Thursday, October 7, 2010

మోసపోయిన వ్యక్తి వివాహన్ని రద్దు చేసుకోవచ్చు

మోసపోయిన వ్యక్తి వివాహన్ని రద్దు చేసుకోవచ్చు
August 24th, 2010

దంపతుల్లో ఎవరైనా తమకు సంబంధించిన ముఖ్య విషయాలు చెప్పకుండా ఎవరైనా వివాహం చేసుకుంటే ఆ విధంగా మోసపోయిన వ్యక్తి ఆ వివాహం రద్దు చేయమని కోరే అవకాశం వుంది. హిందూ వివాహ చట్టంలోని సె.12(సి) ప్రకారం దరఖాస్తుని దాఖలు చేయవచ్చు.
ఆ నిబంధన ఈ విధంగా చెబుతుంది- ప్రతివాదికి సంబంధించిన ముఖ్య విషయాలను కప్పిపుచ్చి వాది సమ్మతిని పొందినప్పుడు, అదేవిధంగా- బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి రాకపూర్వం జరిగిన వివాహాల్లో వాది మైనరైనప్పుడు సంరక్షకుని సమ్మతిని బలప్రయోగం ద్వారా, మోసం ద్వారా పొందినప్పుడు వాది ఆ వివాహం రద్దు చేయమని కోర్టులో దరఖాస్తు దాఖలు చేయవచ్చు.
***
సంవత్సరంలోగా పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టులు పరిశీలిస్తాయి. ఆ తరువాత దాఖలు చేసిన పిటిషన్లని బలప్రయోగం తొలగిపోయిన తర్వాత, మోసం తెలిసిన తరువాత వాది ప్రతివాదితో పూర్తి సమ్మతితో కాపురం చేసినప్పుడే కోర్టులు ఆ వివాహాన్ని రద్దు పరచవు.
ఈ నేపధ్యంలో- గుల్లపల్లి సౌర్యరాజ్ వర్సెస్ బండారు పావనిని అలియాస్ గుల్లపల్లి పావని, ఎఐఆర్ 2009 సుప్రీంకోర్టు 1085 కేసుని చూద్దాం.
తన సాంఘిక హోదా అంటే మతం ఏమిటో తెలియజేయకుండా ఎవరైనా హిందువులని హిం దూ పద్ధతుల ప్రకా రం చేసుకున్నప్పటికీ ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? ప్రతివాదికి తనకు సంబంధించిన ము ఖ్యవిషయం మరుగుపరిచి వివాహం చేసుకున్నట్టుగా వాది భావించి వివాహాన్ని రద్దు చేయమని కోరే అవకాశం ఉంటుందా?
దీనికి సమాధానం తెలుసుకోవాలంటే గుల్లపల్లి సౌవురియారాజ్ వర్సెస్ బండారు పావని ఎలియాస్ గుల్లపల్లి పావని (ఎఐఆర్ 2009 సుప్రీంకోర్టు 1085)లోని విషయాలను పరిశీలించాలి.
సౌవర్యారాజ్ రోమన్ కాథలిక్. అతను పావనని 24-10-1996 రోజున హిందువుల ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహంలో అతను ఆమెకు తాళి కట్టాడు. ఇరుపక్షాల బంధువులు తల్లిదండ్రులు ఎవరూ ఆ వివాహానికి హాజరు కాలేదు.ఆ తర్వాత 2-11-1996రోజున ఆ వివాహాన్ని హిందూ వివాహాల చట్టం, 1955లోని సె.8 ప్రకారం రిజిస్టర్ కూడా చేయించారు.
తేదీ 13-3-1997 రోజున ప్రతివాది (్భర్య) విశాఖ పట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు దాఖలు చేసి వివాహాన్ని రద్దు చేయమనికోరింది. వాదికి (సౌర్యరాజ్)కి సంబంధించిన ముఖ్య విషయాలు మరుగుపరిచినాడని అందుకని తమ వివాహాన్ని హిందూ వివాహ చట్టంలోని సె.12(1)(సి) ప్రకారం రద్దు చేయాలని ఆమె కోరింది. ఆమె దరఖాస్తుని కుటుంబ న్యాయస్థానం కొట్టివేసింది. ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది.
అప్పీలుని విచారించిన హైకోర్టు, ఆమె దాఖలు చేసిన అప్పీలుని ఆమోదించింది. హిందువుకి, క్రిస్టియన్‌కి జరిగిన వివాహం ప్రాధమికంగానే హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని పేర్కొంటూ వారి వివాహాన్ని 12-9-2002 రోజున రద్దు చేసింది.
ఆ తరువాత పావని డాక్టర్ ప్రవీణ్‌ని 23-1-2003రోజున వివాహం చేసుకుంది. హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సౌర్యరాజ్ 23-4-2003 రోజున స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేసాడు. సుప్రీంకోర్టు దాన్ని సివిల్ అప్పీలు నెం.2446/2005గా స్వీకరించి విచారించింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశం
సౌర్యరాజ్ రోమన్ కాథొలిక్. పావని హిందువు. వారి వివాహం హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగింది. ఆ తరువాత వారి వివాహం సె.8 ప్రకారం రిజిస్టర్ అయింది. అయినా కూడా అది చెల్లదు. అందుకని వారి వివాహాన్ని హైకోర్టు రద్దు చేయడం సమంజసమే. అందులో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. వీరి వివాహం చెల్లనప్పుడు పావని తిరిగి వివాహం చేసుకున్నప్పటికీ దానికి విలువలేదు. అందుకని ఆమె రెండవ వివాహం గురించి ఏమీ చెప్పలేం. దాఖలు చేసిన అప

No comments:

Post a Comment

Followers