Thursday, October 7, 2010

పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిదే

పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిదే
September 29th, 2010

దత్తత గురించి వివాదం తలెత్తినపుడు ఆ పిల్లవాడి సంరక్షణ స్వంత తల్లిపై ఉంటుందా లేక దత్తత తల్లిదండ్రులపై ఉంటుం దా? ఈ ప్రశ్నకి సమాధానాన్ని సుప్రీంకోర్టు రాజీవ్ భాటియా వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం మరి ఇతరులు (ఎ.ఐ.ఆర్.1999 సుప్రీంకోర్టు (3284) కేసులో చెప్పింది.
కేసు విషయాలు
తన కుమారుడు తన భర్త అన్న దగ్గర అక్రమ సంరక్షణలో ఉన్నాడని ఆ పిల్లవాడి స్వంత తల్లి రాజస్థాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ని దాఖలు చేసింది. రాజీవ్ భాటియా ఆ రిట్ పిటిషన్‌కి జవాబును దాఖలు చేశాడు. ఆ పిల్లవాడు స్వంత తల్లిదండ్రుల చేత తనకు దత్తత ఇవ్వబడినాడని జవాబులో పేర్కొన్నాడు. ఇరుపక్షాలవాదన విన్న తరువాత ఆ పిల్లవాడిని న్యాయమూర్తుల ఛాంబర్స్‌లో ప్రవేశపెట్టారు. ఆ పిల్లవాడిని న్యాయ మూర్తులు ప్రశ్నించారు. తాను స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నానన్న అభిప్రాయాన్ని ఆ పిల్లవాడు జడ్జిలకు కలుగజేశాడు. ఆ పిల్లవాడు దత్తత తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు ఆ పిల్లవాడు స్వంత తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలని ఆదేశించారు. దత్తత పత్రము సరియైనదే కాదా అన్న విషయం సివిల్ కోర్టులో తేలేదాకా ఆ పిల్లవాడు స్వంత తల్లి దగ్గరే ఉండాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశానికి వ్యతిరేకంగా రాజీవ్ భాటియా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆ పిల్లవాడిని పరీక్షించి మాట్లాడి తన తీర్పుని ప్రకటించింది. దత్తత పత్రము చెల్లుబాటు సివిల్ కోర్టులో తేలేవరకు ఆ పిల్లవాడు స్వంత తల్లిదగ్గరే ఉండటం సమంజసమని సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశము
రాజస్థాన్ హైకోర్టు ఈ కేసులో జారీచేసిన ఉత్తర్వులు సరైనవేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి వచ్చేముందు మేము ఇరుపక్షాల వాదనలని విన్నాము. వారి ఆరోపణలని ప్రత్యారోపణలని కూడా పరిగణనలోకి తీసుకొని వాటిలోని నిజానిజాలను తెలుసుకోవడానికి ఆ పిల్లవాడిని మా ఛాంబర్‌లో హాజరుపరచమని ఆ పిల్లవాడి స్వంత తల్లిని ఆదేశించాము. మా ఆదేశాలకు అనుగుణంగా ఆ పిల్లవాడిని మా ఛాంబర్‌లో ఆ తల్లి ప్రవేశపెట్టింది. ఆ పిల్లవాడు చాలా చిన్నపిల్లవాడు. అతను ఎలాంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చలేకపోయాడు కాని మా ప్రశ్నలకు అతని సమాధానాలని పరిశీలించిన అనంతరం అతడు స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నాడని అర్థవౌతుంది. అంతేకాదు దత్తత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లటానికి ఇష్టపడటంలేదన్న విషయం కూడా అర్థం అవుతుంది. దత్తత తల్లిదండ్రులు మా ఛాంబర్‌లో అతనితో మాట్లాడడానికి ప్రయత్నించినపుడు ఈ విషయం స్పష్టమైంది. అతను వాళ్ళతో మాట్లాడకపోవడమే కాకుండా వాళ్ళు కనిపించగానే ఏడ్వడం మొదలుపెట్టాడు. రాజీవ్ భాటియా న్యాయవాది గోబర్థన్ ఈ విషయాన్ని తప్పని ఆ తల్లి చేసిన ట్యూటరింగ్ వల్ల ఆ పిల్లవాడు ఆ విధంగా చేశాడని అతను గట్టిగా వాదించాడు. కాని మేము అతని వాదనతో ఏకీభవించడంలేదు. స్వంత తల్లి దత్తత తల్లిదండ్రులు న్యాయవాదులు లేనపుడు ఆ పిల్లవాడిని మేము మా ఛాంబర్లో ప్రశ్నించి కొన్ని సమాధానాలని రాబట్టుకున్నాము. ఆ సమాధానాల ఆధారంగా ఆ పిల్లవాడి ఆకాంక్షను మేము గమనించాము. అతను స్వంత తల్లిదగ్గరే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ కారణాలవల్ల అతను స్వంత తల్లి సంరక్షణలో ఉండటం సమంజసం. అందుకని రాజస్థాన్ జారీ చేసిన ఉత్తర్వు సరియైనదేనని మేము భావిస్తున్నాము. ఆ దత్తత పత్రము చెల్లుబాటయ్యే దత్తత పత్రమా కాదా అన్న విషయం సివిల్ కోర్టులో తేలేవరకు ఆ పిల్లవాడు స్వంత తల్

No comments:

Post a Comment

Followers