Wednesday, March 10, 2010

న్యాయపరమైన క్రూరత్వం

March 9th, 2010

‘క్రూరత్వాన్ని’ నిర్వచించలేదు. రాయల్ కమిషన్ (1956)లో క్రూరత్వం గురించి ఈ విధంగా పరిశీలించింది.
‘‘క్రూరత్వాన్ని నిర్వచించకుండా అదేవిధంగా వుంచడం అవసరం. ఎందుకంటే విభిన్న తరగతుల మధ్యన క్రూరత్వం విభిన్నంగా వుంటుంది’’.
క్రూరత్వం అనేది కేసు స్వభావాన్ని బట్టి మారుతుంది. కేసు నేపథ్యాన్ని బట్టి, సాక్ష్యాలను బట్టి కోర్టులు క్రూరత్వాన్ని అంచనావేయాల్సి వుంటుంది. వైవాహిక కేసులు చాలా సున్నితమైనవి. ప్రతి కేసు దానికదే ప్రత్యేకంగా వుంటుంది. ఒక కేసులో క్రూరత్వం అనేది మరో కేసులో క్రూరత్వం కాకపోవచ్చు. అందుకని క్రూరత్వాన్ని ఎప్పుడు ఒకే విధంగా చూడలేం.
వాదికి జీవితానికి వున్న హాని, ఆపదని బట్టి క్రూరత్వాన్ని చూడాల్సి వుంటుంది. ఎప్పుడో ఒకసారి జరిగిన సంఘటనలని క్రూరత్వంగా పరిగణించలేం.
కానీ కేసులో జరిగిన సంఘటనలన్నింటి ఆధారంగా క్రూరత్వం అన్పించినపుడు మాత్రమే క్రూరత్వంగా పరిగణించాల్సి వుంటుంది. హిందూ వివాహ చట్టంలోని క్రూరత్వం గురించి జిల్లా హైకోర్టు 1985లో ఒక తీర్పుని ప్రకటించింది. అదే ‘హాండా వర్సెస్ హాండా’ (ఎ.ఐ.ఆర్.1985 ఢిల్లీ 76) ఆశాహాండా వర్సెస్ బల్దేవ్ రాజ్ హాండా. ఆ కేసులోని విషయాలకొస్తే- వారిద్దరి వివాహం 21 మార్చి 1972లో జరిగింది. మార్చి 5, 1981 రోజున ఆశా విడాకుల కోసం భర్తపైన కేసుని దాఖలు చేసింది. క్రూరత్వం, వదిలిపెట్టడం అన్న రెండు ఆధారాల ప్రకారం ఆమె కేసును దాఖలు చేసింది. 1973 నుంచి వాది తన మొత్తం జీతం తనకే ఇవ్వాలని ప్రతివాది ఆమెను రోజూ హింసించేవాడు. జీతం మొత్తం తీసుకొని చాలా చిన్న మొత్తాలని ఆమెకు ఖర్చు క్రింద ఇచ్చేవాడు. తరువాతి తరువాతికాలంలో ఆమె వ్యక్తిగత ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వడం మానేశాడు. ప్రసవానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. బిడ్డ అనారోగ్యంగా వున్నపుడు మందులు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. రోజూ రాత్రి తాగి వచ్చి తిట్టడం కొట్టడం, ఇంట్లోనుంచి బయటకు పంపిస్తానని అనడం దాకా వెళ్ళింది.
ప్రతివాది చర్యలు క్రూరత్వం క్రిందకు వస్తాయా అన్న విషయాన్ని కోర్టు పరిశీలించింది. మారుతున్న సాంఘిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూడాల్సి వుంటుందని కోర్టు అభిప్రాయపడింది. స్వభావాలలో వున్న వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని విడాకులు మంజూరు చేయకూడదు. ఏదైనా సంఘటన క్రూరత్వంగా ఇతరులకి కష్టం కలిగించే సంఘటన లేదా సంఘటనలు తీవ్రంగా వుండాలి. అంతేకానీ, అయితే అతని ప్రవర్తన రోజువారీ జీవితంలో తీవ్రమైనదిగా వుండకూడదని అభిప్రాయపడింది.
న్యాయపరమైన క్రూరత్వంలో ఈ అంశాలు వుండాలి. అవి:
-జీవితానికి ఆపద లేదా హాని, అది మానసికమైనది కావొచ్చు, శారీరకమైనది కావచ్చు. లేదా
-అలాంటి భయం వుండాలి. అది సహేతుకంగా వుంటే చాలు.
కర్నాటక హైకోర్టు ఈ విషయంలో విస్తృతమైన అర్థాన్ని శ్రీకాంత్ వర్సెస్ అనురాధ (ఏ.ఐ.ఆర్ 1980 కర్నాటక 8) కేసులో ఇచ్చింది. క్రూరత్వాన్ని నిర్వచించడంవల్ల దాని పరిధి తగ్గిపోతుంది. అది అభిలషణీయం కాదు. అది సాధ్యమూ కాదు. న్యాయపరమైన క్రూరత్వం అనేది శారీరక చర్యలకి, గాయాలకే పరిమితం కదా. హాని కలిగించాలన్న ఉద్దేశ్యం ప్రతివాదికి లేకపోవచ్చు. అయినా కూడా క్రూరత్వం వుంటుంది. వైవాహిక బాధ్యతలని విస్మరించడం, దంపతుల్లో ఒకరి ప్రవర్తన ఇతరులని కించపరిచే విధంగా వున్నపుడు, అగౌరవపరిచేదిగా వున్నపుడు అది న్యాయపరమైన క్రూరత్వమే అవుతుంది.
నిర్వచనాలు
హిందూ వివాహ చట్టంలో క్రూరత్వం అంటే ఏమిటో నిర్వచించలేదు. కానీ క్రూరత్వం అంటే ఏమిటో భారతీయ శిక్షాస్మృతిలోని సె.498ఏలో నిర్వచించినారు. ఆ నిబంధన ప్రకారం-
ఎవరైనా ఉద్దేశ్యపూర్వకమైన నడవడిక ద్వారా, ఆ నడవడిక స్వభావంవల్ల ఆ మహిళ ఆత్మహత్య చేసుకునేవిధంగా లేదా తీవ్రమైన గాయాలు అయ్యే విధంగా లేదా ఆమె జీవితానికి అవయవాలకి లేదా ఆరోగ్యానికి హాని కలిగే విధంగా వుంటే అది క్రూరత్వం అవుతుంది. అది శారీరక క్రూరత్వం కావొచ్చు. మానసిక క్రూరత్వం కావొచ్చు.
అదేవిధంగా ఆ మహిళలను గానీ ఆమె సంబంధీకులను గానీ ఏదైనా చట్ట వ్యతిరేకమైన డిమాండ్ చేసి ఏదైనా ఆస్తిని లేదా విలువైన సెక్యూరిటీని పొందడానికి వేధిస్తే అది క్రూరత్వం అవుతుంది.
క్రూరత్వం అనేది ముస్లిం వివాహాల చట్టం, 1939లోని సె.2 (్పజజజ)లో కూడా నిర్వచించినారు. ఆ నిర్వచనం ప్రకారం- భర్త భార్యని ఈ విధంగా చేస్తే అది క్రూరత్వం అవుతుంది.
ఎ) తరుచూ ఆమెపై దౌర్జన్యం చేసినా లేదా ఆమె జీవితాన్ని భరించలేని విధంగా తన నడవడిక ద్వారా చేసినా, అది శారీరకంగా బాధపెట్టడం కాకపోయినప్పటికీ
బి) చెడ్డపేరు వున్న స్ర్తిలతో సాంగత్యం ఏర్పరచుకున్నపుడు లేదా ప్రతిష్టలకి భంగం కలిగే జీవితం గడుపుతున్నపుడు;
సి) అవినీతికరమైన జీవితం గడపాలని భార్యని బలవంతపెట్టినపుడు
డి) ఆమె ఆస్తులని అన్యాక్రాంతం చేసినపుడు లేదా ఆమె హక్కులని ఉపయోగించుకోకుండా నిరోధించినపుడు
ఇ)తన మత సంబంధమైన హక్కులని లేదా అలవాట్లని భర్త ఆటంకపరచినప్పుడు
ఎఫ్) అతనికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు వున్నపుడు, ఆ....... ఖురాన్‌లో చెప్పిన విధంగా సమానంగా

No comments:

Post a Comment

Followers