Wednesday, March 17, 2010

హిందూ మైనరుకి సంరక్షకులు

హిందూ మైనరుకి సంరక్షకులు
March 18th, 2010

పిల్లల సంరక్షణ గురించి రెండు రకాలైన చట్టాలు వున్నాయి. మతాన్ని బట్టి ఒక చట్టం వుంది. మతాలతో సంబంధం లేకుండా మరో చట్టం వుంది. తండ్రి మతాన్ని బట్టి వారి పిల్లలకి అతని మతానికి చెందిన చట్టం వర్తిస్తుంది. రెండు రకాలైన చట్టాలు పిల్లలకి వర్తిస్తాయి.
హిందువులకి సంబంధించి సంరక్షణ గురించి హిందూ సంరక్షణకు మైనారిటీ చట్టం వర్తిస్తుంది. మైనారిటీ తీరని వ్యక్తుల సంరక్షణ కోసం, దానికి సంబంధించిన ‘లా’ని సవరించి క్రోడీకరించి ఈ చట్టాన్ని తయారుచేశారు. హిందూ మైనర్లకి, సంరక్షకులకి సంబంధించిన స్మృతులు, వ్యాఖ్యానాలు, వాటిని కోర్టులు ఆమోదించిన తీరును బట్టి ఈ చట్టాన్ని రూపొందించినారు. అంతేకాదు మైనర్లకి సంబంధించిన ఇతర చట్టాలు గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టం 1890, హిందూ మెజారిటీ చట్టం, 1875 చట్టంలోని నిబంధనల ఆధారంగా దీన్ని రూపొందించినారు. ఈ చట్టాలని పరిశీలించి దీన్ని తయారుచేశారు. ఈ చట్టంలోని సె.2 ప్రకారం ఇది గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టానికి అధికం తప్ప దాన్ని తక్కువ చేయడానికి ఉద్దేశించి కాదు. ఈ చట్టంలోని నిబంధనలకి మిగతా చట్టంలోని నిబంధనలు విరుద్ధంగా వుంటే ఈ చట్టంలోని నిబంధనలే చెల్లుబాటు అవుతాయి. మరో విధంగా చెప్పాలంటే ఈ చట్టంలో చెప్పిన విషయాలకు సంబంధించి హిందూ లాలోని ఇతర చట్టాలు వర్తిస్తాయి. గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టం అన్ని మతాలవారికి వర్తిస్తుంది. ఈ చట్టం హిందువులకి మాత్రమే పరిమితం.
ఈ చట్టంలో నిబంధనలని గమనించినపుడు, ఇది ఇతర చట్టాలకి అనుబంధమని తెలుస్తుంది. గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టానికి ఇది అదనం. సంరక్షకులుగా వ్యవహరించడానికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలో, అందులో ఏ ఏ అంశాలు వుండాలో గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టంలో వివరంగా చెప్పినారు. అదేవిధంగా సంరక్షకుల విధులు, ఆ సంరక్షకులని తొలగించు విధానం ఆ చట్టంలో స్పష్టంగా చెప్పినారు. ఈ విషయాలకి సంబంధించి హిందువులు కూడా గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టానే్న ఆశ్రయించాల్సి వుంటుంది.

మైనరంటే ఎవరు?
హిందూ మైనర్ల సంరక్షకుల చట్టప్రకారం మైనరంటే- 18 సంవత్సరాలు నిండని వ్యక్తి.
సంరక్షకులు అంటే ఎవరు?
మైనర్ వ్యక్తి సంరక్షణ, అతని ఆస్తి సంరక్షణ చూస్తున్న వ్యక్తిని సంరక్షకుడు అంటారు. అందులో ఈ వ్యక్తులు వుంటారు.
* సహజ సంరక్షకులు
* మైనర్ వల్ల లేదా తండ్రి రాసిన వీలునామా ద్వారా నియమితుడైన వ్యక్తి
* కోర్టు ప్రకటించిన లేదా నియమించిన వ్యక్తి.
* ఏదైనా చట్టం ద్వారా అధికారం వచ్చిన వ్యక్తి లేదా సంరక్షకుల చట్టం ద్వారా అధికారం వచ్చిన వ్యక్తి.
హిందూ మైనరుకి సహజ సంరక్షకులు ఎవరు?
హిందూ మైనరుకి సహజ సంరక్షకులు ఆ శిశువు తండ్రి. అతని తరువాత తల్లి సహజ సంరక్షకురాలు.
5 సంవత్సరాలుకు లోబడిన మైనరు పిల్లలకు మాత్రం తల్లే సహజ సంరక్షకురాలు.
అక్రమ సంతానం అయినపుడు వాళ్ళకి ముందుగా ఆ పిల్లల తల్లి సహజ సంరక్షకురాలు. ఆ తరువాత తండ్రి.
వివాహం అయిన బాలికకు మాత్రం ఆమె భర్త సహజ సంరక్షకుడు.
సహజ సంరక్షకులే ఆ పిల్లల ఆస్తికి కూడా సంరక్షకులు అవుతారు.
సంరక్షకులు హిందూ మతాన్ని వీడినప్పుడు...
సహజ సంరక్షకులు హిందూమతాన్ని విడనాడినప్పుడు, సన్యాసం స్వీకరించినపుడు మాత్రం సహజ సంరక్షకులుగా వుండటానికి వీల్లేదు.
ఐదు సంవత్సరాల లోపు వున్న పిల్లల ఆస్తికి సంరక్షకులు ఎవరు?
ఐదు సంవత్సరాల లోపు వున్న పిల్లలకి సంరక్షకులుగా తల్లికి అర్హత వుంటుంది. వారి ఆస్తికి ఎవరు సంరక్షకులుగా వుంటారో, ఈ చట్టం చెప్పలేదు. ఇలాంటి సందర్భాలలో గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టప్రకారం ఆ పిల్లల ఆస్తికి సంరక్షకులని నియమించాల్సి వుంటుంది.
హిందూ సంరక్షణ మైనారిటీ చట్టం వచ్చినప్పటికీ గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టం తన ఉనికిని కోల్పోలేదని మనకు

No comments:

Post a Comment

Followers