్ని విషయాలు
- భార్య విషయలో కూడా తలాక్ ప్రకటన భర్త చేయవచ్చు. అయితే విడాకులు ఇచ్చే ఉద్దేశ్యం స్పష్టంగా వుండాలి.
- భర్తకు భార్య తలాక్ పద్ధతిలో విడాకులు ఇవ్వడానికి వీల్లేదు.
- తలాక్ ఇచ్చే అధికారాన్ని భర్త ఇతరులకి కూడా సంక్రమింపచేయవచ్చు. అలా ఇచ్చినప్పుడు కూడా అవి సక్రమమైన తలాక్ అవుతుంది. తలాక్ ఇచ్చే అధికారాన్ని భర్త తన భార్యకు సంక్రమింపచేయవచ్చు.
- భవిష్యత్తులో జరగబోయే సంఘటనను దృష్టిలో పెట్టుకుని కూడా తలాక్ ప్రకటనని భర్తీ చేయవచ్

No comments:

Post a Comment

Followers