Tuesday, October 12, 2010

ఎలాంటి తప్పు లేకుండా విడాకులు

ఎలాంటి తప్పు లేకుండా విడాకులు
October 12th, 2010

హిందూ వివాహ చట్టప్రకారం దంపతుల్లోని ఎవరైనా వ్యక్తి విడాకులు పొందాలంటే

ఎదుటివ్యక్తి చేసిన తప్పిదం వుండాలి. అది చట్టం గుర్తించిన తప్పిదం అయి వుండాలి.

తామే తప్పుచేసి ఆ ఆధారంగా విడాకులు కోరడానికి అవకాశం లేదు. క్రూరత్వం,

వైవాహికేతర సంబంధాలు, విడిచిపెట్టి వుండటంలాంటివి వివాహ తప్పిదాలుగా చట్టం

గుర్తించింది.
వివాహ తప్పిదం వున్నపుడే విడాకులు తీసుకోవాలి అన్న సిద్ధాంతం కాలక్రమంలో

మారిపోయింది. ఎలాంటి తప్పిదం లేకున్నా విడాకులు పొందవచ్చన్న దిశగా చట్టం

మారింది. దంపతుల మధ్యన సరైన అవగాహన లేనప్పుడు కూడా విడాకులు

తీసుకోవచ్చన్నది కూడా ఒక ఆధారంగా పరిణమించింది.
వివాహ సంబంధాలు విఫలం కావడానికి ప్రతిసారి ఎదుటివారి వివాహ తప్పిదం

వుండాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్యన దంపతుల

మధ్యన అవగాహన లేకపోవడంవల్ల కూడా వివాహాలు విఫలం అవుతుంటాయి.

అన్ని ప్రయత్నాలు విఫలం అయినపుడు ఇలాంటి సందర్భం ఏర్పడుతుంది.
ఎదుటివారి తప్పిదం ఆధారంగానే దంపతుల మధ్యన వివాహాలని రద్దుచేసేవారు.

‘తప్పిదం’ సిద్ధాంతం ప్రకారం ఎదుటివ్యక్తి వివాహ తప్పిదం చేసినపుడే వివాహాన్ని

రద్దుచేసి విడాకులని మంజూరుచేసే పరిస్థితి చట్టప్రకారం వుంది. ఇలాంటి

సందర్భాలలో విడాకులు తీసుకోవడానికి భార్యాభర్తలు తప్పుడు ఆధారాలు,

ఆరోపణలు చేసి ఒకరికొకరు లాలూచీపడి విడాకుల కోసం దరఖాస్తులు చేసే పరిస్థితి

గతంలో వుండేది. వారు ఆ విధంగానే దరఖాస్తులు చేసుకునేవారు. ఒకరకంగా

చెప్పాలంటే లాలూచీపడి విడాకుల డిక్రీని పొందేవారు. దంపతుల్లో ఒక వ్యక్తి వివాహ

తప్పిదం చేసాడని మరో వ్యక్తి ఆరోపించడం, ఆ మరో వ్యక్తి దాన్ని అంగీకరించడం

ద్వారా విడాకుల డిక్రీలని పొందేవారు. ఎదుటివారి తప్పిదం లేకున్నా వివాహాన్ని

రద్దుచేసుకోవడానికి ఇద్దరూ లాలూచీపడేవారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి

చట్టంలో ‘సమ్మతితో విడాకులు’ అన్న సిద్ధాంతం ద్వారా కొత్త నిబంధనని

ఏర్పరిచారు. దీని ఉద్దేశం సచ్ఛీలతతో దంపతులు విడాకులు తీసుకోవాలి తప్ప

మోసపూరితంగా, లాలూచీతో విడాకులు పొందకూడదని, అంతిమంగా వాళ్ళు

పొందేది చట్టబద్ధమైనదైనా వారి దారి చట్టవ్యతిరేకంగా ఉండకూడదని చట్టం ఉద్దేశం.
‘సమ్మతితో విడాకుల’ సిద్ధాంతంవల్ల
వివాహ పవిత్రత దెబ్బతిన్నదా?
హిందూ వివాహాలు ఒప్పందంలాంటివి కాదు. అవి పవిత్రమైనవి. ‘సమ్మతితో

విడాకులు’ అన్న సిద్ధాంతం ద్వారా ఆ భావన నుంచి కొంత ప్రక్కకి వైదొలగడమే.

వివాహ ఒప్పందంలోకి దంపతులు రావడానికి ఎంత స్వేచ్ఛ వుందో అదేవిధంగా

వైదొలగడానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. దీనే్న ‘సమ్మతితో విడాకులు’ అంటారు.

ఉభయుల సమ్మతితో విడాకులు పొందే నిబంధనని చట్టంలో ఏర్పాటుచేయడంవల్ల

సంప్రదాయంగా వస్తున్న హిందూ వివాహాలు పవిత్రమైనవి అన్న భావనకి సమాధి

చేయడమేనని చాలామంది భావన.
ముస్లింలలో ఇలాంటి భావన వుందా?
ముస్లిం వివాహాలు ఒప్పందాలలాంటివి. వాటిని రద్దుచేసుకోవచ్చు. సమ్మతితో

వివాహాలని రద్దుచేసుకోవడం చాలా సులువు. ఉభయుల సమ్మతితో విడాకులు

పొందడానికి ముస్లిం లాలలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. అవి ‘ఖుల్లా’,

‘ముబ్బారత్’. ‘ఖుల్లా’ పద్ధతిలో వివాహం చేసుకోవాలన్న అభిప్రాయం భార్యనుంచి

వస్తుంది. ముబ్బారత్‌లో ఉభయులనుంచి వస్తుంది. ముస్లింలా అనేది కోడ్‌లాగా

మార్చలేదు. అందుకని న్యాయపరమైన డిక్రీ అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఒప్పందం

ద్వారా విడాకులు తీసుకుని దానికి ఖాజా ఆమోదముద్ర వుంటే సరిపోతుంది.
ప్రత్యేక వివాహ చట్టంలో ఇలాంటి భావన వుందా?
ప్రత్యేక వివాహ చట్టాన్ని 1954లో తయారుచేశారు. ఆ చట్టాన్ని తయారుచేసిన

సంవత్సరం తరువాత హిందూ వివాహ చట్టాన్ని తయారుచేశారు. హిందూ వివాహ

చట్టం ఒక్క హిందువులకే పరిమితం. ప్రత్యేక వివాహ చట్టం అన్ని మతాలవారికి

వర్తిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టంలో ఉభయుల సమ్మతితో

విడాకులు పొందడానికి అవసరమైన నిబంధనని ఏర్పరిచారు. హిందూ వివాహ

చట్టం ఆ తరువాత తయారుచేసినప్పటికీ హిందువులు ఈ నిబంధనని

అంగీకరించరు అన్న అభిప్రాయంవల్ల ఈ నిబంధనని హిందూ వివాహ చట్టాన్ని

తయారుచేసినపుడు ఏర్పరచలేదు. కానీ 1978లో ఈ నిబంధన అవసరమని భావించి

13(బి)ని ఏర్పరిచారు. ఈ నిబంధన ప్రగతిశీలమైనదని చాలామంది భావన. దీనివల్ల

తప్పుడు ఆరోపణలతో విడాకులు తీసుకోకుండా కలిసి జీవించి వుండలేని పరిస్థితుల్లో

ఈ నిబంధన ప్రకారం విడాకులు తీసుకోవటం సాధ్యమవుతుందని చాలామంది

వ్యక్తుల భావన.
క్రైస్తవులలో ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకోవచ్చా?
ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకునే అవకాశం క్రైస్తవులకి గతంలో లేదు.

కానీ 2001 సంవత్సరంలో విడాకుల చట్టం, 1869కి సవరణలు తీసుకొచ్చి సె.10ఎ

నిబంధనని చేర్చినారు. ఈ కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులుకూడా ఉభయుల

సమ్మతితో విడాకులు తీసుకోవచ్చు.
ఉభయుల సమ్మతితో విడాకులు తీసుకునే పద్ధతి అమల్లోకి రావడానికి చాలాకాలం

పట్టింది. సోవియట్ విప్లవం తరువాత అక్కడ ఈ పద్ధతిని ఏర్పాటుచేశారు. ఆ

తరువాత చైనా, బెల్జియమ్, నార్వే, జపాన్, పోర్చుగల్ దేశాలు ఈ నిబంధనని

చట్టంలో ఏర్పాటు చేసుకున్నాయి.
విడాకులకోసం దరఖాస్తు చేసుకున్న తరువాత
ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుని విడాకుల దరఖాస్తు చేసుకున్న దంపతులు

కూడా తమ దరఖాస్తులు విచారణలో ఉన్నపుడు వాటిని ఉభయుల సమ్మతితో

విడాకుల దరఖాస్తుగా మార్చుకునే అవకాశం వుంది. దీనివల్ల శత్రుభావంతో

విడిపోకుండా వుండే పరిస్థితి ఏర్పడుతుంది.

No comments:

Post a Comment

Followers