Friday, March 13, 2009

14-3-08

ప్రత్యేక ఖైదీలు

భారతరాజ్యాంగం ప్రకారం, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం చట్టం ముందు వ్యక్తులందరూ సమానమే. ఖైదీలు కూడా మనుషులే. వాళ్ళ కి హక్కులుంటాయి. గతంలో ఖైదీలని శత్రువులుగా చూసేవారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వా త ఖైదీలను మనుషులుగా గుర్తించటం జరిగింది. త… ర్వాతి కాలంలో ఖైదీలకు ఉన్న హక్కులనే కాదు, వారి గౌరవాన్ని కూడా మన సమాజం గుర్తించడం మొదలు పెట్టింది. నాగరిక సమాజంలో శిక్షించే పద్ధతులు కూడా మారిపోయినాయి. కొన్ని దేశాల్లో మరణ శిక్ష అమల్లో నే లేదు. మరి కొన్ని దేశాల్లో ఆనాగరికమైన పద్ధతులు ఇంకా అమల్లో ఉన్నాయి. మన దేశంలో మరణ శిక్ష అమల్లో ఉన్నప్పటికి అరుదైన వాటికి మాత్రమే కోర్టులు ఆ శిక్షను విధిస్తున్నాయి. శిక్షలు విధించినప్పటికి కోర్టు లు, మన సమాజం ఖైదీలకు ఉండే హక్కులను, వారి గౌరవాన్ని కూడా గుర్తిస్తున్నాయి. ఖైదీల హక్కులకు భం గం కలిగించే శిక్షలు వేటినీ ఇప్పుడు మన… దేశంలో కోర్టులు విధించడం లేదు. వ్యక్తుల్లో అంతర్గతంగా ఉన్న ఈ గౌరవం, సమానత్వాన్ని గుర్తించడం సమాజంలో శాంతి పునాది రాళ్ళను గట్టిపరిస్తుందని భావించవచ్చు. చేసిన నేరంతో సంబంధం లేకుండా ఖైదీలందరికీి సమానమైన గౌరవాన్ని మన చట్టం ఇస్తోంది.ఖైదీలు రెండు రకాలుగా ఉంటారు. విచారణలో ఉన్న ఖైదీలు, శిక్షపడిన ఖైదీలు. ఈ ఖైదీలను వేరు వేరు గా చూడాల్సి ఉంటుంది. వారిని నిర్బంధించడం కూడా వేరు వేరుగా ఉండాలి. విచారణలో ఉన్న ఖైదీలను శిక్షపడిన ఖైదీలతో, అదే విధంగా సివిల్‌ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో కాకుండా వారిని వేరుగా ఉంచాల్సి ఉం టుంది. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితులు ఎవరికైనా ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని కోర్టు న్యాయ సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ విధం గా ఆదరించకుండా ఏదైనా విచారణ జరిగినటై్లతే దానికి అసహహేతుకమైన విచారణగా పరిగణించడం జరుగుతుంది. సమానమైన న్యాయ సహాయం అందడానిి గాను, జైళ్ళలో మగ్గుతున్న బీదƒ ఖైదీలకు న్యాయ సహాయాన్ని అందజేయాలిసిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పటికీ, విచారణలో ఉన్న ఖైదీల విషయంలో కొంత భేదం ఉం ది. ఈ ఖైదీలను రెండు తరగతులుగా వర్గీకరించారు. ప్రత్యేకమైన తరగతి, సాధారణ తరగతి. సమాజంలో ఉన్న ప్రత్యేƒ హోదా, విద్య, అలవాట్లు, అలవాటై న ఉన్నతస్థాయి జీవనం - వీటిని గమనించి అలాంటి ముద్దాయిలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి జైలు ఆధికారులు జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫారసు చేయవలసి ఉంటుంది. ఆ సిఫారసులను జిల్లా మేజిస్ట్రేట్‌ అమోదించి వారికి ప్రత్యే క హోదా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ హోదా ఇచ్చినప్పుడు వారికి కొన్ని ప్రత్యేక వసతులు లభిస్తాయి. ఈ నియమం సమానత్వ హోదాకి విరుద్ధంగా ఉందని చా లా మంది భావన. విచారణ కన్నాముందే జైలు నుంచి విడుదలకావడం అనేది ఖైదీలకు ఉన్న హక్కు. ఈ హ క్కు సాధారణ ఖైదీలకు, ప్రత్యేక హోదా ఉన్న ఖైదీలకు కూడా ఉంది. ఈ హక్కును ఉపయోగించుకొని, విచారణలో ఉన్న ఖైదీలు తమ పిల్లలను, తమ కుంటుంబాల ను, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురికాకుండా చూసుకొనే అవకాశం ఉంది. అదే విధంగా విచారణలో ఉన్న ఖైదీలు ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందే హక్కు కలిగి ఉంటారు. ఈ హక్కును ఆరెస్టు నుండి తుది తీ ర్పు దాకా కలిగిఉంటారు. విచారణలో ఉన్న ఖైదీలు, ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టంకింద జైళ్ళలో ఉన్న డిటెన్యూ లు జైళ్ళలో పనిచేయాలిసిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే పని చేయవచ్చు, కాని ఇష్టం లేనప్పుడు పనిచేయవలసిన అవసరం లేదు.వివిధ కమిషన్లు జైళ్ళ సంస్కరణల గురించి జారీ చేసి న సిఫారసుల ఆధారంగా విచారణలో ఉన్న ఖైదీలకు కొన్ని ప్రత్యేక హక్కులు, సదుపాయాలు ఉంటాయి. ప్రభుత్వం వారికి ఆ సదుపాయాలను ఏర్పాటు చేయా ల్సి ఉంటుంది. అవి - న్యాయ వాదులతో చర్చించి తమ కేసు డిఫెన్సును సక్రమంగా ఏర్పాటు చేసే హక్కు. క్రయ విక్రయాలు చేసే డాక్యుమెంట్లు, కుదువ డాక్యుమెంట్లు, వీలునామా పత్రం రాసే హక్కు. కూతురు, కొడుకు, ఇతర దగ్గరి బంధువుల వివాహాలకు హజరయ్యే హక్కు. మతపరమైన విధులు నిర్వహించే హక్కు. అవసరమైనప్పుడు వైద్యసదుపాయం పొందే హక్కు. జైలు నియమాలకు విరుద్ధంగా ఏవైనా శిక్షలు విధించినట్లయితే వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకొనే హక్కు. స్త్రీలను, జువనైల్‌‌స (బాలనేరస్థులు)ను వేరుగా నిర్బందించే హక్కు. యూనివర్సిటీ, స్కూలు విద్యను కొనసాగించే హక్కు. బంధువులకు ఉత్తరాలు రాసుకొనే హక్కు. రేడియో, టెలివిజన్‌, ఇతర సంగీత వాయిద్యాలను ఉపయోగించే హక్కు. ఎన్నికల్లో నిలబడే హక్కు, తనకు ఇష్టమైన వ్యక్తికి ఓటువేసే హక్కు.కొంత మంది ఖైదీలు చిన్న నేరాలు చేసి చాలాకాలం నుంచి జైళ్ళలోనే ఉండిపోతున్నారు. ఈ పరిస్థితులను గమనించి శాసన కర్తలు బెయిల్‌ నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. బెయిలబుల్‌ నేరాల్లో అంటే బెయిలు పొందడం హక్కుగా కలిగిఉన్న నేరాల్లో ముద్దాయి కోరకుండానే కోర్టు బెయిల్‌ను మంజూరు చేవలసి ఉంటుంది. ఈ కేసుల్లో కూడా కోర్టులు జామీను కోరే అవకాశం ఉంది. జామీను కట్టలేని పేదవాళ్ళు చాలా మంది జైళ్ళలో ఉండి పోతున్నారు. ఈ విషయాన్ని గమనించి పేదవాళ్ళని వ్యక్తిగత పూచికత్తు మీద వదిలిపెట్టాలన్న నిబంధనని క్రి.ప్రొ.కో.సె- 436లో కొత్తగా చేర్చారు. ఈ నిబంధన ప్రకారం ఆరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజుల దాకా ఎవరైనా వ్యక్తి జామీను పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ వ్యక్తిని నిరుపేద వ్యక్తిగా భావించాల్సి ఉంటుంది. బెయిలబుల్‌ నేరాల్లో ముద్దాయి ఆరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజుల్లో జామీను పెట్టుకోకపోతే అతనికి జామీను పెట్టుకొనే స్థోమత ఉన్నప్పటికీ కూడా ఈ నిబంధన కోసం నిరుపేదగా గమనించి వ్యక్తిగత పూచికత్తుమీద విడుదల చేయాల్సి ఉంటుంది.విచారణలో ఉన్న ఖైదీలు శిక్షపడిన ఖైదీలకన్నా మంచి స్థితిలో ఉంటారు. అంటే వారు ఎన్నికల్లో నిలబడే అవకాశం కూడా ఉంటుంది. ఈ అవకాశం శిక్షపడిన ఖైదీలకు ఉండదు. అదే విధంగా ఇష్టం ఉంటేనే జైళ్ళల్లో పనిచేయాల్సి ఉంటుంది. కాని కఠిన కారాగార శిక్షపడిన ఖైదీలు వారి ఇష్టఇష్టాలతో నిమిత్తం లేకుండా జైళ్ళల్లో పని చేయాల్సి ఉంటుంది. ఖైదీలకు హక్కులు ఉండటంతోనే సరిపోదు, వాటిని ఉపయోగించుకోవాలనే విషయం కూడా వారికి తెలిసి ఉండాలి. అప్పుడే ఆ హక్కులకు సార్థకత. విచారణలో ఉన్న ఖైదీలను రెండు తరగతులుగా విభజించడం ఎంత మేరకు సమంజసమో అర్థంకాని విషయం.

రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయ సహాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers