Friday, March 6, 2009

atrocities on women 7-2-09 sataur day suryaa daily

మహిళలపై నేరాలను నిరోధించలేమా?
mangari rajender

మరోమహిళా దినోత్సవం వచ్చేస్తోంది. కాని మహిళల జీవితాల్లో పెద్దమార్పేమీ ƒనిపించడం లేదు. నేరాలు తగ్గడం కాకుండా రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈవ్‌ టీజింగ్‌లు, లైంగిక వేధింపులను చాలా చిన్న విషయాలుగా మన సమాజం భావిస్తోంది. కారణం, అవి రోజూ మన జీవితంలో మామూలు విషయాలైపోయాయి. సమాజంలో కొత్త కొత్త సంఘటనలు కనిపిస్తున్నాయి. తనని ప్రేమిం చడం లేదని స్త్రీలను చంపివేస్తున్న సంఘటనలు, వారి మీద యాసిడ్‌ దాడులు చేస్తున్న సంఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రేమించమంటూ సంవత్సరాల తరƒబడి వేధించడం, చివరకు ఆ అమ్మాయి వివాహం చేసుకొంటున్న దశలో అల్లరి పెట్టడం, దాడులు చేయడం ఎక్కువగా జరుగుతున్నాయి.

యాసిడ్‌ దాడులేకాదు, ఈ మధ్యకాలంలో ప్రేమించిన స్త్రీలపై వేడి నూనెతో కూడా దాడులు చేస్తున్నారు. మెసేజ్‌ల ద్వారా మహిళలను అందోళనకు గురిచేస్తున్న సంఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఈవ్‌ టీజింగ్‌లు, ప్రేమిస్తున్నానని వెంటపడటం వంటి సంఘటనలు జరిగినప్పుడు ఉపేక్షించడం కూడా ఇలాంటి చర్యలు ఎక్కువ కావడానికి దోహద పడుతోంది. ఈ నేరాల బారిన పడుతున్న వ్యక్తులు యుక్త వయస్సులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయలేక పోతున్నారు. ఫిర్యాదు చేస్తే అనవసర ప్రచారం జరుగుతుంది. అది వాళ్ళకు హానికరంగా మారే అవకాశం ఉంది.

అంతేకాదు, ఆ స్త్రీలంటే పడని వ్యక్తులు ఈ విషయాల గురించి చిలువలు పలువ…లుగా చెప్పుకొంటారు. ఇవన్నీ ఇష్టంలేక స్త్రీలు ఈ వేధింపులను మౌనంగా భరిస్తున్నారు. అందువల్ల ఈ నేరాలు అంతకంతకూ వికృత రూపం దాలుస్తున్నాయి.ఈ మధ్య ఒక అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌ వచ్చింది. దాన్ని వాళ్ళ చిన్నాన్న చూసి ఆ వ్యక్తిని గుర్తించాడు. ఆ వ్యక్తి ఆ అమ్మాయితో పాటు చదువుతున్న విద్యార్థే. కాలేజి యాజమాన్యం ఆ విద్యార్థిని మందలించింది. అందుకనే ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. ఇలా చాలా సంఘటనలు పోలీసుల దృషిి్ట, కోర్టుల దగ్గరకు రాకుండాఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చాలా మందికి తెలియదు.

స్త్రీలపై జరిగే ఈ నేరాలు కొన్ని బలప్రయోగం లేకుండా జరిగేవే. కాలేజిల్లో రోడ్డు మీద మహిళలను మాటల ద్వారా, సైగల ద్వారా, చర్యల ద్వారా అవమానపరచడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. మొబైల్‌ ఫోన్లు వచ్చిన తర్వాత మెసేజ్‌ల ద్వారా స్త్రీలను అవమానపరచడం జరుగుతోంది. ఇంకా కొంతమంది వ్యక్తులు ఈ- మెయి ల్‌‌స ద్వారా మహిళలను ఇబ్బందులకు గురిచేస్తుఉంటారు. మెసేజ్‌లు పంపడం, ఈ- మెయిల్‌‌స పంపడం నేరం అవుతుందా? అసభ్యకరమైన మెసేజ్‌లను, ఈ- మెయిల్‌‌సను పంపించినప్పుడు వాళ్ళపై చర్య తీసుకొనే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నే నేను ఉదహరించిన సంఘటనలోని అమ్మాయి వాళ్ళ చిన్నన్న అడిగాడు. కానీ అనవసర ప్రచారాన్ని ఇష్టపడక పోవడంవల్ల పోలీసులకు ఫిర్యాదుచేయకుండా ఊరుకున్నారు.
ఉద్దేశ్యపూర్వకంగా స్త్రీ గౌరవ మర్యాదలను కించపరచడానికి ఏ వ్యక్తి అయినా ఏమైనా మాటల్ని గాని, శబ్దాలను కాని, భావ సూచనలని గాని, ఏవైనా వస్తువులను గాని ప్రదర్శించి ఆ చర్యలను గమనించాలని అనుకొన్నప్పుడు అది భారతీయ శిక్షాస్మృతిలోని సె-509 ప్రకారం నేరం అవుతుంది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఆ వ్యక్తి చేసిన చర్యలను ఆ స్త్రీ చూడాల్సిన అవసరం లేదు, ఆ చర్యలను చూసినవారెవరైనా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ మహిళను కోర్టులో విచారించాల్సిన అవసరం ఉండదు. అనవసర ప్రచారం లేకుండానే శిక్ష విధించే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ అంశాన్ని కోర్టులు, పోలీసులు గమనించి సున్నితంగా వ్యవహరించినప్పుడే ఆ నేరాలు చేసిన వ్యక్తులకు శిక్షలు పడే అవకాశాలున్నాయి. సె-509 ప్రకారం నేరం రుజువు చేయాలంటే బాధితురాలిని సాధారణంగా విచారించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ముద్దాయి అన్న మాటలు శబ్దాలు, భావసూచనలు ఆ స్త్రీ చూడాలని, వినాలని అతను చేశాడని రుజు వుచేస్తే సరిపోతుంది. అందుకని బాధితురాలిని కోర్టులో తప్పకుండా విచారించాల్సిన అవసరం లేదు.

అసభ్యకరమైన ఉత్తరాలను, మెసేజ్‌లను, మెయిల్‌‌సను పంపించడం సె-509 ప్రకారం నేరమవుతుంది. స్త్రీ గుప్తతలోకి చొరబడటం కూడా నేరమే. ఎవరైనా వ్యక్తి జనంలో ఉన్నప్పటికీి ఆ వ్యక్తి గుప్తత ఉంటుంది. అది ఆలోచనకు సంబంధించిన గుప్తత కావొచ్చు. ఈ గుప్తతలోకి జొరబడడానికి ఎవరికీ అవకాశం లేదు. ఎవరి గుప్తతనైనా భంగపరిచేటప్పుడు సాధారణంగా క్షమించమనే అడుగుతాము. స్త్రీ గుప్తతలోకి జొరపడటం జనం మధ్య ఉన్నప్పుడు, ఆమె ఇంటిలో ఉన్నప్పుడు కూడా జరగొచ్చు. స్త్రీనిచూసి అనవసరంగా నవ్వడం, కన్నార్పకుండా వాళ్ళను చూడటం లాంటి సంఘటనలు కూడా ఆమె గుప్తతలోకి జొరబడటమే అవుతుంది. అయితే ఈ నేరాలకి చట్టం నిర్దేశించిన శిక్ష మాత్రం చాలా తక్కువ.మన దేశంలో స్త్రీలు అనుకూలస్థితిలో లేరు. ఎన్నో సాంఘిక పరమైన ఆటంకాల ను, ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగంలో స్త్రీలకు పురుషులతో పాటు సమాన స్థాయిని ఇచ్చారు. కాని వాస్తవం ఆవిధంగా లేదు. ఇటీవలి కాలంలో స్త్రీలపై వేధింపులు ఎక్కువైనాయి. స్త్రీలపై జరుగుతున్న నేరాలు వాళ్ళకి మాత్రమే వ్యతిరేకంగా జరిగినవి కాదు, మొత్తం సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు. ఈనేరాల వల్ల స్త్రీలు తీవ్రమైన అశాంతికి లోనవుతారు.

తీవ్రమైన భావోద్రేకాలకు లోనవుతారు. అయినా కూడా ఈ నేరాల గురించి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. అది సహజం. ఎందుకంటే, ఫిర్యాదు చేయడంవల్ల వారు ఎక్కువ అసౌకర్యానికి గుర య్యే అవకాశం ఉంది. అయితే ఫిర్యాదు చేయకపోవడం వల్ల తర్వాత కాలంలో తీవ్రమైన పరిణామాలను ఎదుక్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలన్నీ అందుకు తార్కాణాలే. ఇలాంటి ఫిర్యాదులు అందిన…ప్పుడు పోలీసులు కూడా ఏ స్థాయిలో స్పందించాలో ఆ స్థాయిలో స్పందించడం లేదు. అందరూ సున్నితంగా స్పందించినప్పుడే తీవ్ర పరిణామాలు రాకుండా నిరోదించగలం. నేరం జరిగిన తరువాత తీవ్రంగా స్పందించడం కంటే నేరం జరుగకుండా నిరోధించడం మేలు. ఈ విషయాన్ని అందరూ, మరీ ముఖ్యంగా పోలీసులు గుర్తించాలి. అందు వ…ల్ల మహిళలపై నేరాలను నిరోధించలేకపోయినా తగ్గించే అవకాశం ఉంది.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసహాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers