Friday, March 27, 2009

votarlu ga namodu 28-3-04 suryaa

విద్యార్థులు ఓటర్లుగా నమోదు

పద్ధెనిమిది సంవత్సరాల వయసు వారికి ఓటు హక్కు వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ వయస్సు వారిలో చాలామంది విద్యార్థులు. వారు చదువుతున్న ప్రదేశం ఒకచోట, వాళ్ళ నివాసం మరో చోట. వాళ్ళ స్థిరనివాసం దగ్గరే వాళ్ళ ఓట్లు ఉంటాయి. ఎన్నికల కోసం వాళ్ళు ఎంతో దూరంలో ఉండే తమ ఊళ్ళకు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళ ఓట్లు వృధాగా పొయే అవకాశం ఉంది. ఇందకు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉందా?ఈ పరిస్థితిని అధిగమించడానికి వాళ్ళు ఎలాం టి చర్యా తీసుకోవడం లేదు. రెండు విధాలుగా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా, లేదా తాము ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ ప్రాంతంలోనే తమను ఓటర్లుగా నమోదు చేసుకోవడం ద్వారా! ఇది సాధ్యమయ్యే పనేనా అనే సందేహం వస్తుంది. అవుతుందని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా బెంగళూరు విద్యార్థులు రుజువు చేశారు. రెండు రోజుల క్రితం ఈ వార్త పత్రికల్లో చోటుచేసుకుంది. బెంగళూర్‌ లాంటి పట్టణాల్లో స్థిరమైన జనాభా ఉండదు. చదువుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ వెళుతూ ఉంటారు. ఆ కారణంగా జనాభా ఎక్కువగా ఉన్నా, ఓటర్లు తక్కువ. ఉన్న ఓటర్లలో బూత్‌ దాకా వెళ్ళి ఓటు వినియోగించుకునే ఆసక్తి చాలా మందికి ఉండదు. ఆసక్తి ఉన్న వాళ్ళకి ఓటు ఉండదు. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో విద్యార్థులు కూడా ఉంటారు. స్థానికులు కాదనే కారణంతో వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల అధికారులు ఇష్టపడరు. అయితే బెంగళూరులో విద్యార్థుల హాస్టళ్లను వారి నివాసంగా పరిగణించి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కాలే జీ అధికారులు అధికారులను ఒప్పించగలిగారు. ఫలితంగా ఆ కాలేజీ విద్యార్థులు బెంగుళూరు ఓటర్లుగా నమోదైనారు.ఓటర్లుగా నమోదు కావాలంటే ఏ అర్హతలు ఉండాలి అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. రాజ్యాంగంలోని అధికరణ 326 ప్రకారం పయోజనుడైన ప్రతి భారతీయుడు ఓటరుగా నమోదు అయ్యే అర్హత కలిగి ఉంటాడు. అతను భారతీయుడై ఉండాలి, అతనికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే కొన్ని అనర్హతలు లేకుండా కూడా ఉండాలి. ఏదైనా చట్ట ప్రకా రం అనర్హతను వారు కలిగి ఉండకూడదు. మానసిక అనారోగ్యం(పిచ్చి) లేకుండాఉండాలి. ప్రవాస ప్రాంతం వాడై ఉండ కూడదు. ఎన్నికల్లో అవినీతికర పనులు చేసినందుకు శిక్ష పడి ఉండకూడదు. ఓటు అనేది రాజ్యాంగ పరమైన హక్కా, చట్టం ద్వారా వచ్చిన హక్కా అన్న ప్రశ్న కూడా ఉంది. అయితే అది ప్రాథమిక హక్కు కాదు. ఈ విషయంలో ఎలాంటి చ…ర్చకు అవకాశం లేదు. రాజ్యాంగంలోని భాగం మూడులో అధికరణం 12 - 35 లలో ఓటు హక్కు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అందులోని ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. ఓటరు అర్హతలు, నమోదు ప్రక్రియ లాంటి విషయాలన్నీ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ఓటు హక్కు నియమాలు 1960 లలో చెప్పినారు. అందుకని ఇది చట్టపరమైన „హక్కు అని మన న్యాయ వ్యవస్థ వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని అధికరణ 326 ప్రకారం వయోజనులకు ఓటు హక్కున్న కారణంగా దీన్ని రాజ్యాంగ పరమైన హక్కుగా గుర్తించాలన్న వాదన కూడా ఉంది. ఏ వాదనలు ఉన్నప్పటికీ ఓటు హక్కు అనేది చట్టపరమైన హక్కు అని, అది ప్రాథమిక హక్కు కాదని స్థిరమైపోయింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సె.19 ప్రకారం ఎవరైనా పౌరుడు ఓటరుగా నమోదు చేయించుకోవాలంటే 18 సంవత్సరాల వయస్సు ఉన్నదన్న సాక్ష్యం, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో సాక్ష్యం ఉంటే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది.ఏడు సంవత్సరాల కోర్సులు చదువుతున్న విద్యార్థులు తమ నివాసాలకు దూరంగా కొన్ని సంవత్సరాలు నివసించవలసి వస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఒక్క రోజు కోసం తమ గ్రామానికి వెళ్ళి ఓటు హక్కు వినియోగిం చుకునే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళ ఓటు హక్కు వృధాగా పోవలసిందేనా? `సాధారణ నివాసం' ఉన్న వ్యక్తులు ఓటరుగా నమోదుచేసుకోవచ్చని ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సె.20 చెబుతుంది. కొంతకాలం పాటు ఒక ప్రాంతంలో నిరంతరాయంగా నివసిస్తే దాన్ని సాధారణ నివాసం అంటారు. హాస్టళ్లలో విద్యార్థుల నివాసాన్ని `సాధారణ నివాసం'గా పరిగణించవలసి ఉంటుంది. ఎవరైనా ఒక నియోజక వర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవలసి ఉం టుంది. ఈ విషయం గురించి ప్రకటనను కూడా జత చేయవలసి ఉంటుంది.ఇదివరకే ఎక్కడైనా ఓటరుగా నమోదైతే దాన్ని రద్దు చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.బెంగళూర్‌లో యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఓటరు నమోదు ప్రక్రియను దేశవ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల హాస్టళ్లను వాళ్ళ నివాస గృహాలుగా పరిగణించి వాళ్ళని ఓటర్లుగా నమో దుచేయవలసిన అవసరం ఉంది. ఓటరుగా నమోదు చేసుకోవడమే కాదు, ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే దాని సార్థకత
.రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers