Monday, August 9, 2010

చెల్లని వివాహాలు

చెల్లని వివాహాలు
- మంగారి రాజేందర్
August 3rd, 2010

వివాహం వుండటంవల్ల ఒక సామాజిక వ్యవస్థ ఏర్పడుతుంది. వివాహం ద్వారా జన్మించిన సంతానానికి ఆస్తిలో హక్కులు లభిస్తాయి. సమాజంలో ఓ హోదా కూడా లభిస్తుంది. హిందూ వివాహాలు ఒప్పందం లాంటివి కాదు. అవి పవిత్రమైనవి. అయినా కూడా ఈ రోజుల్లో చెదిరిపోతున్న వివాహాల సంఖ్య పెరిగిపోతుంది. విడాకులు కోరుతున్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. వివాహాలు నిష్ఫలం అవడం అనేది మూడు రకాలుగా వుంటుంది.
విడాకులు
- ఉభయుల సమ్మతితో విడాకులు
- ఎదుటివారి వివాహ తప్పుతో విడాకులు
* చెల్లని వివాహాలు
* చెల్లగూడని వివాహాలు
ఈ వివాహాల రద్దుకోసం పార్టీలలో విడాకులనేది ఎదుటివారి వివాహ తప్పిదంవల్ల ఇవ్వడం జరుగుతుంది. వివాహం రద్దుకావడం అనేది రకరకాల కారణాలవల్ల జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు వున్నపుడు వివాహం రద్దుకావడం అనేది జరుగుతుంది.
వివాహం రద్దుకావడం అంటే ఏమిటి?
చెల్లగూడని వివాహాలను రద్దుచేయడాన్ని వివాహ రద్దుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రారంభం నుండే వివాహం చెల్లనపుడు అది దానంతదానిగా రద్దు అవుతుంది. అయితే దానికి కూడా కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాల్సి వుంటుంది. కొన్ని శాసనపరమైన ఆవశ్యకతలను అవలంభించనపుడు మాత్రమే వివాహాన్ని రద్దుచేస్తారు. దంపతుల్లోని మరో వ్యక్తి జీవించి వున్నపుడే రెండో వివాహం చేసుకున్నపుడు, వివాహానికి అవసరమైన కనీస వయస్సు లేనప్పుడు వివాహాన్ని సులువుగా రద్దుచేస్తారు. మిగతా సందర్భాలలో కూడా రద్దుచేస్తారు కానీ అది అంత సులువు కాదు. వివాహానికి అవసరమైన షరతులని పాటించకపోతే దాన్ని రద్దుచేస్తారు. అది చట్టం దృష్టిలో వివాహమే కాదు. జరిగిన వివాహాన్ని రద్దుచేయడాన్ని విడాకులని అంటాం. రద్దుచేయడం అంటే వివాహాన్ని గుర్తించకపోవడమే. అంటే గతంలో కూడా వారి మధ్య వివాహం వుందని గుర్తించకపోవడమే వివాహ రద్దు.
వివాహం రద్దు ఎప్పుడు చేస్తారు?
ఈ క్రింది కారణాలు వున్నపుడు వివాహాన్ని రద్దుచేస్తారు. అవి-
* దంపతుల్లోని ఒకరు ప్రశ్నార్థకంలో వున్న వివాహానికి ముందే వివాహం చేసుకోవడం
* వివాహం చేసుకోవడానికి అవసరమైన వయస్సు రానపుడు
* వివాహ సమయంలో మానసిక వైకల్యంతో దంపతుల్లోని ఒక వ్యక్తి వున్నపుడు
* సమ్మతిని మోసం వల్ల బలవంతంవల్ల పొందినప్పుడు
* వివాహ సమయంలో శారీరక అనారోగ్యంవల్ల దాంపత్య జీవనానికి అనర్హులుగా వున్న వ్యక్తి వివాహం చేసుకున్నపుడు
* దంపతుల మధ్య నిషేధించబడిన బంధుత్వం వున్నపుడు దానికి ఆచార వ్యవహారాలు అనుమతి లేనపుడు
* జీవిత ఖైదు శిక్ష పడిన వ్యక్తులు వివాహం చేసుకున్నపుడు
* మత్తు పదార్థాలకి బానిసైన విషయం, నేర చరిత్ర లాంటి విషయాలని మరుగుపరిచి వివాహం చేసుకున్నపుడు;
వివాహానికి అవసరమైన షరతులేమిటీ?
హిందూ వివాహాలు జరిపించడానికి కొన్ని షరతులు వున్నాయి. ఆ షరతులు వున్నప్పుడే ఇద్దరు హిందువుల మధ్య వివాహం జరిపించాలి. అవి-
* వివాహం చేసుకునే వధూవరులకి వివాహ సమయానికి అంతకు పూర్వం వివాహం అయివుంటే ఆ భర్త కానీ భార్య గానీ జీవించి వుండకూడదు.
* వివాహ సమయంలో వధూవరులిద్దరిలో ఎవరైనా మతి స్థిమితం కోల్పోయిన కారణంగా వివాహానికి ఆమోదం తెలుపలేని పరిస్థితిలో వుండరాదు.
* ఒకవేళ వివాహానికి తమ ఆమోదం తెలిపే పరిస్థితి వున్నప్పటికీ సంతానాన్ని కల్గించలేనటువంటి మానసిక అనారోగ్యం వుండకూడదు.
* వారిద్దరిలో ఎవరికైనా తరచూ ఉన్మాదంగానీ మూర్చలుగానీ వచ్చి బాధపడుతూ వుండరాదు.
* వివాహ సమయంలో వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండి వుండాలి.
* ఆచార వ్యవహారాలు అనుమతించినపుడు తప్ప వధూవరుల మధ్య నిషేధించబడిన బంధుత్వం వుండరాదు.
* ఆచార వ్యవహారాలు అనుమతించినపుడు తప్ప వధూవరులిద్దరూ సఫిండులు కారాదు.
చెల్లని వివాహాలు
శాసనం నిషేధించినపుడు జరిగిన వివాహాలు వాటంతట అవే చెల్లకుండా పోతాయి. వీటినే చెల్లని వివాహాలని అంటాం. హిందూ వివాహ చట్టంలోని సె.11 వీటి గురించి చెబుతుంది.
హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత చట్టంలోని సె.5(1)(జ్ప)(్ప)లో ఏర్పరిచిన షరతులకి విరుద్ధంగా వివాహాలు జరిపించినపుడు ఆ వివాహాలు చెల్లవు. ఈ షరతులకి విరుద్ధంగా వివాహం జరిగినపుడు దంపతుల్లో ఎవరైనా పిటీషన్ దాఖలు చేసి తమ వివాహాలని రద్దుపరచుకోవచ్చు. అంటే వివాహ సమయంలో వధూవరులలో ఏ ఒక్కరైనా వివాహం అయి వుండి వారి భర్తగానీ, భార్యగానీ బతికి వున్నపుడు, వారిమధ్య ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా నిషేధించబడిన బంధుత్వం వున్నపుడు, ఆచార వ్యవహారాలు అనుమతించని సఫిండ బంధుత్వం వున

No comments:

Post a Comment

Followers