Friday, February 20, 2009

21-2-09 suryaa

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సవరణలు) మేలు చేసే నిబంధనలు


క్రిమినల్‌ ప్రొిసీజర్‌ కోడ్‌ (సవరణల) బిల్లు, 2008 చట్ట రూపంగా మారిన తర్వాత ఆవిషయమై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ప్రబలుతోంది. అరెస్టు గురించి ఈ చ…ట్టం ద్వారా చేసిన సవరణల వల్ల ప్రస్తుతం అమల్లోవున్న పద్ధతులన్నీ తారుమారవుతాయని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఈ చ…ట్టం ద్వారా వచ్చిన చాలా నింబంధనలను, అరెస్టుకు సంబంధించిన నిబంధనలను పోలీసులు వ్యతిరేకిస్తున్నారు.

న్యాయవ్యాదులయితే ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కోర్టుపని మానివేసి ఉరేగింపులు తీస్తున్నారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనల బాగోగులగురించి వాటి ఫలితాల గురించి గతంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. ప్రభుత్వం తేదీని ప్రకటించిన తర్వాత అవి అమల్లోకి వస్తాయి. గతంలో 2005, 2006 సంవత్సరాల్లో కూడా క్రిమినల్‌ ప్రొిసీజర్‌‌‌ కోడ్‌కు ప్రభుత్వం సవరణలను తీసుకువచ్చింది. వాటిలోని చాలా „సవరణలు ప్రభుత్వం తేదీ ప్రకటించక పోవడం వల్ల అమల్లోకి రాకుండా అట్లాగే ఉండిపోయాయి. 2008లో చేసిన సవరణల్లో కొన్ని మంచి సవరణలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బాధితుని గురించిచేసిన సవరణలు, తయారు చేసిన కొత్త నిబంధనలు. దేశ వ్యాప్తంగా ఎదురవుతున్న వ్యతిరేకత వల్ల ఈ నిబంధనలు అమల్లోకి రావేమోనన్న సందేహం కూడా కలుగుతోంది.

నేరన్యాయ వ్యవస్థ బాధితులను పట్టించుకోలేదని వారి గురించి ఆలోచించలేదని చాలా కాలంగా విమర్శ ఉంది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. క్రిమినల్‌ ప్రొిసీజర్‌ కోడ్‌లో బాధితులకి సష్టపరిహారం చెల్లించడానికి. సె-357 అన్న నిబంధన ఉంది. ఈ నిబంధన బాధితుల అపసరాలని పూర్తిగా తీర్చడం లేదు. ఈ విషయాన్ని గురించి ఈ కొత్తచట్టం ద్వారా సె-357(ఎ) చేర్చారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే బాధితులకు మంచి జరిగే అవకాశం ఏర్పడుతుంది. అమల్లో ఉన్న సె-357 ప్రకారం కోర్టుల ద్వారా నేరబాధితులకు కొంత మేరకు మాత్రమే నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంది. ఆ విధంగా సె-357 ప్రకారం సష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ముద్దాయికి లేకపోతే కోర్టులు ఏంచేయగలిగేవి కావు. అయితే కొత్తగా చేర్చిన సె-357(ఎ) ద్వారా ఈ పరిస్థితి మారే అవకాశం ఏర్పడుతుంది. నేరం విచారణ జరిగిన త…రువాత ముద్దాయికి శిక్షపడినప్పుడు మాత్రమే కోర్టులు సె-357 ప్రకారం నష్టపరిహారం మంజూరుచేసే అవకాశం ఉంది.

ముద్దాయికి శిక్ష పడన…ప్పుడు, అట్లాగే అతన్ని నేరం నుంచి తప్పించినప్పుడు బాధితులకు కోర్టులు నష్టపరిహారం మంజూరు చేసే అవకాశం లేదు. ముద్దాయి దొరకకపోతే, ముద్దాయిని గుర్తించకపోతే నష్టపరిహారం చెల్లించే పరిస్థితేలేదు. ఈ సాధక బాధకాలను పరిశీలించి కొత్త చట్టం ద్వారా సె-357(ఎ)ని చేర్చారు. హడావిడిగాసవరణల చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీి దీనిద్వారా కొంత మేరకు బాధితులకు లాభం జరిగే అవకాశం ఉంది. సె-357(ఎ)లో ఏమిచెప్పారో చూద్దాం.సె-357(ఎ) ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి ఒక స్కీమును ప్రభుత్వం ఏర్పటుచేయ్యాలి. ప్రతిరాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వ సహకారంలో విధిగా స్కీములు ఏర్పాటు చేయాలి.

