Tuesday, March 30, 2010

మైనర్ పిల్లల జాయింట్ ఆస్తికి సంరక్షకులు ఎవరు?

మైనర్ పిల్లల జాయింట్ ఆస్తికి సంరక్షకులు ఎవరు?
March 30th, 2010

మైనర్ పిల్లల జాయింట్ ఆస్తికి వారసులు ప్రత్యేకంగా ఎవరూ వుండరు. ఆ కుటుంబానికి పెద్ద (కర్త) ఎవరైతే వుంటారో అతనే మైనర్ ఆస్తి (సంయుక్త ఆస్తి) వ్యవహారాలు చూస్తాడు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చెల్లించడానికి, అవసరమైనప్పుడు మైనర్ పిల్లల తండ్రి మైనర్ పిల్లల భాగాన్ని అమ్మడానికి అవకాశం వుంది. మరోవిధంగా చెప్పాలంటే జాయింట్ ఆస్తికి సంబంధించి దాని పూర్తి నిర్వహణ బాధ్యత కుటుంబ పెద్దకి వుంటుంది. అవసరమైనప్పుడు అతను అమ్మడానికి అవకాశం వుంది.

మైనర్ ఎవరి ఆధీనంలో వుంటాడు?

సాధారణ పరిస్థితులలో మైనర్ సహజ సంరక్షకుడైన తండ్రి ఆధీనంలో వుంటాడు. 5 సంవత్సరాల లోపు వున్న పిల్లలకి మాత్రం తల్లి వారసురాలిగా వుంటుంది. పిల్లలు ఎవరి అధీనంలో వుండాలి అన్న విషయంలో అత్యంత ముఖ్యమైనది పిల్లల సంక్షేమం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు ఆధీనాన్ని మంజూరు చేస్తాయి.
తండ్రి అనేవాడు పిల్లవాడికి సహజ రక్షకుడు. మైనర్ పిల్లల చదువూ సంధ్యలు చూడాల్సిన బాధ్యత పిల్లలపైనే వుంటుంది. సంరక్షణ బాధ్యత అప్పగించే ముందు పిల్లల సంక్షేమం చూసి నిర్ణయించాల్సిన బాధ్యత కోర్టుపై వుంటుంది. సాధారణంగా మైనర్ పిల్లలపై తండ్రికే నియంత్రణ వుంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే వుండదు.

తండ్రి నియంత్రణ మైనర్ పిల్లలపై ఎప్పుడు వుండదు?

ఈ సందర్భాలలో మైనర్ పిల్లలపై తండ్రి నియంత్రణ వుండదు.
* నీతి బాహ్యమైన పనుల్లో గానీ లేదా రౌడీ వ్యవహారాల్లో తండ్రి వున్నప్పుడు;
* తన ప్రవర్తన ద్వారా పెద్ద అధికారాన్ని తండ్రి వదులుకున్నప్పుడు;
* కోర్టు అనుమతి లేకుండా కోర్టు అధికార పరిధినుంచి మైనర్ పిల్లలని దూరంగా తీసుకొని వెళ్ళినపుడు.
తల్లికి ఎప్పుడు పిల్లవాడి ఆధీనాన్ని ఇస్తారు?
పిల్లవాడి సంక్షేమం అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఎవరి అధీనంలో పిల్లవాడికి అభివృద్ధి వుంటుందో, పిల్లవాడు క్షేమంగా వుంటాడో కోర్టు పరిశీలించి ఆధీనాన్ని ఇస్తుంది.
ఉదాహరణకి తండ్రి నిరుద్యోగి అయి, తల్లి ఉద్యోగం చేసి 20వేల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, ఆ పిల్లవాడిని సరిగ్గా చూసే అవకాశం, మంచి విద్యని అందించే అవకాశం తల్లికే వుంటుంది. ఇలాంటి సందర్భాలలో తల్లి ఆధీనంలోకే పిల్లవాడిని కోర్టులు ఇస్తుంటాయి. (రాజిందర్ కుమార్ మిశ్రా వర్సెస్ రిచా ఏ.ఐ.ఆర్.2005 అలహాబాద్ 379)

5 సంవత్సరాల లోపు వున్న పిల్లలు తప్పకుండా తల్లి ఆధీనంలోనే వుండాలా?

హిందూ గార్డియన్ మైనారిటీ చట్టం 1956 చట్టంలో సె.6లోని ప్రో.వి.సో ప్రకారం 5 సంవత్సరాలలోపు వున్న పిల్లల ఆధీనం తల్లి దగ్గరే వుండాలి. అయితే ఇది రద్దుచేయడానికి వీల్లేని నిబంధన కాదు. ఎందుకంటే ఈ ప్రోవిసోలోనే ఒక మాట చెప్పారు. అది ‘సాధారణంగా’ అంటే సాధారణ పరిస్థితులలో 5 సంవత్సరాలలోపు పిల్లవాడి అధీనం అంటే అసాధారణ పరిస్థితులలో ఇతరులకి కూడా వారి ఆధీనం ఇవ్వడానికి అవకాశం వుంది. అదేవిధంగా సె.13 ప్రకాం మైనర్ శ్రేయస్సే ప్రధానమైన విషయం. ఈ రెండు విషయాలను గమనించినపుడు 5 సంవత్సరాలలోపు వున్న మైనర్ పిల్లలకి తల్లే తప్పకుండా సంరక్షకురాలని, ఆమె అధీనంలోకే పిల్లలని ఇవ్వాల్సి వుంటుందని చెప్పలేం. అది సరికాదు.
మైనర్ ఆస్తి ఎవరి అధీనంలో వుంటుంది?
ఉమ్మడి ఆస్తి కానప్పుడు ఆ మైనర్ పిల్లవాడి ఆస్తి సహజ సంరక్షకుని ఆధీనంలో వుండవచ్చు.
అక్రమ సంతానమైన మైనర్ పిల్లలు ఎవరి అధీనంలో వుంటారు?
అక్రమ సంతానమైన మైనర్ పిల్లలు తల్లి ఆధీనంలో వుంటారు. వారికి తల్లే సహజ సంరక్షకురాలు. ఆ పిల్లల మైనారిటీ తీరనంతవరకి వారి తండ్రికి ఎలాంటి వారి అధీనం గురించి ఎలాంటి హక్కు వుండదు. అక్రమ సంతానం తండ్రి ఎవరో తెలిసినప్పటికి తల్లే సహజ సంరక్షకురాలు అవుతుంది.
సహజ సంరక్షకునికి ఎప్పుడు అనర్హత వర్తిస్తుంది?
ఈ నిబంధనలోని ప్రోవిసో ప్రకారం- రెండు సందర్భాలలో అనర్హత ఏర్పడే అవకాశం వుంది.
ఆ సందర్భాలు
--------------
* సహజ సంరక్షకులు వేరే మతాన్ని స్వీకరించినపుడు, అంటే హిందూ మతాన్ని త్యజించినప్పుడు-
* అదేవిధంగా సన్యాసం తీసుకొని వన ప్రస్తానికి వెళ్లినపుడు.


అన్యమతాన్ని స్వీకరించిన సహజ సంరక్షకులకి పిల్లల ఆధీనాన్ని కోర్టు ఇవ్వవచ్చా?

అన్యమతాన్ని స్వీకరించినపుడు సహజ సంరక్షకులకి ఆ హోదా పోతుంది. కానీ అలాంటి వ్యక్తులని కోర్టు సహజ సంరక్షకులుగా నియమించడానికి వీల్లేదని ఎలాంటి నిబంధన లేదు. అందుకని అన్యమతం స్వీకరించిన సహజ సంరక్షకులకి కూడా కోర్టు నియమించవచ్చు.

*
*
*

No comments:

Post a Comment

Followers