Tuesday, July 6, 2010

రేప్ నేర నిరూపణ

రేప్ నేర నిరూపణ

July 6th, 2010

రేప్ అనేది తీవ్రమైన నేరం. ఈ నేరం నిరూపించాలంటే ముద్దాయి బాధితురాలి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా శారీరక సంభోగం జరిపాడని, ఎలాంటి అనుమానానికి తావు లేకుండా రుజువు చేయాల్సి వుంటుంది.
రేప్ జరిగిందని అనడానికి ఏ మాత్రం అంగ ప్రవేశం వున్నా అది రేప్ కిందే లెక్క. ఎంతవరకు జరిగిందనే విషయంతో సంబంధం లేదు. రేప్ కేసులో కనె్నపొర చిరిగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే వీర్యస్కలనం జరిగి వుండాల్సిన అవసరం లేదు. అంగప్రవేశం ఏ మాత్రం లేనప్పుడు అది రేప్‌గా పరిగణింపబడదు. అప్పుడు అది రేప్ చేయడానికి చేసిన ప్రయత్నంగా భావించొచ్చు.
వయస్సు గురించి భావన ఏమిటి?
భారతీయ శిక్షాస్మృతిలోని నెం.10లో స్ర్తి పురుషుడు అర్థాలని నిర్వచించారు. స్ర్తి అన్నప్పుడు ఏ వయస్సులో వున్న స్ర్తి అయినా అని అర్ధం. అంటే పసిపాపను కూడా ‘స్ర్తి’ అనే పిలుస్తారు. 90 ఏళ్ళ ముసలావిడను కూడా ‘స్ర్తి’ అనే పిలుస్తారు.
అలాగే ‘పురుషుడు’ అన్నప్పుడూ ఏ వయస్సులో వున్న పురుషుడైనా అని అర్ధం. మగవాడు, స్ర్తి అన్నప్పుడు వయస్సుతో నిమిత్తం లేదు.
ఇంగ్లీషు ‘లా’కి
మన ‘లా’కి భేదమేమిటి?
14 సంవత్సరాలలోపు వున్న వ్యక్తులు రేప్ చేయలేరన్న చట్టబద్ధమైన భావన ఇంగ్లీషు ‘లా’లో ఉంది. కానీ మన చట్టాల్లో అలాంటి భావన లేదు.
భారతీయ శిక్షాస్మృతిలోని సె.82 ఏడు సంవత్సరాలలోపు పిల్లలకి పూర్తి రక్షణని ఇస్తుంది. ఏడు సంవత్సరాలలోపు పిల్లలు ఏది చేసినా అది నేరంగా పరిగణించడానికి వీల్లేదు. సె.83లో మాత్రం ఒక్క షరతు వుంది. ఇది 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలలోపు వున్న పిల్లలకు వర్తిస్తుంది. తాను చేసిన చర్య స్వభావం, దాని ఫలితాలను అర్ధం చేసుకునే అతని మానసిక స్థితిని బట్టి వుంటుంది. అతను వాటిని సరిగ్గా అర్ధం చేసుకునే స్థితిలో లేనప్పుడు అది నేరం కాదు. 12 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఎలాంటి రక్షణ లేదు. కేసు యోగ్యతను బట్టి కేసు నిర్ణయించాల్సి వుంటుంది.
నేర నిరూపణ జరగాలంటే ప్రాసిక్యూషన్ ఏమి రుజువు చేయాల్సి వుంటుంది?
ముద్దాయికి శిక్ష పడాలంటే ప్రాసిక్యూషన్ ఈ విషయాలని రుజువు చేయాల్సి వుంటుంది.
* లైంగిక సంభోగం స్ర్తి పురుషునికి మధ్య జరిగి వుండాలి.
* ఆ సంభోగం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లేక ఆమె సమ్మతి లేకుండా జరిగిందని రుజువు చేయాలి.
* ఒకవేళ సమ్మతి ఇచ్చినట్లయితే ఆ సమ్మతి సె.375లో పేర్కొన్న సమ్మతై వుండాలి.
చట్టప్రకారం రేప్ అంటే ఏమిటి?
భారతీయ శిక్షాస్మృతిలోని సె.375 రేప్‌ని నిర్వచించింది. ఈ నిర్వచనం ప్రకారం ఎవరైనా స్ర్తిపై పురుషుడు జరిపే శారీరక సంభోగం. ఈ కింది ఆరు కారణాల్లో ఏదైనా వున్నప్పుడు దాన్ని రేప్ అంటారు. అవి-
1. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా.
2. ఆమె సమ్మతి లేకుండా.
3. ఆమెను గానీ, ఆమె ఆత్మీయులుగానీ గాయపరుస్తారనో చంపుతాననో బెదిరించి ఆమె సమ్మతి పొందినపుడు.
4. మతిస్థిమితం లేనప్పుడు, నిషాలో వున్నప్పుడు, తన అంగీకారం వల్ల జరగబోయే పరిణామాలు, ప్రభావాలు అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఆమె సమ్మతి పొందినపుడు.
6. పదహారేళ్ళలోపు వయసు వున్నప్పుడు, ఆమె సమ్మతి వున్నప్పటికీ, లేనప్పటికీ.
ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అంటే...
రేప్‌వల్ల జరిగే పరిణామాలు ప్రభావాలు తెలిసి అర్ధం చేసికొని వ్యతిరేకత చూపించినప్పటికీ రేప్ ఆమెపై జరిగినప్పుడు, ఆ చర్య ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినట్టుగా భావిస్తారు. రేప్ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు, ఆ చర్యకి ఆమె సమ్మతి లేదనే అర్ధం. కానీ రేప్ ఆమె సమ్మతి లేకుండా జరిగినప్పుడు అది తప్పనిసరిగా ఆమె ఇష్టానికి జరిగిందని అనడానికి వీల్లేదు.
ఇష్టానికి వ్యతిరేకంగా, సమ్మతి లేకుండా అనేవి రెండూ కూడా మెదడుకు సంబంధించిన చర్యలు. ఇష్టమనేది చాలా కఠినమైన పదం. ఏదైనా చర్య చేయాలన్నా వద్దన్నా గట్టి నిశ్చయం వుంటుంది. కానీ సమ్మతి అనేది ఉదాసీన వైఖరి. దీనికి క్రియాశీలకమైన వ్యతిరేకత వుండదు.
ఈ రెండు నిబంధనలు ఒకదానిమీద ఒకటి ఓవర్ లాప్ కావు. స్పృహలో వుండి తన మనసుమీద శరీరం మీద పూర్తి స్వేచ్ఛ వుండి ఇచ్చే చర్య ఇష్టం. కానీ సమ్మతి అనేది దీనికి పూర్తిగా వి

No comments:

Post a Comment

Followers