Tuesday, March 2, 2010

విడాకులకు క్రూరత్వమూ ఒక కారణమే!

March 3rd,2010

హిందూ వివాహ చట్టానికి 1976లో మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులకన్నా ముందు ‘క్రూరత్వం’ అనేది విడాకులు పొందడానికి ఒక ఆధారం కాదు. ఈ 1976లో తీసుకొచ్చిన సవరణల ప్రకారం విడాకులు పొందడానికి క్రూరత్వం అనేది కూడా ఒక ఆధారం అయ్యింది. అంతకుముందు అది న్యాయ నిర్ణయ వేర్పాటు పొందడానికి మాత్రమే ఆధారం. సె.10 (బి) (1) ప్రకారం ‘న్యాయ నిర్ణయ వేర్పాటు’ క్రూరత్వం ఆధారంగా విడాకులు పొందే అవకాశం వుండేది. వాదికి సహేతుకమైన భయాందోళనలను కలిగించి ప్రతివాదితో కలిసి జీవించడం హానికరంగా గానీ లేక అపాయకరంగాని ఆ క్రూరత్వం వుండాలి. అలాంటి పరిస్థితులు వుంటేనే న్యాయ నిర్ణయ వేర్పాటు పొందే అవకాశం వుండేది.

1976లో సవరణలు తీసుకొచ్చిన తరువాత హిందూ వివాహ చట్టంలో సె.13 (జ)(ఎ)ని చేర్చినారు. ప్రతివాది వాదితో వివాహం తరువాత క్రూరత్వంతో ప్రవర్తిస్తే విడాకులు పొందడానికి అవకాశం ఈ కొత్త నిబంధన ద్వారా ఏర్పడింది.
‘క్రూరత్వం’ అనే పదానికి విస్తృతమైన అర్ధం, పరిధి వుంది. దీనిలో రెండు స్పష్టమైన అంశాలు వున్నాయి. అవి-

* కష్టపెడుతున్నాడన్న ఫిర్యాదు వుండాలి.
* దాని ఫలితంగా భయంగానీ లేక ఆపదగానీ వుండాలి.
భయంవల్ల వారిద్దరూ కలిసి జీవించడం వల్ల హాని లేక అపాయం గానీ వుండాలి. అవే చర్యలుగానీ అలాంటి చర్యలుగానీ తిరిగి జరుగుతాయన్న భయం వుండాలి.

క్రూరత్వాన్ని విధంగా నిర్థారిస్తారు?

పార్టీల జీవన సరళిని బట్టి క్రూరత్వాన్ని నిర్థారించాల్సి వుంటుంది. కేసు విషయాలని బట్టి, చట్టాన్ని బట్టి నిర్థారించాల్సి వుంటుంది. దీన్ని కోర్టు ముందు రుజువు చేయడానికి ఎలాంటి కొలమానాలు లేవు. అందుకని పార్టీల జీవన సరళి, వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే పద్ధతి, వారి స్వభావాలని సంస్కృతి, దేహ నిర్మాణాన్ని బట్టి, ఇంకా కేసులోని ఇతర విషయాలను బట్టి క్రూరత్వాన్ని నిర్థారించాల్సి వుంటుంది. శారీరక, మానసిక హింస కూడా కోర్టులు పరిశీలిస్తాయి. క్రూరత్వానికి పాల్పడుతున్న వ్యక్తివల్ల ఇంకో వ్యక్తి పొందే శారీరక, మానసిక క్రూరత్వాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. శారీరకంగా జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా క్రూరత్వం కిందకి వస్తాయా అన్న విషయం ఇతర విషయాలను బట్టి వుంటుంది. పార్టీల వయస్సు, జీవనసరళి, హోదా, వారు నివశిస్తున్న వాతావరణం ఇలాంటి విషయాలను బట్టి నిర్థారించాల్సి వుంటుంది. కేసులోని అన్ని విషయాలను గమనించి క్రూరత్వం గురించి కోర్టు ఒక భావనకి రావాల్సి వుంటుంది.

క్రూరత్వానికి సంబంధించి ప్రముఖమైన కేసు ఏమిటి?

క్రూరత్వానికి సంబంధించి ప్రముఖమైన కేసు దస్తానే వర్సెస్ దస్తానే (ఎ.ఐ.ఆర్.1975 సుప్రీంకోర్టు 1534) ఈ కేసు ‘న్యాయ నిర్ణయ వేర్పాటు’కి సంబంధించినది. అయితే ఇది విడాకుల కేసుకి కూడా వర్తిస్తుంది.
ఈ కేసులోని భార్యాభర్తల మధ్య 1956లో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. ఇద్దరు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు. చాలా అర్హతలు వున్న వ్యక్తులు. వారికి ముగ్గురు కూతుర్లు కలిగారు. 1961లో ఇద్దరికీ అభిప్రాయభేదాలు వచ్చాయి. వారిద్దరూ కలిసి జీవించి వుండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తరాలు రాసుకోవడం ఇద్దరికీ చాలా ఇష్టమైన పని. వారిద్దరిమధ్య సంభాషణలు లేకుండా పోయి ఉత్తరాల ద్వారా మాత్రమే సంభాషించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రతివాది తనభర్త పట్ల క్రూరంగా వ్యవహరించిందని ఆ ఉత్తరాల ద్వారానే రుజువైంది. ఆమె తప్పిదాలు కోకొల్లలు. మచ్చుకు కొన్ని-

-అత్తగారు చాలా మోటు మనిషని భార్య తరుచూ అనేది. అదేవిధంగా భర్త పూర్వీకులని శ్రద్ధాంజలి రోజు తిట్టేది.
- పిల్లకి 104 డిగ్రీల జ్వరం వున్నపుడు ఆమెను కొట్టింది.
- అర్ధరాత్రి పూట లైట్లు వేసి రాత్రంతా భర్తతో నసపెట్టేది. ఫలితంగా భర్త ఎన్నోసార్లు తలదించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ముగ్గురు న్యాయమూర్తుల బెంచి తరఫున న్యాయమూర్తి చండ్రచూడ్ తీర్పుని ఈ విధంగా వెలువరించారు.
‘‘... ఇలాంటి ఆక్రోశాలు వెళ్ళగక్కడం వైవాహిక జీవితంలో జరుగుతుంటాయి. కాని అవి నిరంతరాయంగా జరగడంవల్ల ఇంటిలో ప్రశాంతత పోతుంది. వైవాహిక జీవితంలోని న్యాయబద్ధమైన మధురిమ పోతుంది. కొన్ని సందర్భాలలో ఏవైనా అనాల్సి రావచ్చు కానీ ప్రతివాది ప్రవర్తన మరీ ఎక్కువగా వుంది. ఆమె నడవడిక క్రూరత్వంగానే పరిగణించాల్సి వస్తుంది. ప్రవర్తన ద్వారా వాది ఆమెతో కలిసి జీవించడం కష్టం.
కోర్టు ఈ కేసులో ప్రతివాది క్రూరత్వం వుందన్న నిర్థారణకి వచ్చి న్యాయనిర్ణయ వేర్పాటు డిక్రీని మంజూరు చేసింది.
క్రూరత్వంలో మానసిక క్రూరత్వం కూడా వు

No comments:

Post a Comment

Followers