Thursday, October 7, 2010

విడాకులు పొందిన స్ర్తి.. కిరాయి హక్కులు

విడాకులు పొందిన స్ర్తి.. కిరాయి హక్కులు
October 6th, 2010

భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తినపుడు విడాకులు తీసుకుంటారు. కొంతమంది పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటారు. ఈ విధంగా విడాకులు తీసుకున్న భార్యలకి భర్త ఆస్తుల మీద ఎలాంటి హక్కులు వుండవు. ఆమె శాశ్వత మనోవర్తి కోసం ఎలాంటి భరణం ఇవ్వనపుడు ఆమె భరణం కోరే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆస్తుల విషయంలో హక్కులు వుండవు. కొన్ని సందర్భాలలో భర్త అద్దెకు తీసుకున్న ఇంటిలో భార్య అద్దె వుంటే పరిస్థితి వుంటుంది. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని దరఖాస్తు చేసినపుడు ఆ ఇంటిలో ఆ భార్యకి కిరాయిదారుకు వుండే హక్కులువుంటాయా? ఆ కేసులో ఆమె అవసరమైన పార్టీ అవుతుందా? విడాకులు పొందిన స్ర్తి తన భర్త కిరాయి హక్కులను పొందే అవకాశం వుందా?

ఈ ప్రశ్నకి సమాధానం సుప్రీంకోర్టు రూమా చక్రవర్తి వర్సెస్ సుధారాణి బెనర్జీ ఇతరులు (2005 (8) సుప్రీంకోర్టు కేసెస్ 140) కేసులో సమాధానాలు చెప్పింది. మాజీ భర్త కిరాయి హక్కులలో మాజీ భార్యకు ఎలాంటి హక్కు వుండదని సుప్రీంకోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది.

కేసు విషయాలు
‘ఏ’ భార్య ఆమె వివాహం ‘బి’ భర్తతో జరిగింది. వారిద్దరిమధ్య విభేదాలు తలెత్తి చివరికి హిందూ వివాహ చట్టంలోని సె.13 బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక కిరాయి ఇంటిలో వుండేవాళ్ళు. విడాకులు మంజూరైన తరువాత భర్త వేరే ఇంటిలో కాపురం వుండటం మొదలుపెట్టాడు. భార్య తన పిల్లలతో భర్త కిరాయికు తీసుకున్న ఇంటిలో వుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ‘బి’ భర్తపైన ఇల్లు ఖాళీ చెయ్యమని దరఖాస్తు దాఖలు చేసింది. ‘బి’ తన ఇంటిని కిరాయికు తీసుకొని ఒక అపరిచితురాలికి కిరాయికు ఇచ్చిన కారణంగా ఇల్లు ఖాళీ చెయ్యాలని ఆమె తన దావాలో పేర్కొంది.
‘బి’ తన జవాబుని దాఖలు చేశాడు. తన పిల్లలు ఆ ఇంటిలో నివశిస్తున్నారని, ‘ఏ’ తన పిల్లల తల్లిగా వాళ్ళ సంరక్షకురాలిగా వుంటుందని, అంతేకానీ ఆమె కిరాయిదారు కానీ ఉప కిరాయిదారు కాదని తన జవాబులో ‘బి’ పేర్కొన్నాడు. అంతేకాదు ఆ ఇల్లు తన స్వాధీనంలోనే వుందని తన పిల్లలు ఆ ఇంటిలో వుండే అధికారం కలిగి వున్నారని కూడా తన జవాబులో పేర్కొన్నాడు.
అతని భార్య ‘ఏ’ కూడా ఆ దావాలో ఒక దరఖాస్తుని దాఖలు చేసింది. తాను ఆ కేసులో అవసరమైన పార్టీ అని తనకు కూడా కిరాయిదారుకు వుండే హక్కులు వున్నాయని అందుకని ఆ కేసులో తనని కూడా పార్టీ చెయ్యాలని దరఖాస్తు చేసుకుంది. సివిల్ కోర్టు ఆమె దరఖాస్తుని త్రోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులకి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టులో దరఖాస్తుని దాఖలు చేసింది. కలకత్తా హైకోర్టు సివిల్ కోర్టు ఉత్తర్వునే సమర్థించింది. హైకోర్టు ఉత్తర్వులకి వ్యతిరేకంగా ‘ఏ’ సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది.
మాజీ భార్యకి మాజీ భర్త ద్వారా కిరాయి హక్కులు సంక్రమిస్తాయా? ‘ఏ’ అనే వ్యక్తి అవసరమైన పార్టీ అవుతుందా? ఇది సుప్రీంకోర్టు ముందు తలెత్తిన ప్రశ్న.
సుప్రీంకోర్టు తీర్పులోని సారాంశం.. కిరాయికి తీసుకున్న ఇల్లు తన స్వాధీనంలో ఉందని తన మాజీ భార్య తన పిల్లలకి సంరక్షకురాలిగా మాత్రమే ఆ ఇంట్లో వుంటుందని కానీ కిరాయిదారుగా ఉప కిరాయిదారుగా కాదని ‘బి’ కోర్టు ముందు వాదించాడు. మాజీ భర్త కేసుని ఎదుర్కొంటున్నాడు కాబట్టి అతని మాజీ భార్య ఈ కేసులో అవసరమైన పార్టీ కాదని ఆ ఇంటి యజమాని సుప్రీంకోర్టు ముందు వాదించింది.
సుప్రీంకోర్టు ‘ఏ’ దాఖలుచేసిన అప్పీలుని డిస్మిస్ చేస్తూ ఈ విధంగా తీర్పుని ప్రకటించింది.
*ఈ కేసులో మూల కిరాయిదారు కేసును ఎదుర్కొంటున్నాడు. మైనర్ పిల్లల ప్రయోజనాలని అతను పట్టించుకుంటున్నాడు. అందుకని అతని మాజీ భార్యకి ఈ కేసులో స్థానం లేదు. అందుకని ఆమె ఈ కేసులో అవసరమైన పార్టీ కాదు.
భర్తను వదిలిపెట్టిన భార్య స్థానం విడాకులు పొందిన భార్య స్థానం వేరువేరుగా వుంటాయి. భర్తను వదిలిపెట్టిన భార్య ఇంటిలో వుండే అవకాశం వుంటుంది. విడాకులు తీసుకున్న భార్య ఇంటిలో వుండే అవకాశం లేదు. ఎందుకంటే విడాకులు అనేవి వైవాహిక జీవితానికి ముగింపు వంటివి. నివాసంలో వుండే అధికారం విడాకుల డిక్రీ ప్రకారం వుంటుంది. ఈ కేసులో ‘ఏ’ తన మనోవర్తి హక్కుని వదులుకుంది. పిల్లల్ని పెంచే హక్కుని తీసుకుంది. ఈ కారణంగా ఆమెకు తన మాజీ భర్త ఇంటిలో వుండే అవకాశం లేదు. అందుకని దావాలో ఆమె అవసరమైన పార్టీ కాద

No comments:

Post a Comment

Followers