Wednesday, January 20, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు

January 19th,2010

మంగారి రాజేందర్
----------------------
వివాహాన్ని రద్దుచేసి విడాకులు మంజూరు చేయమని కోరిన దరఖాస్తులో కోర్టుకి సముచితమని తోచినప్పుడు విడాకుల డిక్రీకి బదులుగా న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీని కోర్టు మంజూరు చేయవచ్చు. హిందూ వివాహ చట్టంలోని సె.13ఎ ఈ విషయాన్ని చెబుతుంది. కొన్ని సందర్భాలలో ఆ డిక్రీని మంజూరు చేయకూడదు.

సందర్భాల్లో డిక్రీని
మంజూరు చేయకూడదు?

న్యాయనిర్ణయ వేర్పాటు డిక్రీని ఈ మూడు సందర్భాలలో ఈ డిక్రీని మంజూరు చేయకూడదు. ఆ సందర్భాలు-
1.ప్రతివాది హిందూ మతాన్ని స్వీకరించి వేరే మతాన్ని స్వీకరించినప్పుడు;
2.సంసార జీవితాన్ని వదిలి సన్యాసాన్ని స్వీకరిస్తే..
3.ఏడు సంవత్సరాల వరకు ఎలాంటి ఆచూకీ, యోగక్షేమాలు జాడ తెలియనప్పుడు;

నిబంధన ఉద్దేశ్యమేమిటి?

1976వ సంవత్సరంలో సవరణలు చేసినప్పుడు ఈ నిబంధనని ప్రవేశపెట్టారు. భార్యాభర్తలు సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం కోసం ఈ నిబంధనని ఏర్పరిచారు.
పరస్పర ఆమోదంతో విడాకులు పొందవచ్చా?
సంవత్సరం నుంచిగానీ అంతకుమించి గానీ వేరు వేరుగా నివశిస్తున్న దంపతులిద్దరూ కలిసి పరస్పర ఆమోదంతో తమ వివాహాన్ని రద్దుచేసి విడాకులు మంజూరు చేయమని విడాకులు కోరుతూ పిటీషన్ని దాఖలు చేయవచ్చు. తాము సంవత్సరంనుంచిగానీ అంతకుమించిగానీ వేరుగా నివశిస్తున్నామని తాము కలిసి జీవించే పరిస్థితులు లేవని తామిరువురు కలిసి పరస్పర ఆమోదంతో వివాహం రద్దుకోసం పిటీషన్ దాఖలు చేశామని తమ పిటిషన్‌లో తెలుపాల్సి ఉంటుంది.
1976వ సంవత్సరం తరువాత గానీ అంతకుముందుగానీ వివాహమైన దంపతులు ఎవరైనా ఈ పిటీషన్ని దాఖలు చేసుకోవచ్చు. ఈ చట్టంలోని ఇతర నిబంధనల్ని అనుసరించి కోర్టులు ఈ పిటిషన్లని పరిష్కరించాల్సి ఉంటుంది. (సె.13 బి(1).

సందర్భాల్లో కోర్టులు
విడాకుల్ని మంజూరు చేస్తాయి?

పరస్పర ఆమోదాలతో కలిసి దాఖలు చేసిన ఈ పిటీషన్ని ఆరునెలలకి ముందు కాకుండా పద్దెనిమిది నెలల లోపల దంపతులు ఈ పిటీషన్ని ఉపసంహరించుకోనప్పుడు, ఆ పిటీషన్‌లోని విషయాలను విచారించి వారిరువురి వాదనలు విన్న తరువాత, ఆ పిటీషన్‌లో రాసిన విషయాలు నిజమని కోర్టు తృప్తిచెందినప్పుడు వారిని రద్దుచేస్తూ డిక్రీని మంజూరు చేయవచ్చు. ఈ డిక్రీని మంజూరు చేసిన తేదీ నుంచి ఆ వివాహం రద్దు అయినట్టు పేర్కొనాల్సి వుంటుంది. (సె.13 (బి)(2).
ఈ నిబంధన వర్తించాలంటే
ఏ అంశాలు సంతృప్తి చెందాల్సి వుంటుంది?
సె.13(బి) ప్రకారం వివాహాన్ని రద్దుచేసి విడాకులు మంజూరు చేయాలంటే ఈ అంశాలు సంతృప్తి చెందాల్సి వుంటుంది. అవి-
* ఒక సంవత్సరం నుంచిగానీ అంతకుమించిగానీ దంపతులు వేరు వేరుగా నివశిస్తూ ఉండాలి.
* ఇద్దరూ కలిసి ఉండే పరిస్థితులు లేనపుడు.
* వివాహం రద్దు కావాలని ఇద్దరూ పరస్పర ఆమోదంతో కోరుకొని వుండాలి.
ఒకే ఇంట్లో నిశివస్తూ...
ఒకే ఇంట్లో నివశిస్తున్నప్పటికీ, భార్యాభర్తలుగా వ్యవహరించనప్పుడు ఈ నిబంధన ప్రకారం వేరుగా నివశిస్తున్నట్టే భావించాల్సి వుంటుంది. (అశోక్ గోవిందరామ్ హుర్రా వర్సెస్ రూపా అశోక్ హుర్రా 1996(2) హెచ్.ఎల్.ఆర్.512 గుజరాత్).

ఆరు నెలల కాలాన్ని విధంగా లెక్కకట్టాలి?

దాంపత్య జీవన హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తుని పరస్పర ఆమోదంతో దాఖలుచేసిన దరఖాస్తుగా మార్పుచేయమని కోరే అవకాశం పార్టీలకు వుంది. ఈ విధంగా కోరినప్పుడు కోర్టులు వాటిని ఆ విధంగా మార్పు చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో 6 నెలల గడువుని ఏ విధంగా లెక్కకట్టాలి. దాంపత్య జీవన హక్కుల కోసం వేసిన దరఖాస్తునుంచి ఈ ఆరు నెలల గడువుని లెక్కకట్టాలా? లేక మార్పు చేసిన తేదీ నుంచి దీన్ని లెక్కకట్టాలా? ఈ ప్రశ్నలకి పంజాబ్ హర్యానా హైకోర్టు మమతా సబర్‌వాల్ వర్సెస్ రవీందర్ కుమార్ సబర్‌వాల్, 1996(2) హెచ్‌ఎల్‌ఆర్ 1 (ఎం.హ) జవాబు చెప్పింది. పరస్పర ఆమోదంతో దరఖాస్తుగా మార్పుచేసిన తేదీ నుంచి ఆరునెలల కాలాన్ని లెక్కకట్టాల్సి వుంటుందని కోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది.
వివాహాన్ని కోర్టు ఎప్పుడు రద్దుచేస్తుంది?
పిటీషన్ దాఖలైన 6 నెలల తరువాత 18నెలల లోపు ఈ పిటీషన్ ఉపసంహరణ కానప్పుడు కోర్టు పార్టీలను విచారించి విడాకులను రద్దుచేయవచ్చు.
అయితే మంజూరు చేసే ముందు పిటీషన్‌లోని విషయం గురించి అవసరమైన విచారణ జరిపి, దంపతుల వాదనలు విన్న తరువాత వారి వివాహం జరిగిందన్న విషయం ఇంకా పిటీషన్‌లోని ఇతర విషయాలు నిజమైనవని కోర్టు సంతృప్తి చెందాల్సి వుంటుంది.

No comments:

Post a Comment

Followers