Thursday, October 7, 2010

రెండవ వివాహం - దాని పరిణామాలు

రెండవ వివాహం - దాని పరిణామాలు
లా ఇలా
August 17th, 2010

సె.494 ఐ.పి.సి ప్రకారం భార్యగానీ, భర్తగానీ బ్రతికి ఉండగా రెండో వివాహం చేసుకుంటే అది చట్టరీత్యా చెల్లనపుడు శిక్షార్హులౌతారు. వాళ్ళకు ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఇదివరకే వివాహం అయిందన్న విషయాన్ని మరుగుపరచి రెండో వివాహం చేసుకున్న వ్యక్తులను సె.495 ఐ.పి.సి ప్రకారం పది సంవత్సరాలు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.
ఈ నేరం ఋజువుకావాలంటే ఏ అంశాలని నిరూపించాల్సి ఉంటుంది?
ఈ నేరం ఋజువుకావాలంటే ప్రాసిక్యూషన్ ఈ నాలుగు షరతులను నిరూపించాల్సి ఉంటుంది. అవి-
1.మొదటి వివాహం సక్రమమైనదై వుండి, హిందూ వివాహ చట్టప్రకారం జరిగిందై వుండాలి.
2.ఆ వివాహం పార్టీల ఆచార వ్యవహారాల ప్రకారం ఉత్సవాల ప్రకారం జరిగి ఉండాలి.
3.ఆ వివాహంలోని దంపతులిద్దరూ హిందువులై వుండాలి.
4.రెండో వివాహం జరిగిన రోజున దంపతుల్లో ఎవరికైనా జీవించి వున్న భార్యగానీ భర్తగానీ ఉండి వుండాలి.
రెండో వివాహం ఎపుడు చెల్లదు?
రెండో వివాహం ఈ క్రింది రెండు అంశాలున్నప్పుడు చెల్లదు. ఆ అంశాలు-
* ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత అంటే మే 1955 తరువాత రెండో వివాహం జరిగి వుండాలి.
* ఆ వివాహ సమయంలో వివాహం చేసుకున్న పార్టీలలో ఎవరికైనా జీవించి వున్న భార్యగానీ భర్తగానీ వుండి వుండాలి.
శాస్త్రోక్తంగా వివాహం జరిగి వుండాలంటే...
ఈ నిబంధన వర్తించాలంటే పార్టీల మధ్య శాస్త్రోక్తంగా వివాహం జరిగి వుండాలి. శాస్త్రోక్తంగా వివాహం జరగడమనేది పార్టీల ఆచార వ్యవహారాలను బట్టి వుంటుంది.
హోమము, సప్తపది లేకుండా తాళికట్టినంత మాత్రాన అది శాస్త్రోక్తంగా వివాహం జరిగినట్టు కాదని కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. అయితే తెలంగాణలోని కొన్ని కులాల, ఆచారాల ప్రకారం హోమము, సప్తపది అవసరం లేదు. కానీ తాళికట్టడం, కంకణం కట్టుకోవడం వివాహంలో తప్పనిసరి.
వివాహానికి అవసరమైన ఉత్సవాలు, కార్యకలాపాలు రెండో వివాహానికి జరిగినట్లు రుజువైతేతప్ప ముద్దాయిలను శిక్షించడానికి వీల్లేదు. భార్య ఉండగా రెండో వివాహాన్ని భర్త చేసుకున్నప్పుడు, ఆ వివాహం చెల్లదు. గనుక రెండవ భార్య మళ్లీ ఇతరుల్ని వివాహం చేసుకున్నపుడు ఆమెను శిక్షించడానికి వీల్లేదు.
సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ప్రత్యేక ఉపశమనం చట్టం క్రింద రెండో వివాహాన్ని ఆపడానికి ఇంజెక్షన్ తీసుకోవడానికి ఈ చట్టం ఏ విధమైన ఆటంకం కల్పించడం లేదని అలా తీసుకోవడంవల్ల భవిష్యత్తులో పరిమాణాలని నిలుపుదల చేయవచ్చని పార్టీలు ఆ నిబంధన ప్రకారం, రెండో వివాహం చెల్లదని ప్రకటించేసేసి కోర్టులో దావావేయాల్సిన అవసరం వుండదని అందుకని కోర్టులో రెండో వివాహాలను నిలుపుదల చేయడానికి ఇంజెక్షన్ ఇవ్వడం సరైందని వివిధ హైకోర్టులు అభిప్రాయపడుతున్నాయి.
వివాహ షరతులు ఉల్లంఘిస్తే నేరమా? (సె.18)
కొన్ని వివాహ షరతులు ఉల్లంఘిస్తే వివిధ చట్టాల ప్రకారం నేరాలవుతాయి. భార్యగానీ, భర్తగానీ బ్రతికి వుండగా రెండో వివాహం చేసుకుంటే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరమవుతుంది. అలాగే బాల్య వివాహాలు, బాల్య వివాహాల నిరోధక చట్ట ప్రకారం నేరమవుతాయి. వివాహ సమయంలో వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు, వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినపుడు ఆచార వ్యవహారాలు అనుమతించనపుడు, నిషేధింపబడిన బంధుత్వాల మధ్య వివాహం చేసుకున్నా సపిండుల మధ్య వివాహం చేసుకున్నా హిందూ వివాహ చట్టప్రకారం నేరాలుగా పరిగణింపబడతాయి.
వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు, వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా వివాహం చేసుకున్న వ్యక్తులకి పదిహేను రోజుల వరకు సాధారణ జైలుశిక్షగానీ వెయ్యి రూపాయల వరకు జరిమానాగానీ లేక ఈ రెండింటినిగానీ కోర్టులు విధిస్తాయి. వధూవరులిద్దరికి మాత్రమే ఈ శిక్షలు విధిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ చట్టప్రకారం శిక్షార్హులు కాదు. వధూవరులిద్దరిలో ఎవరి ప్రోద్బలంతోనైతే వివాహం జరిగిందో వాళ్ళే శిక్షార్హులవుతారు. వధూవరులిద్దరు పైన చెప్పిన వయస్సుకన్నా తక్కువగా ఉన్నపుడు వివాహం జరిగినపుడు ఇద్దరికి శిక్ష విధించడం సాధ్యంకాదు. ఎందుకంటె అంతకన్నా వయస్సు తక్కువ ఉన్నపుడు వారి ప్రోద్బలం వున్నట్టుగా చట్టం భావించదు. ఇది ఆ చట్టంలో ఉన్న లోపం. అయితే ఇలాంటి వివాహాలు చేసుకున్న వరుడు బాల్య వివాహాల నిరోధక చట్ట ప్రకారం శిక్షార్హుడవుతాడు. అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకున్నట్టయితే, అతనికి పదిహేను రోజుల వరకు జైలుశిక్షగానీ జరిమానా గానీ లేక రెండూ గానీ విధించవచ్చు. ఒకవేళ వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండకముందు వివాహం చేసుకున్నట్టయితే అతనికి మూడు నెలలవరకు సాధారణ జైలుశిక్షగానీ జరిమానా గానీ కోర్టులు విధిస్తాయి. వరుడే కాకుండా ఈ వివాహాలని ప్రోత్సహించిన వ్యక్తులు కూడా శిక్షార్హులవుతారు.
ఆచార వ్యవహారాలు ఆమోదించినపుడు నిషేధించబడిన బంధుత్వాల మధ్య సపిండుల మధ్య వివాహాలు చేసుకున్న వ్యక్తులకి హిందూ వివాహాల చట్టప్రకారం నెల రోజులవరకు జైలు శిక్షగానీ వెయ్యి రూపాయల వరకు జరిమానాగాని రెండూగానీ విధించవచ్చు. *

*
*
*

No comments:

Post a Comment

Followers