Thursday, October 7, 2010

కుటుంబ న్యాయస్థానంలో విచారణ పద్ధతి

కుటుంబ న్యాయస్థానంలో విచారణ పద్ధతి
- రాజేందర్
September 21st, 2010

రోజురోజుకీ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగి పోతున్నాయి. పెళ్ళైన సంవత్సరంలోపే విడాకుల కోసం కోర్టులకి వస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. స్ర్తిలకి ఆర్థిక స్వాతంత్య్రం రావడమే దీనికి ప్రధాన కారణమన్న అపవాదు కూడా వుంది. కుటుంబంలో తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం కుటుంబ న్యాయస్థానాలని ఏర్పాటుచేసింది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం ఈ న్యాయస్థానాల ప్రధాన ఉద్దేశం. మన సమాజంలో కుటుంబానికి అత్యంత విలువ వుంది. అందుకని కుటుంబ జీవితాన్ని పరిరక్షించడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వాసం, నమ్మకం పెంచి కుటుంబ జీవితాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబంలో ఏదైనా వివాదం తలెత్తి కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వాసం సన్నగిల్లితే చట్టాన్ని ఉపయోగించుకోవాల్సి వుంటుంది. దీనికి అవసరమైన న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. సమాజంలో వున్న విలువలని కాపాడుతూ ఈ న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి.

కుటుంబ వివాదాలు పరిష్కారంవల్ల ఆ వివాదానికి పార్టీల వ్యక్తుల జీవితమే కాకుండా మొత్తం కుటుంబంలోని వ్యక్తుల జీవితాలని అది ప్రభావితం చేస్తుంది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చే తీర్పువల్ల సుదూర జీవితంలో కూడా ప్రభావితం వుంటుంది. ఉదాహరణకి- ఏదైనా నడవడిక క్రూరత్వం కాదని కోర్టు ప్రకటిస్తే, అలాంటి నడవడికని ఆ దంపతుల్లోని వ్యక్తి ఇంకా ఎక్కువ చేసే అవకాశం వుంది. వాళ్ళని ప్రోత్సహించినట్టుగా కూడా వుంటుంది- ఏదైనా నడవడిక అనేది క్రూరత్వం అవుతుందని కోర్టు ప్రకటిస్తే కుటుంబంలో ఒత్తిడి, సంఘర్షణ పెరుగుతుంది.

ఈ విషయాలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ వివాదాలని పరిష్కరించడానికి ఓ యంత్రాంగం అవసరమని శాసనకర్తలు భావించి కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
కుటుంబ వివాదాల పరిష్కారానికి కూడా ఈ చట్టంలో కొత్త పద్ధతులని ఏర్పాటుచేశారు. సాధారణ కోర్టులో వుండే పద్ధతికి భిన్నంగా ఈ కోర్టులు పనిచేసే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. పార్టీలకి న్యాయాన్ని అందించడానికి వీలుగా ఈ కోర్టులు తమ పద్ధతులని ఏర్పాటుచేసుకునే అవకాశం ఈ చట్టం కల్పించింది.

ఏ నిబంధన కొత్త పద్ధతిని ఏర్పాటు చేస్తున్నాయి?

కుటుంబ న్యాయస్థానాలు మామూలు కోర్టులకి భిన్నంగా పనిచేయాలి. పార్టీలకు సత్వర న్యాయాన్ని అందించాలి. అందుకని తమకు తోచిన పద్ధతిని ఏర్పాటుచేసుకోవడానికి ఈ చట్టంలో వున్న కొన్ని నిబంధనలు అవకాశం కల్పిస్తాయి. ఆ నిబంధనలు సె.10(3), సె.14, సె.15.
* సె.10 (3)- తమ ముందు విచారణలో వున్న ఏదైనా దావాని, ప్రొసీడింగ్స్‌ని లేదా ఏవైనా విషయాలని ఒక పార్టీ ఆరోపించి మరో పార్టీ ఖండించినప్పుడు వాటిని పరిష్కరించడానికి అవసరమైన స్వంత పద్ధతిని అవలంబించడానికి కుటుంబ న్యాయస్థానానికి ఎలాంటి ఆటంకం లేదు.
* సె.14- భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 ప్రకారం ఆమోదయోగ్యం కాని లేదా సంబంధితం కాని డాక్యుమెంట్లని, నివేదికలను, స్టేట్‌మెంట్లను కూడా సాక్ష్యంగా కుటుంబ న్యాయస్థానం స్వీకరించవచ్చు. అయితే అవి వివాదాన్ని సమర్థవంతంగా పరిష్కరించడానికి ఉపయోగపడాలి.
* సె.15- కుటుంబ న్యాయస్థానాల్లో విచారణలో వున్న దావాలని లేదా ప్రొసీజింగ్స్‌ని పరిష్కరించే క్రమంలో సాక్ష్యాలని సుదీర్ఘంగా నమోదు చేయాల్సిన అవసరం లేదు. సాక్షుల సాక్ష్యంలోని సారాంశాన్ని నమోదు చేసి సాక్షుల సంతకం తీసుకొని న్యాయమూర్తి సంతకం చేస్తే సరిపోతుంది.

వివాదాలు పరిష్కారానికి అవసరమైన పద్ధతులని ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. అయితే న్యాయవాదులు కోర్టుల ముందు హాజరుకావడానికి ఈ చట్టం నిరోధిస్తుంది. న్యాయవాదులు కుటుంబ న్యాయస్థానాలముందు హాజరుకావాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. అనుమతి తీసుకున్నప్పటికీ వాళ్ళు కోర్టు సహాయకులుగా మాత్రమే వ్యవహరించాలి తప్ప మామూలు కేసుల్లో మాదిరిగా తమ పార్టీల పక్షం వహించకూడదు.

మన దేశం బ్రిటీష్ వాళ్ళ అడ్వర్సరల్ సిస్టమ్‌ని పాటిస్తుంది. ఈ సిస్టమ్‌లో న్యాయమూర్తులు అంపైర్‌ల మాదిరిగా వుండాలి. క్రియాత్మకంగా వ్యవహరించకూడదు. తమ దగ్గరికి వచ్చిన సాక్ష్యాలని ఆధారం చేసుకొని తీర్పులని వెలువరించాల్సి వుంటుంది. అందువల్ల కొన్ని ఇబ్బందులు వున్నాయి. చట్టం వెసులుబాటు కల్పించినప్పటికీ ఈ పరిమితుల్లో పనిచేయాల్సిన పరిస్

No comments:

Post a Comment

Followers