నేరబాధితులకు వారిపై ఆధారపడ్డ వ్యక్తులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి, వారికి పునరావాసం కల్పించే విధంగా ఈ స్కీమును తయారు చేయాలి. కోర్టులో నేరƒ విచారణ పూరె్తైన తర్వాత నేరƒబాధితుల పునరావాసానికి అవసరమైన నష్టపరిహారాన్ని కోర్టులు సె-357 ప్రకారం చెల్లించమని ఆదేశించే అవకాశం ఉంది. ఒక వేళ ఆవిధంగా అదేశించిన మొత్తం బాధితుల పునరావాసానికి సరిపోదని కోర్టు భావించినప్పుడు వాళ్లకి తగిన నష్టపరిహారం చెల్లించమని సిఫారసు చేసే అవకాశం ఉంది. ఈ సిఫారసును కోర్టులు జిల్లా న్యాయసేవాధికార సంస్థకు గాని లేదా రాష్టన్య్రాయసేవాధికార సంస్థకి గాని చేయాల్సి ఉంటుంది. ఆ సిఫారసు అందిన తర్వాత ఆ సంస్థలు బాధితుల పునరావాసానిి అవసరమైన నష్టపరిహార మొత్తాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ముద్దాయిలపై ఉన్న కేసులను కొట్టివేసినప్పుడు, అట్లాగే వాళ్ళని విముక్తం చేసినప్పుడు కూడా కోర్టులు నష్టపరిహారం చెల్లించమని సిఫారసుచేసే అవకాశం ఉంది.

కొన్ని సందర్భాలలో ముద్దాయి దొరకకపోవచ్చు. అతణ్ణి గుర్తించలేకపోవచ్చు. విచారణ జరగకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో నేరబాధితులుగాని వారిపై ఆధారపడిన వ్యక్తులుగానీ నేరుగా రాష్టన్య్రాయసేవాధికార సంస్థకుగాని లేదా జిల్లా న్యాయసేవా ఆధికార సంస్థకు గానీ నష్టపరిహారం కోసం దరఖాస్తుచేసుకోవచ్చు. కోర్టునుంచి సిఫారసు అందినప్పుడు లేదా బాధితులనుంచి నేరుగా దరఖాస్తు అందినప్పుడు వాటి గురించి విచారణ జరిపి అవసరమైన నష్టపరిహారాన్ని నిర్ధారించి అవార్డు రూపంలో ఆ సంస్థలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ పనిని ఆ సంస్థలు విధిగా రెండు నెలల లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది. బాధితుల బాధను తగ్గించడానికి వారికి అవసరమైన ప్రథమ చికిత్సను, ఇతర వైద్యసదుపాయలను ఉచితంగా అందించడానికి న్యాయసేవాధికార సంస్థలు ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు జారీచేసే ముందు ఆ సంస్థలు సంబంధిత మేజిస్ట్రేట్‌ నుండి కాని పోలీసు ఆధికారులనుండి కాని ఒక సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సందర్భాలలో తాత్కాలిక సహాయాన్ని కూడా ఈ సంస్థలు అందచేసే అవకాశం ఉంది.

ఈ నిబంధనే కాకుండా క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని సె-372కు అనుబంధంగా ఒక ప్రొవిజన్‌ను కూడా ఈ చట్టం ద్వారా చేర్చారు. దీని ప్రకారం కోర్టులు ముద్దాయిని విడుదల చేసినప్పుడు లేదా వారికి తక్కువ శిక్ష విధించినప్పుడు అట్లాగే బాధితులకు తక్కువ నష్టపరిహారం మంజూరు చేసినప్పుడు బాధితులు అప్పీలుచేసే అవకాశం ఉంది.ఈ కొత్త మార్పుల వల్ల నేర బాధితులకు మేలు జరిగే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నేర బాధితులను చట్టం గుర్తించినట్లుగా అనిపిస్తుంది. అరెస్టు విషయంలో ఉత్పన్నమైన వ్యతిరేకత వల్ల ఈ నిబంధనలు కూడా అమల్లోకి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అరెస్టు నిబంధనలకు తీసుకొచ్చిన సవరణలను తప్పకుండా వ్యతిరేకించాల్సిందే. అయితే మంచి చేసే అవకాశం ఉన్న నిబంధనలు ఆ వ్యతిరేకతల వల్ల కొట్టుకుపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మరీముఖ్యంగా న్యాయవాదులపై. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న చట్టాన్ని ఎలాంటి చర్చ జరప కుండా ఆదరా బాదరాగా ప్రభుత్వం ఎందుకు తయారు చేసిందో అర్థంకాదు. ఇప్పటికైనా విజ్ఞతతో విచారించి ప్రజలకు మేలుచేసే నిబంధనలను అమల్లోకి తేవాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers